Mike Tyson: పోరుకు ముందే యువ బాక్సర్ చెంప చెల్లుమనిపించిన మైక్ టైసన్.. 58 ఏళ్ల వయసులో పోటీకి సిద్ధమై..
ABN , Publish Date - Nov 15 , 2024 | 12:59 PM
బాక్సింగ్ లెజెండ్ సరిగ్గా 19 సంవత్సరాల విరామం తర్వాత మరోసారి బిగ్ బౌట్‌కు సిద్ధమయ్యాడు. భారత కాలమానం ప్రకారం నవంబర్ 16వ తేదీ ఉదయం 6.30 గంటలకు మైక్ టైసన్, యూట్యూబర్, బాక్సర్ జేక్ పౌల్‌తో పోరుతో తలపడనున్నారు. మ్యాచ్‌కు ముందు ఇద్దరు బాక్సర్ల వెయిటేజ్ ఈవెంట్ ..
బాక్సింగ్ పేరు చెప్తే అందరికీ గుర్తొచ్చే పేరు మైక్ టైసన్. బౌట్‌లోకి దిగితే ప్రత్యర్థులపై పంచ్‌లతో చెలరేగిపోయే మైక్ టైసన్ 19 ఏళ్ల క్రితం ఆటకు గుడ్‌బై చెప్పిన బాక్సింగ్ లెజెండ్ సరిగ్గా 19 సంవత్సరాల విరామం తర్వాత మరోసారి బిగ్ బౌట్‌కు సిద్ధమయ్యాడు. భారత కాలమానం ప్రకారం నవంబర్ 16వ తేదీ ఉదయం 6.30 గంటలకు మైక్ టైసన్, యూట్యూబర్, బాక్సర్ జేక్ పౌల్‌తో పోరుతో తలపడనున్నారు. మ్యాచ్‌కు ముందు ఇద్దరు బాక్సర్ల వెయిటేజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో మైక్ టైసన్, పౌల్ ఎదురుపడ్డారు. కోపంతో ఊగిపోయిన టౌసన్ వేదికపై జేకే పౌల్ చెంప చెల్లుమనిపించాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఇద్దరినీ అడ్డుకుని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. ఈ ఘటనతో ఒక్కసారిగా అక్కడున్నవారంతా షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టైసన్ దాడి చేయడానికి గల కారణాలు తెలియరాలేదు. కొద్దిగంటల్లో ఈవెంట్ జరగనున్న నేపథ్యంలో మైక్ టైసన్ చెంప దెబ్బ కొట్టడంతో తీవ్ర సందిగ్ధత నెలకొంది. పోటీ రద్దుపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. బాక్సింగ్ కింగ్‌గా ప్రసిద్ధి చెందిన మైక్ టైసన్.. ఆటకు విరామం ప్రకటించడంతో పాటు.. తన ఆస్తులు మొత్తం పొగొట్టుకున్నారు. తాజాగా ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏర్పాటుచేసిన ఈవెంట్‌లో ఆడేందుకు టైసన్ ఒప్పుకున్నాడు. ప్రధానంగా తన అవసరాలు తీర్చుకోవడం కోసం డబ్బు అవసరమైన నేపథ్యంలో ఈ బాక్సింగ్ పోరుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. మైక్ టైసన్‌కు 20 మిలియన్ డాలర్లు ఇవ్వనున్నారు.
58 వర్సెస్ 27
బాక్సింగ్ లెజెండ్‌గా పేరు సంపాదించిన మైక్ టైసన్ 2005లో రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆటను వదిలేసిన తర్వాత వరుసగా ఆర్థిక కష్టాలను ఎదుర్కొన్నాడు. మొత్తం ఆస్తులను పొగొట్టుకున్నాడు. ఎప్పుడూ అగ్రెసివ్‌గా ఉండే టైసన్ దురుసు ప్రవర్తన కలిగిన వ్యక్తి. బాక్సింగ్‌లో 50-6 రికార్డు తన పేరుమీద ఉంది. ప్రస్తుతం టైసన్ వయసు 58 ఏళ్లు అతడితో తలపడే పౌల్ వయసు కేవలం 27 సంవత్సరాలు మాత్రమే.. ఏజ్ గ్యాప్ కారణంగా ఇద్దరి మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.
మరికొద్దిగంటల్లో..
మైక్ టైసన్ బాక్సింగ్‌ను ప్రస్తుత తరానికి చెందిన యువత అంటే 2000 సంవత్సరం తర్వాత పుట్టిన వ్యక్తులు చూసి ఉండకపోవచ్చు. 19ఏళ్ల విరామం తర్వాత తొలిసారి బౌట్‌లో టైసన్ దిగనున్నారు. టెక్సాస్‌లోని ఆర్లింగ్టన్ ఏటీ స్టేడియంలో భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 6.30 గంటలకు ఈవెంట్ జరగనుంది. తుదిపోరుకు కొద్ది గంటల ముందు వెయిటేజ్ ఈవెంట్‌లో పాల్గొనగా టైసన్ 228.4 పౌండ్ల బరువు ఉండగా.. 27 ఏళ్ల బాక్సర్ పౌల్ 272.2 పౌండ్ల బరువు ఉన్నాడు. టైసన్ చెంప దెబ్బ కొట్టడం పట్ల బాధ ఏమీ లేదని పౌల్ తెలిపాడు. టైసన్ ఆవేశంతో ఉన్నాడని, చాలా క్యూట్‌గా కొట్టాడని పౌల్ పేర్కొన్నాడు. మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే బాక్సింగ్ మొత్తం 8 రౌండ్లు సాగనున్నది. ఒక్కొక్క రౌండ్ రెండేసి నిమిషాల వ్యవధి ఉంటుంది. ఈ ఫైట్ కోసం టైసన్‌కు 20 మిలియన్ల డాలర్లు చెల్లించనున్నారు.
జులైలో జరగాల్సి ఉండగా..
పౌల్‌తో బాక్సింగ్ ఈవెంట్ జులై 20న జరగాల్సి ఉండగా టైసన్‌కు ఆరోగ్య సమస్య కారణంగా మ్యాచ్‌ను వాయిదా వేశారు. బాక్సర్ టైసన్ కెరీర్‌లో ఈ ఫైట్ ప్రత్యేకం కానుంది. 2005లో కెవిన్ మెక్‌బ్రౌడ్ చేతిలో ఓటమి తర్వాత టైసన్ రిటైర్ అయ్యారు.. సరిగ్గా టైసన్ చివరి మ్యాచ్ జరిగి 19 ఏళ్లవుతోంది. 20 ఏళ్ల వయసులో అంటే 1986లోనే టైసన్ ప్రపంచ హెవీ వెయిట్ టైటిల్ గెలిచాడు. ఆయన విన్నింగ్ రికార్డు 88 శాతంగా ఉంది. 58 ప్రొఫెషనల్ బౌట్లలో పాల్గొన్న పౌల్ 50 మ్యాచ్‌లు గెలిచాడు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here