పారదర్శక పాలన అందించాలి

ABN , First Publish Date - 2023-01-24T01:23:55+05:30 IST

నలుగురు సీఎంలు, ఒక మాజీ సీఎం చేతులమీదుగా ప్రారంభమైన ఖమ్మం కలెక్టరేట్‌ నుంచి పారదర్శకమైన పాలనను అందించి.. అభివృద్ధిలో ఖమ్మాన్ని ఆదర్శంగా నిలపాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సూచించారు.

పారదర్శక పాలన అందించాలి
ఖమ్మం కలెక్టరేట్‌లో ప్రజావాణి ప్రారంభంలో మాట్లాడుతున్న మంత్రి

222.jpgబూడిదంపాడులో ‘కంటివెలుగు’ కళ్లజోళ్లు అందిస్తున్న మంత్రి

రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌

ఖమ్మం కొత్త కలెక్టరేట్‌లో ప్రజావాణిని ప్రారంభించిన మంత్రి

‘వాడవాడకు పువ్వాడ’లో భాగంగా నగరంలో పర్యటన

కంటివెలుగు కార్యక్రమ నిర్వహణ పరిశీలన

ఖమ్మం, జనవరి 23 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : నలుగురు సీఎంలు, ఒక మాజీ సీఎం చేతులమీదుగా ప్రారంభమైన ఖమ్మం కలెక్టరేట్‌ నుంచి పారదర్శకమైన పాలనను అందించి.. అభివృద్ధిలో ఖమ్మాన్ని ఆదర్శంగా నిలపాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సూచించారు. సోమవారం ఖమ్మం నూతన కలెక్టరేట్‌ను సందర్శించిన ఆయన కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ నేతృత్వంలో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని కొత్త కలెక్టరేట్‌లో ప్రారంభించి మాట్లాడారు. భారతదేశంలో ఏ కలెక్టర్‌కు, కలెక్టరేట్‌కు దక్కని అవకాశం ఖమ్మం కలెక్టర్‌కు, కలెక్టరేట్‌కు దక్కిందని, ఈ కలెక్టరేట్‌ ప్రారంభానికి నలుగురు ముఖ్యమంత్రులు, ఒక మాజీ ముఖ్యమంత్రి హాజరుకావడం గొప్ప విషయమన్నారు, వారందరి ఆకాంక్షలకు అనుగుణంగా ఖమ్మం కలెక్టరేట్‌ ఉద్యోగులు, అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాకు మంచిపేరు తేవాలని, అధునాతన సౌకర్యాలను సద్వినియోగించుకుని. ప్రజల విజ్ఞప్తులను సత్వరం పరిష్కరించి సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని కోరారు. నిరంతర పర్యవేక్షణతో ఈ కలెక్టరేట్‌ నిర్మాణాన్ని సకాలంలో పూర్తిచేయగలిగామని, కలెక్టర్‌ కూడా ప్రత్యేక చొరవతో పనులు పర్యవేక్షించారన్నారు. ప్రారంభోత్సవానికి ఇచ్చిన ముఖ్యమంత్రులు కూడా ఖమ్మంకలెక్టరేట్‌ను చూసి సంతోషం వ్యక్తంచేశారని తెలిపారు. ఇక పాత కలెక్టరేట్‌ భవనాలను ఖమ్మం వైద్య కళాశాలకు వినియోగిస్తామన్నారు. ఇక మంత్రి పువ్వాడ ప్రజవాణి కార్యక్రమాన్ని ప్రారంభించగా, కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ ప్రజలనుంచి వినతిపత్రాలు స్వీకరించారు. అంతకుముందు వాడవాడకు పువ్వాడ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం నగరంలోని 6వడివిజనలో పర్యటించిన ఆయన ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. పాత కార్పొరేషన భవనలో బస్తీదవాఖానాను ప్రారంభించి కంటి వెలుగు కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం రఘునాథపాలెం మండలం బూడిదెంపాడులో కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రి పర్యటనలో ఖమ్మం నగరపాలక సంస్థ మేయర్‌ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన బచ్చు విజయ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-24T01:23:56+05:30 IST