India vs Australia 4th Test: ఆచితూచి వికెట్లు పడకుండా ఆడుతున్న భారత బ్యాటర్లు..
ABN , First Publish Date - 2023-03-11T11:58:57+05:30 IST
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా(India vs Australia) మధ్య నాలుగో టెస్టులో(Fourth Test) భారత్ బ్యాటర్లు నిలకడగా..
అహ్మదాబాద్: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా(India vs Australia) మధ్య నాలుగో టెస్టులో(Fourth Test) భారత్ బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. మూడో రోజు లంచ్ బ్రేక్(Lunch break) సమయానికి భారత్ స్కోర్ 37 ఓవర్లలో వికెట్ నష్టానికి 129 పరుగులు చేసింది. యువ క్రికెటర్ శుభమన్ అర్ధసెంచరీతో దూకుడుగా ఆడుతున్నాడు. గిల్ 119 బంతుల్లో 5 ఫోర్లు ఒక సిక్సర్ తో 65 రన్స్ చేసి నాటౌట్‌గా నిలవగా.. గిల్‌కి తోడుగా పుజారా 46 బంతుల్లో 1 ఫోర్ 22 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచి ఇన్నింగ్స్‌ను పరుగుల వరద కురిపిస్తున్నారు.
ఓవర్ నైట్ స్కోర్ 36/0తో మూడో రోజు ఇన్నింగ్స్‌ను శుభమన్ గిల్(Shubman Gill), కెప్టెన్ రోహిత్(Captain Rohit) క్రీజులోకి వచ్చి మొదలు పెట్టారు. ఆస్ట్రేలియా చేసిన భారీ స్కోర్ కు టీమిండియా(Team India) ఓపెనర్లు ధీటుగానే సమాధానం ఇస్తున్నారు. ఓపెనర్లు ఇద్దరు కలిసి అర్ధశతక భాగస్వామ్యం (half-century partnership)నెలకొల్పారు. ఇదే క్రమంలో గిల్, రోహిత్ నిలకడగా ఆడుతున్న స్కోర్‌ను పరుగులు పెట్టిస్తున్నారు. అనూహ్యంగా ఈ జోడీని ఆసీస్ బౌలర్ కునెమన్ విడదీశాడు. కునెమన్(Kuneman) బౌలింగ్‌లో రోహిత్ శర్మ(35) భారీ షాట్ ఆడే ప్రయత్నంలో లబుషేన్‌కి(Labushene) క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. దీంతో భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో తొలి వికెట్‌ను 74 పరుగుల వద్ద కొల్పోయింది.