Share News

కొదమ సింహాల

ABN , First Publish Date - 2023-11-29T04:39:15+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ గెలుస్తారా!? పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పైచేయి సాధిస్తారా!? ఇద్దరు దిగ్గజాలనూ ఓడించి బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి జెయింట్‌ కిల్లర్‌గా ఆవిర్భవిస్తారా

కొదమ సింహాల

కామారెడ్డిలో కేసీఆర్‌, రేవంత్‌ రెడ్డి హోరాహోరీ..

దిగ్గజాలను ఢీకొంటున్న బీజేపీ అభ్యర్థి కాటిపల్లి

ముగ్గురిలో ఎవరు గెలిచినా సంచలనమే!

కేటీఆర్‌ కనుసన్నల్లోనే బీఆర్‌ఎస్‌ ప్రచారం

నెల రోజుల్లోనే రూ.275 కోట్ల నిధుల వరద

పార్టీకి తలనొప్పిగా సమన్వయలోపం

రేవంత్‌ పోటీతో బలోపేతమైన కాంగ్రెస్‌

స్థానికత సెంటిమెంట్‌తో బీజేపీ ముందుకు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ గెలుస్తారా!? పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పైచేయి సాధిస్తారా!? ఇద్దరు దిగ్గజాలనూ ఓడించి బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి జెయింట్‌ కిల్లర్‌గా ఆవిర్భవిస్తారా!? రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ప్రశ్నలివి! ఇప్పుడు ఎవరిని కదిపినా అసెంబ్లీ ఎన్నికల గురించే మాట్లాడుతున్నారు! అందులోనూ, ప్రతి ఒక్కరి దృష్టి గజ్వేల్‌ కంటే కూడా కామారెడ్డిలో జరుగుతున్న బిగ్‌ ఫైట్‌పైనే ఉంది! నిజానికి, ఇక్కడ ద్విముఖ పోటీయేనని అంతా అనుకున్నారు! కానీ, మూడు పార్టీల నేతల మధ్య హోరాహోరీ పోరుతో ఇక్కడ పోటీ రసవత్తరంగా మారింది! అందుకే, ఇక్కడ ఎవరు గెలిచినా సంచలనమే!!

ముఖ్యమంత్రి కేసీఆర్‌ గెలుస్తారా!? పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పైచేయి సాధిస్తారా!? ఇద్దరు దిగ్గజాలనూ ఓడించి బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి జెయింట్‌ కిల్లర్‌గా ఆవిర్భవిస్తారా!? రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ప్రశ్నలివి! ఇప్పుడు ఎవరిని కదిపినా అసెంబ్లీ ఎన్నికల గురించే మాట్లాడుతున్నారు! అందులోనూ, ప్రతి ఒక్కరి దృష్టి గజ్వేల్‌ కంటే కూడా కామారెడ్డిలో జరుగుతున్న బిగ్‌ ఫైట్‌పైనే ఉంది! నిజానికి, ఇక్కడ ద్విముఖ పోటీయేనని అంతా అనుకున్నారు! కానీ, మూడు పార్టీల నేతల మధ్య హోరాహోరీ పోరుతో ఇక్కడ పోటీ రసవత్తరంగా మారింది! అందుకే, ఇక్కడ ఎవరు గెలిచినా సంచలనమే!!

రైతులు, మహిళలు, యువత ఎవరి వైపో!

కామారెడ్డి నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపోటములను రైతులు, మహిళలు, యువత ఓట్లే ప్రభావితం చేయనున్నాయి. ఈ మూడు వర్గాల ఓట్లు ఎవరి వైపు మొగ్గు చూపితే వారు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడి రైతాంగానికి ప్రధానంగా సాగునీటి సమస్య ఉంది. మాచారెడ్డి, రామారెడ్డి, బీబీపేట, దోమకొండ, భిక్కనూరు, రాజంపేట, కామారెడ్డి మండలాలకు సాగునీటి వసతులు లేవు. రైతులు వర్షాలపైనే ఆధారపడి పంటలు సాగు చేస్తుంటారు. ఈ ప్రాంత రైతాంగానికి సాగునీటిని అందించేందుకు కాళేశ్వరం 22వ ప్యాకేజీ పనులు తొమ్మిదేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. వీటిని పూర్తి చేసి సాగునీరు అందించే వారికే ఓట్లు వేస్తామని రైతులు స్పష్టం చేస్తున్నారు. అలాగే, కామారెడ్డి మున్సిపల్‌ పరిధిలో మాస్టర్‌ప్లాన్‌తో నష్టపోతున్న రైతులు సైతం ప్లాన్‌ను పూర్తిగా రద్దు చేసే వారికే తమ మద్దతు అని చెబుతున్నారు. నియోజకవర్గంలో మహిళల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా బీడీ కార్మికులు పరిశ్రమపై ఆధారపడి ఉన్నారు. తమకు ఉపాధి చూపిన వారికే ఓట్లు వేస్తామని యువత సైతం డిమాండ్‌ చేస్తోంది.

