Share News

జన్మ మీకే అంకితం

ABN , First Publish Date - 2023-11-28T23:18:28+05:30 IST

‘‘నా పనితనాన్ని గుర్తించి వరుసగా ఆరుసార్లు రికార్డుస్థాయి మెజార్టీ అందించి నన్ను గెలిపించిన మీకు ఈ జన్మ అంకితమని సిద్దిపేట బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి హరీశ్‌రావు భావోద్వేగంతో అన్నారు. మంగళవారం సిద్దిపేటలోని వేములవాడ కమాన్‌ నుంచి నర్సాపూర్‌ చౌరస్తా, లాల్‌ కమాన్‌, గాంధీ చౌరస్తా, విక్టరీ థియేటర్‌ చౌరస్తా, గణే్‌షనగర్‌, ముస్తాబాద్‌ చౌరస్తా మీదుగా పాత బస్టాండ్‌ వరకు ఆయన రోడ్‌షో నిర్వహించారు.

 జన్మ మీకే అంకితం
రోడ్‌ షోలో మంత్రి హరీశ్‌రావు

- మీ కుటుంబసభ్యుడిలా ఆదరించారు

- మీకు ఎంత చేసినా తక్కువే..

- దొంగలు, ద్రోహులను నమ్మకండి

- సిద్దిపేట ప్రగతిని చూసి ఓటేయ్యండి

- బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి హరీశ్‌రావు

- సిద్దిపేటలో రోడ్‌ షో.. అడుగడుగునా జననీరాజనం

సిద్దిపేట టౌన్‌, నవంబరు 28: ‘‘నా పనితనాన్ని గుర్తించి వరుసగా ఆరుసార్లు రికార్డుస్థాయి మెజార్టీ అందించి నన్ను గెలిపించిన మీకు ఈ జన్మ అంకితమని సిద్దిపేట బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి హరీశ్‌రావు భావోద్వేగంతో అన్నారు. మంగళవారం సిద్దిపేటలోని వేములవాడ కమాన్‌ నుంచి నర్సాపూర్‌ చౌరస్తా, లాల్‌ కమాన్‌, గాంధీ చౌరస్తా, విక్టరీ థియేటర్‌ చౌరస్తా, గణే్‌షనగర్‌, ముస్తాబాద్‌ చౌరస్తా మీదుగా పాత బస్టాండ్‌ వరకు ఆయన రోడ్‌షో నిర్వహించారు. పట్టణంలో మంత్రి హరీశ్‌రావుకు ప్రజలు, అభిమానులు పూలవర్షం కురిపిస్తూ గజమాలతో భారీ నీరాజనం, పలుకుతూ గద, ఖడ్గాన్ని బహుకరించారు. పాత బస్టాండ్‌ వద్ద మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. సిద్దిపేటను మీ అందరి భాగస్వామ్యంతో చక్కని అభివృద్ధి చేసుకున్నామన్నారు. దేశంలో, రాష్ట్రంలో సిద్దిపేట పేరు లేకుండా అవార్డు లేదన్నారు. సిద్దిపేటకు, మీకు ఎంత చేసిన తక్కువేనని, మీ కుటుంబ సభ్యుడిలా ఆదరించి, మీరు చూపిస్తున్న అభిమానం ఎనలేనిదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కనుకే సిద్దిపేట జిల్లాను చేసుకోగలిగామని తెలిపారు. ఏ పని చేసినా ప్రజలందరికీ మేలు జరగాలని చిత్తశుద్ధితో కష్టపడ్డానని ఆయన స్పష్టం చేశారు. సిద్దిపేట ప్రతి విషయంలో ప్రజల గౌరవం పెంచినట్లు, అభివృద్ధిలో ఎల్లలు దాటించినట్లు చెప్పారు. సిద్దిపేట ట్యాగ్‌లైన్‌ జిల్లా, గోదావరి నీరు, రైలు నినాదాలుగా ఉండేవని, సీఎం కేసీఆర్‌ సారథ్యంలో అవన్నీ సాధించుకున్నామని వివరించారు. రాష్ట్రంలో ప్రచార బాధ్యతలు అప్పగించడంతో, సిద్దిపేటలోని ప్రతి నాయకుడు, కార్యకర్త లాగా కష్టపడి ప్రచారం నిర్వహించనందుకు కృతజ్ఞతలు తెలిపారు. సిద్దిపేటలో చుక్క నీరు లేకుండేనని, అలాంటిది జలశయాలను తీసుకొచ్చి, రెండు పంటలు పండేలా రైతులకు సాగునీరనందిస్తున్నట్లు చెప్పారు. సిద్దిపేట అభివృద్దిని చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్న వారికి మీ ఓటుతో గుణపాఠం చెప్పాలని విజ్ఞప్తి చేశారు. నాయకుడనేవాడు ఎన్నికలప్పుడే మీ ముందుకు ఓట్ల కోసం వస్తారని, కాని నేను మీ కష్టసుఖాల్లో తోడుగా ఉంటూ, మీ పండుగలు, శుభకార్యాల్లో పాల్గొన్నట్లు ఈ సందర్భంగా గుర్తుచేశారు. కాంగ్రెస్‌, బీజేపీ నాయకులకు ఓట్లు అడిగే హక్కు లేదని, వారు ప్రజలకు చేసిందేమీ లేదని చెప్పారు. ఈ నెల 30న జరిగే పోలింగ్‌లో కారు గుర్తుకు ఓటేయ్యాలని, మీరు వేసే ఓటు ప్రగతికి వేసినట్లవుతారన్నారు. కార్యక్రమంలో నాయకులు రాజనర్సు, రోజారాధకృష్ణశర్మ, పాల సాయిరాం, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, మారెడ్డి రవీందర్‌రెడ్డి, కొండం సంపత్‌రెడ్డి, మోహన్‌లాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-28T23:18:29+05:30 IST