Home » Sports news
ప్రముఖ బాక్సర్లలో ఒకరైన మైక్ టైసన్ పేరు తెలియని వారు దాదాపు ఉండరని చెప్పవచ్చు. కానీ తాజాగా జరిగిన ఓ మ్యాచ్ ఫైట్‌లో 58 ఏళ్ల టైసన్‌ను 27 ఏళ్ల యూట్యూబర్ ఓడించారు. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెండోసారి తండ్రయ్యాడు. రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఈ విషయాన్ని రోహిత్, రితికా ధృవీకరించలేదు. అయితే పెర్త్ టెస్టులో రోహిత్ పాల్గొంటాడా లేదా అనే ప్రశ్న అందరిలో మెదులుతోంది.
బాక్సింగ్ లెజెండ్ సరిగ్గా 19 సంవత్సరాల విరామం తర్వాత మరోసారి బిగ్ బౌట్‌కు సిద్ధమయ్యాడు. భారత కాలమానం ప్రకారం నవంబర్ 16వ తేదీ ఉదయం 6.30 గంటలకు మైక్ టైసన్, యూట్యూబర్, బాక్సర్ జేక్ పౌల్‌తో పోరుతో తలపడనున్నారు. మ్యాచ్‌కు ముందు ఇద్దరు బాక్సర్ల వెయిటేజ్ ఈవెంట్ ..
ఈసారి ఐపీఎల్ వేలంలో ఏ క్రికెటర్ ఎంత ధర పలకబోతున్నాడు? ఏయే జట్లు ఎవరెవరిని దక్కించుకోబోతున్నాయి?. కొత్తగా రికార్డులు ఏమైనా బద్దలవుతాయా? అనే ఆసక్తికర చర్చలు క్రికెట్ ఫ్యాన్స్‌లో జరుగుతున్నాయి. దీనికి తోడు ఇటీవల ఫ్రాంచైజీలు అన్నీ రిటెన్షన్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించడంతో వేలంలో అందుబాటులో ఉండబోయేది ఏయే ఆటగాళ్లనేది క్లారిటీ వచ్చింది. దీంతో వేలంపై ఆసక్తి మరింత పెరిగింది.
అదే చెత్త బ్యాటింగ్.. అదే నిలకడలేని ఆటతీరు.. ముంబై టెస్టులోనూ బెంగళూరు, పూణే టెస్టుల ఫలితమే ఎదురైంది. న్యూజిలాండ్‌తో మూడవ టెస్ట్ మ్యాచ్‌లోనూ భారత్ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. 25 పరుగుల తేడాతో మరో ఓటమిని మూటగట్టుకుంది.
Rishabh Pant: ముంబై టెస్ట్‌లో భారత్-న్యూజిలాండ్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఇరు జట్లు నువ్వానేనా అంటూ తలపడుతుండటంతో ఎవరిది పైచేయో చెప్పలేని పరిస్థితి. అయితే రేసులో కాస్త వెనుకబడిన టీమిండియాను మళ్లీ పుంజుకునేలా చేసింది మాత్రం రిషబ్ పంత్ అనే చెప్పాలి.
Shubman Gill: టీమిండియా యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ తన సత్తా ఏంటో మరోమారు నిరూపించాడు. స్టార్లంతా ఫెయిలైన చోట బ్యాట్ అడ్డుపెట్టి నిలబడ్డాడు. న్యూజిలాండ్ బౌలర్లను క్లాస్ బ్యాటింగ్‌తో భయపెట్టాడు.
Ravindra Jadeja: టీమిండియాను ఓడించడం అంత ఈజీ కాదు. అందునా సొంతగడ్డ మీద మన జట్టును ఆపడం అంటే తలకు మించిన పనే. స్వదేశంలో మ్యాచ్ ఉంటే మనోళ్లు పులుల్లా చెలరేగి ఆడతారు. కానీ న్యూజిలాండ్‌తో సిరీస్‌లో అంతా తారుమారైంది. దీనిపై సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రియాక్ట్ అయ్యాడు.
అంతర్జాతీయ క్రికెట్‌కు మరో కీలక ఆటగాడు వీడ్కోలు పలికాడు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ మాథ్యూ వేడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ మేరకు మంగళవారం తన రిటైర్మెంట్ ప్రకటన విడుదల చేశాడు.
యు23 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని సాధించిన మూడవ భారతీయ రెజ్లర్‌గా చిరాగ్ నిలిచాడు.