Balagam movie: బలగం మొగిలయ్యకు ‘దళిత బంధు’ మంజూరు

ABN , First Publish Date - 2023-05-03T22:00:12+05:30 IST

వరంగల్‌ జిల్లా (Warangal District) దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన బుడిగజంగాల కళాకారుడు పస్తం మొగిలయ్య (balagam mogilaiah)కు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం దళిత బంధు..

Balagam movie: బలగం మొగిలయ్యకు ‘దళిత బంధు’ మంజూరు

నర్సంపేట: వరంగల్‌ జిల్లా (Warangal District) దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన బుడిగజంగాల కళాకారుడు పస్తం మొగిలయ్య (balagam mogilaiah)కు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం దళిత బంధు పథకాన్ని (Dalitha Bandhu Scheme) మంజూరు చేస్తూ కలెక్టర్‌ ప్రావీణ్యకు ఉత్తర్వులను జారీ చేసింది. ఇటీవల విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందిన ‘బలగం’ సినిమాలో మొగిలయ్య పాటపాడి ప్రజల హృదయాలను కదిలించిన విదితమే. ఈ క్రమంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, జడ్పీ ఫ్లోర్‌లీడర్‌ పెద్ది స్వప్న నర్సంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి పస్తం మొగిలయ్య దంపతులను పిలిపించుకొని, వారికి దళితబంధు పథకం మంజూరైన విషయాన్ని చెప్పారు. ఈ సందర్భంగా వారి యోగక్షేమాలను తెలుసుకొని, శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. కాగా, అనారోగ్యంతో బాధపడుతున్న తనకు ఉచిత వైద్యంతో పాటు దళితబంధు పథకాన్ని మంజూరు చేసినందుకు మొగిలయ్య దంపతులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2023-05-03T22:00:12+05:30 IST