Delhi Liquor Scam: అరుణ్ పిళ్ళై రిమాండ్ రిపోర్ట్‌లో అనేకసార్లు కవిత పేరు

ABN , First Publish Date - 2023-03-07T18:22:22+05:30 IST

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసు (Delhi Liquor Scam)లో అరస్టైన అరుణ్ రామచంద్ర పిళ్ళై (Arun Ramachandra Pillai) రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Delhi Liquor Scam: అరుణ్ పిళ్ళై రిమాండ్ రిపోర్ట్‌లో అనేకసార్లు కవిత పేరు

హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసు (Delhi Liquor Scam)లో అరస్టైన అరుణ్ రామచంద్ర పిళ్ళై (Arun Ramachandra Pillai) రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అరుణ్ పిళ్ళై రిమాండ్ రిపోర్ట్‌ (Remand Report)లో అనేకసార్లు ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) పేరు ప్రస్తావించారు. అలాగే పిళ్ళై రిమాండ్ రిపోర్ట్‌లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి (Magunta Srinivasulureddy), ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి పేర్లు కూడా ఉన్నాయి. ‘‘కవిత బినామీ అరుణ్ రామచంద్ర పిళ్ళై. మాగుంట శ్రీనివాసులురెడ్డి బినామీ ప్రేమ్ రాహుల్. కవిత ప్రయోజనాలు కాపాడేందుకే సౌత్‌గ్రూప్‌లో పిళ్ళై పనిచేశారు. ఇండో స్పిరిట్‌లో పిళ్ళైకి 32.5% వాటా, ప్రేమ్ రాహుల్‌కి 32.5 % వాటా ఉంది. పిళ్ళై, బుచ్చిబాబు, అభిషేక్‌లు సిండికేట్‌ తయారు చేశారు. సిండికేట్‌తో ఢిల్లీ లిక్కర్ బిజినెస్‌లో 30% వాటా దక్కించుకున్నారు. సౌత్‌గ్రూప్ నుంచి ఆప్‌కి ముడుపులు చేర్చడంలో పిళ్ళై కీలక పాత్ర ఉంది. కవిత ప్రతినిధిగా అరుణ్ పిళ్ళై వ్యవహరించారు. అరుణ్ పిళ్ళై సహా అనేక మంది నిందితులు.. కవిత బినామీలమని వాంగ్మూలం ఇచ్చారు’’ అని ఈడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది.

బీఆర్‌ఎస్ వర్గాల్లో టెన్షన్.. టెన్షన్

తాజా పరిస్థితిని బట్టి చూస్తే.. ఈ లిక్కర్‌ స్కామ్‌తో కవిత పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారనే వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గతంలోనే 28 సార్లు కవిత పేరును ఈడీ ప్రస్తావించింది. ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పన సమయంలో.. కవిత, మాగుంట రాఘవ, అరబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్‌ రెడ్డి, అభిషేక్‌ బోయినపల్లి, ఆడిటర్‌ బుచ్చిబాబు, పెర్నార్డ్‌ రికార్డ్‌కు చెందిన బినయ్‌ బాబు పలుమార్లు ఆప్‌ నేతలతో భేటీ అయ్యారని, హోల్‌సేల్‌, రిటైల్‌ ఉత్పత్తిదారులతో కుమ్మక్కై కార్టెల్‌(సిండికేట్‌)ను ఏర్పాటు చేశారని ఈడీ స్పష్టం చేసింది. కవిత, మాగుంట రాఘవ, శరత్‌రెడ్డి నిర్వహిస్తున్న సౌత్‌గ్రూప్.. ఈ కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిందని దినేశ్‌ అరోరా వాంగ్మూలాన్ని ఉటంకిస్తూ పేర్కొంది. అరుణ్‌పిళ్లై, అభిషేక్‌ బోయినపల్లి, బుచ్చిబాబులు సౌత్‌గ్రూ‌ప్ తరఫున ఢిల్లీలో ప్రాతినిధ్యం వహించినట్లు తెలిపింది. ఈ కేసులో రామచంద్ర అరుణ్ పిళ్ళైను అరెస్ట్ చేశారు. దీంతో రేపొద్దున ఏం జరుగుతుందో ఏమో అని బీఆర్ఎస్ (BRS) శ్రేణుల్లో టెన్షన్ పెరిగిపోతోంది.

Updated Date - 2023-03-07T18:22:22+05:30 IST