Share News

Hockey Women's Jr. World Cup : అంత సులువేం కాదు

ABN , First Publish Date - 2023-11-29T05:30:29+05:30 IST

ఫుల్‌ ఫామ్‌లో ఉన్న భారత హాకీ జట్టు మహిళల జూనియర్‌ వరల్డ్‌క్‌పను గెలుపుతో ఆరంభించాలనుకొంటోంది. బుధవారం జరిగే తొలి మ్యాచ్‌లో

Hockey Women's Jr. World Cup :   అంత సులువేం కాదు

క్లిష్టమైన గ్రూప్‌లో భారత్‌

కెనడాతో తొలిపోరు నేడు

హాకీ మహిళల జూ. వరల్డ్‌కప్‌

రాత్రి 10.30 నుంచి, స్పోర్ట్స్‌ 18, జియో సినిమాలో...

శాంటియాగో (చిలీ): ఫుల్‌ ఫామ్‌లో ఉన్న భారత హాకీ జట్టు మహిళల జూనియర్‌ వరల్డ్‌క్‌పను గెలుపుతో ఆరంభించాలనుకొంటోంది. బుధవారం జరిగే తొలి మ్యాచ్‌లో కెనడాతో భారత్‌ తలపడనుంది. గత మూడు మ్యాచ్‌ల్లో కెనడాపై టీమిండియాదే పైచేయి కావడంతో టోర్నీలో శుభారంభం దక్కుతుందన్న ఆశాభావంతో ఉంది. గ్రూప్‌ ఆఫ్‌ డెత్‌గా భావిస్తున్న పూల్‌-సిలో భారత్‌తోపాటు జర్మనీ, బెల్జియం, కెనడా ఉన్నాయి. 2022లో నాలుగో స్థానంలో నిలిచిన మన అమ్మాయిలు తొలిసారి టైటిల్‌ నెగ్గాలనే పట్టుదలతో ఉన్నారు. 2013లో మూడో స్థానంలో నిలవడమే టోర్నీలో టీమిండియా అత్యుత్తమ ప్రదర్శన. పూల్‌లో టాప్‌-2లో నిలిచిన జట్లు నేరుగా క్వార్టర్స్‌కు అర్హత సాధిస్తాయి. 30న జర్మనీతో, వచ్చే నెల 2న బెల్జియంతో భారత్‌ తలపడనుంది.

Updated Date - 2023-11-29T05:31:00+05:30 IST