Share News

Kapil Dev : అతిగా ఆశలు పెట్టుకుంటే..అంతే మరి

ABN , First Publish Date - 2023-11-29T05:39:30+05:30 IST

భారత క్రికెట్‌ జట్టుపై అభిమానులు ఎప్పుడూ భారీగా ఆశలు పెట్టుకుంటారని, ఫలితం తేడాగా వస్తే బాధపడుతుంటారని దిగ్గజ ఆల్‌రౌండర్‌ కపిల్‌ దేవ్‌ అన్నాడు. ‘అతిగా ఆశలు

Kapil Dev : అతిగా ఆశలు పెట్టుకుంటే..అంతే మరి

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ జట్టుపై అభిమానులు ఎప్పుడూ భారీగా ఆశలు పెట్టుకుంటారని, ఫలితం తేడాగా వస్తే బాధపడుతుంటారని దిగ్గజ ఆల్‌రౌండర్‌ కపిల్‌ దేవ్‌ అన్నాడు. ‘అతిగా ఆశలు పెట్టుకుంటే హృదయాలు గాయపడతాయి. క్రీడను క్రీడగానే చూడాలి. ఎవరు బాగా ఆడితే వారిని గౌరవించాల్సిందే. ఎంతైనా భారతీయులకు భావోద్వేగాలు ఎక్కువే. టీమిండియా అద్భుతంగా ఆడింది. ఫైనల్‌ రోజు మనది కాదు అంతే’ అని కపిల్‌ వ్యాఖ్యానించాడు. కాగా భారత జట్టుపై అభిమానులు ఆశలు పెంచుకోవడానికి సోషల్‌ మీడియా, టీవీ చానెల్స్‌ కారణమని పాక్‌ మాజీ కెప్టెన్‌ వసీం అక్రమ్‌ అన్నాడు.

Updated Date - 2023-11-29T05:39:31+05:30 IST