IPL 2023: చెపాక్‌లో ముంబైపై 6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజ‌యం

ABN , First Publish Date - 2023-05-06T19:39:10+05:30 IST

చెపాక్ స్టేడియంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు దుమ్మురేపింది. ఆల్‌రౌండ్ ప్రతిభతో ప‌టిష్ట‌మైన ముంబై ఇండియ‌న్స్‌పై అద్భుత విజ‌యం సాధించింది..

IPL 2023: చెపాక్‌లో ముంబైపై 6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజ‌యం

IPL 2023 : చెపాక్ స్టేడియంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు దుమ్మురేపింది. ఆల్‌రౌండ్ ప్రతిభతో ప‌టిష్ట‌మైన ముంబై ఇండియ‌న్స్‌పై అద్భుత విజ‌యం సాధించింది. ఓపెన‌ర్ డెవాన్ కాన్వే(44), రుతురాజ్ గైక్వాడ్(30), శివం దూబే(26) వీరబాదుడుతో చెన్నై 6 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌పై గెలిచింది. ఆరో విజ‌యంతో ప్లే ఆఫ్ అవకాశాల‌ను ప‌దిలం చేసుకుంది.

సొంత గడ్డపై చెన్నై జ‌ట్టు అన్ని విభాగాల్లో స‌త్తా చాట్టింది. స్వ‌ల్ప ల‌క్ష్య ఛేద‌న‌లో చెన్నై ఓపెన‌ర్లు డెవాన్ కాన్వే (44), రుతురాజ్ గైక్వాడ్(30) ధాటిగా ఆడారు. వికెట్ కోల్పోకుండా 46 ప‌రుగులు చేశారు. అయితే పీయూష్ చావ్లా గైక్వాడ్‌ను ఔట్ చేసి ఈ జోడీని విడదీశాడు. డెవాన్ కాన్వే(18), అజింక్యా ర‌హానే(21)ను ఎల్బీగా వెన‌క్కి పంపాడు. అంబ‌టి రాయుడు(12), కాన్వే చెన్నై స్కోర్‌ను వంద దాటించారు. శివం దూబే మ‌రోసారి సిక్స‌ర్ల‌తో విరుచుకుప‌డ్డాడు. దీంతో చెన్నై 6 విక‌ట్ల తేడాతో గెలుపొందింది. ముంబై బౌలర్ల‌లో పీయూష్ చావ్లా రెండు, స్ట‌బ్స్, ఆకాశ్ మ‌ద్వాల్ ఒక్కో వికెట్ తీశారు.

సొంత గ్రౌండ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ బౌల‌ర్లు హ‌డ‌లెత్తించారు. దాంతో ముంబై ఇండియ‌న్స్ 8 వికెట్ల న‌ష్టానికి 139 ప‌రుగులు చేసింది. చెన్నై బౌలర్ల ధాటికి ముంబై టాపార్డ‌ర్ విఫలం కావడంతో నేహ‌ల్ వ‌ధేరా(64) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అర్ధ శ‌త‌కంతో రాణించాడు. ట్సిస్ట‌న్ స్ట‌బ్స్(20)తో క‌లిసి ధాటిగా ఆడుతూ ముంబై స్కోర్ వంద దాటించాడు. వీరిద్దరు ఐదో వికెట్‌ భాగస్వామ్యంలో 54 ప‌రుగులు జోడించారు. సూర్య‌కుమార్ యాద‌వ్‌(26), ఇషాన్ కిష‌న్(7), రోహిత్ శ‌ర్మ‌(0), డాషింగ్ బ్యాటర్ టిమ్ డేవిడ్(2) త‌క్కువ‌కే ఔట్ కావ‌డంతో ముంబై భారీ స్కోర్ చేయ‌లేక‌పోయింది. చెన్నై బౌల‌ర్ల‌లో మ‌థీశ ప‌థిర‌న మూడు, దీప‌క్ చాహ‌ర్, తుషార్ దేశ్‌పాండే రెండేసి వికెట్లు తీశారు. జ‌డేజాకు ఒక వికెట్ ద‌క్కింది.20 ఏళ్ల‌ ప‌థిర‌న 15 ప‌రుగ‌లిచ్చి మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఐపీఎల్‌లో వ్య‌క్తిగ‌తంగా ఉత్తమ ప్రతిభ కనబర్చాడు.

Updated Date - 2023-05-06T19:39:10+05:30 IST