ప్రజ్ఞానందకు రూ. 30 లక్షల నజరానా

ABN , First Publish Date - 2023-08-31T03:11:44+05:30 IST

గతవారం చెస్‌ ప్రపంచ కప్‌లో రజత పతకం సాధించి చరిత్ర సృష్టించిన తమిళనాడు చెస్‌ చిచ్చరపిడుగు ప్రజ్ఞానంద గురువారం స్వస్థలం చేరుకున్నాడు..

ప్రజ్ఞానందకు రూ. 30 లక్షల నజరానా

చెన్నై: గతవారం చెస్‌ ప్రపంచ కప్‌లో రజత పతకం సాధించి చరిత్ర సృష్టించిన తమిళనాడు చెస్‌ చిచ్చరపిడుగు ప్రజ్ఞానంద గురువారం స్వస్థలం చేరుకున్నాడు. ఈ సందర్భంగా చెన్నై విమానాశ్రయం వద్ద అభిమానుల నుంచి ఘన స్వాగతం అందుకున్న ప్రజ్ఞానంద.. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌ను ఆయన నివాసంలో కలుసుకున్నాడు. ఈ సందర్భంగా ప్రజ్ఞానందకు స్టాలిన్‌ ప్రోత్సాహక బహుమతి కింద రూ. 30 లక్షల చెక్‌తో పాటు మెమొంటోను అందజేసి సత్కరించారు. తన తల్లిదండ్రులకు ఎక్స్‌యూవీ 400 కారును బహుమతిగా ఇవ్వనున్నట్టు ప్రకటించిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రాకు ప్రజ్ఞానంద ధన్యవాదాలు తెలిపాడు. ‘ఆ కారును కొనుగోలు చేయాలనేది మా అమ్మానాన్నల కల. దాన్ని నిజం చేసినందుకు ఆనంద్‌ సర్‌కు కృతజ్ఞతలు’ అని ప్రజ్ఞ ట్వీట్‌ చేశాడు.

Updated Date - 2023-08-31T03:12:50+05:30 IST