కేసీఆర్‌ పూర్వీకులది కోనాపూర్‌

సీఎం కేసీఆర్‌ స్వగ్రామం కామారెడ్డి నియోజకవర్గంలోని బీబీపేట మండలం కోనాపూర్‌ (అప్పటి పోసానిపల్లి) గ్రామం. కేసీఆర్‌ తల్లి వెంకటమ్మ స్వస్థలం ఇది. ఆయన తండ్రి రాఘవరావుది రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్‌ మండలం మోహినికుంట. వివాహం తర్వాత రాఘవరావు కోనాపూర్‌కు ఇల్లరికం వచ్చారు. అప్పట్లో అప్పర్‌ మానేర్‌ ప్రాజెక్టు నిర్మించడంతో కోనాపూర్‌ గ్రామం ముంపునకు గురైంది. ఆ సమయంలో రాఘవరావుకు చెందిన వందలాది ఎకరాల భూములు ముంపునకు గురయ్యాయి. దీంతో, కేసీఆర్‌ కుటుంబం సిద్దిపేట జిల్లా చింతమడకకు వలస వెళ్లి స్థిర నివాసం ఏర్పరుచుకుంది. ఈ నేపథ్యంలోనే.. కోనాపూర్‌లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు ఆ మధ్య మంత్రి కేటీఆర్‌ వచ్చారు. ఆ సమయంలో తన నానమ్మ నివాసం ఉన్న కోనాపూర్‌లోని ఇల్లుని సందర్శించారు. తన పూర్వీకులను గుర్తు చేసుకున్నారు. తమ సొంత ఊరుకు ఏదో ఒకటి చేయాలనే భావనతో కోనాపూర్‌లోని ప్రభుత్వ పాఠశాలను రూ.2.5 కోట్ల సొంత నిధులతో నిర్మించారు. గ్రామంలో బీటీ, సీసీ రోడ్లు, కల్వర్టుల నిర్మాణం చేపట్టారు.

ఓటర్‌ కార్డు లేకున్నా ఓటెయ్యొచ్చు

ఈ ఏడాది కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్నవారికి ఎన్నికల సంఘం తపాలా శాఖ ద్వారా ఓటరు గుర్తింపు కార్డులు పంపుతోంది. అయితే.. చాలామందికి ఇవి ఇంకా అందలేదు. పాత ఓటర్లలో సైతం పలువురి వద్ద ఓటరు కార్డులు లేవు. మరి వీరంతా ఎలా ఓటెయ్యాలి? అంటే.. ఓటరు జాబితాలో పేరు ఉన్నా ఓటరు గుర్తింపు కార్డు లేనివారు ఇతర గుర్తింపు కార్డులు చూపించి ఓటు వేయొచ్చని అధికారులు చెబుతున్నారు. అవేంటంటే..

ూ ఆధార్‌ కార్డు ూ ఉపాధి హామీ కార్డు ూ పోస్టాఫీస్‌/బ్యాంక్‌ జారీ చేసిన ఫొటోతో కూడిన పాస్‌బుక్‌

ూ కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కార్డు ూ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ూ పాన్‌కార్డు ూ ఆర్జీఐ స్మార్ట్‌ కార్డు ూ ఇండియన్‌ పాస్‌పోర్టు ూ ఫొటోతో కూడిన పింఛన్‌ మంజూరు డాక్యుమెంట్‌ ూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ/ప్రభుత్వ రంగ/పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీలకు చెందిన ఫొటోతో కూడిన గుర్తింపు కార్డు ూ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ జారీ చేసిన అధికార గుర్తింపు పత్రం ూ దివ్యాంగులకు ఇచ్చే గుర్తింపు కార్డు.

హైదరాబాద్‌ సిటీ- ఆంధ్రజ్యోతి

ఓటేసే వేళ సెల్ఫీతో.. మీ ఓటు రద్దు!

పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు వేసినవారు.. తాము ఓటు వేసే సమయంలో దాన్ని సెల్‌ఫోన్‌లో ఫొటో(సెల్ఫీ), వీడియో తీసినా, దాన్ని ఇతరులకు చూపించినా నిబంధనల ప్రకారం ఎన్నికల అధికారులు ఆ ఓటర్‌ను బయటకు పంపించి, ఆ ఓటును 17-ఏలో నమోదు చేస్తారు. అంటే ఆ ఓటు లెక్కింపునకు రాదు. అలాగే.. అంధులైన ఓటర్లకు సహాయకులుగా వెళ్లే వారు ఆ అంధులు ఎవరికి ఓటేశారో ఎవరికీ చెప్పకూడదు.

అల్వాల్‌- ఆంధ్రజ్యోతి

డిపాజిట్‌ దక్కాలంటే..

ఫలానా పార్టీకి అన్ని నియోజకవర్గాల్లో డిపాజిట్లు గల్లంతయిపోయాయి.. అనే మాట వింటుంటాం. ఇంతకీ ఈ డిపాజిట్లు గల్లంతు కావడం ఏమిటీ అంటే.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్‌ సమయంలో కొంత సొమ్మును ధరావతుగా చెల్లించాల్సి ఉంటుంది. జనరల్‌ కేటగిరీ అభ్యర్థులైతే రూ.10 వేలు.. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.5 వేలు కట్టాలి. ఆనక, ఎన్నికల్లో పోలైన ఓట్లలో ఆరుశాతం (అంటే లక్ష ఓట్లు పోలైతే 6 వేల ఓట్లు) వారికి వస్తే.. ఓడిపోయినా వారు కట్టిన డిపాజిట్‌ సొమ్మును ఎన్నికల సంఘం తిరిగిస్తుంది. అంతకన్నా తక్కువ ఓట్లు పోలైతే.. డిపాజిట్‌ తిరిగి రాదు. దీన్నే.. డిపాజిట్‌ గల్లంతు కావడం అంటారు.

హైదరాబాద్‌ సిటీ- ఆంధ్రజ్యోతి

30 ఏళ్ల ఓటరు కార్డు 1957లో ప్రతిపాదన.. 1993లో సాకారం

ఓటరు గుర్తింపు కార్డు అమల్లోకి వచ్చి 30 ఏళ్లవుతోంది! దొంగ ఓట్లను అరికట్టేందుకుగాను.. 1957 సార్వత్రిక ఎన్నికల తర్వాత అప్పటి బెంగాల్‌ ప్రభుత్వం ఈ ప్రతిపాదన చేసింది. ఈమేరకు 1961లో కోల్‌కతా నైరుతి లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఓటరు గుర్తింపు కార్డులు జారీ చేసేలా అప్పటి ప్రభుత్వం చట్టంలో కొన్ని మార్పులు చేసింది. కానీ, అప్పటికి ఉన్న వనరుల కారణంగా అది సాధ్యం కాదని భావించి దాన్ని అమలు చేయలేదు. టీఎన్‌ శేషన్‌ సీఈసీ అయ్యాక.. ఓటరు గుర్తింపు కార్డులు ఇవ్వకుంటే ఎన్నికలు జరగవని ప్రకటించారు. దీంతో కేంద్రం 1993 ఆగస్టులో తొలిసారి గుర్తింపు కార్డులు జారీ చేసింది. అప్పట్లో అవి నలుపు, తెలుపు రంగుల్లో మాత్రమే ఉండేవి. 2015 నుంచి.. డిజిటల్‌ విధానంలో రంగుల్లో ముద్రిస్తున్నారు.

సైదాబాద్‌- ఆంధ్రజ్యోతి

జాతీయ, ప్రాంతీయ పార్టీలంటే?

బీజేపీ, కాంగ్రెస్‌ జాతీయ పార్టీలు! టీఆర్‌ఎస్‌ తన పేరును బీఆర్‌ఎ్‌సగా మార్చుకుని జాతీయ పార్టీగా కొత్త అవతారం ఎత్తింది. అయితే.. జాతీయ, ప్రాంతీయ పార్టీలను ఎన్నికల సంఘం ఎలా గుర్తిస్తుంది? అంటే.. దానికి కొన్ని ప్రాతిపదికలున్నాయి. ఒక సార్వత్రిక ఎన్నికల్లో ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఏవైనా నాలుగు రాష్ట్రాల్లోని ఓట్లలో నాలుగు శాతం ఓట్లను సంపాదిస్తే ఎన్నికల సంఘం ఆ పార్టీని జాతీయ పార్టీగా గుర్తిస్తుంది. ఒక పార్టీకి ఒక ప్రాంతంలో నాలుగు శాతం ఓట్లు వస్తే ప్రాంతీయ పార్టీగా చెబుతారు.

అల్వాల్‌- ఆంధ్రజ్యోతి

Updated Date - 2023-11-29T04:39:17+05:30 IST