Share News

ప్రశాంత వాతావరణంలో ఓటేసేలా చర్యలు

ABN , First Publish Date - 2023-11-27T23:56:43+05:30 IST

శాసనసభ ఎన్నికల్లో డబ్బు, మద్యం, ఇతరత్రా ప్రలోభాలకు గురికాకుండా ఓటర్లు ప్రశాంత వాతావరణంలో ఓటు వేసేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఎన్నికల, పోలీస్‌, వ్యయ పరిశీలకులు జయశ్రీ ఎస్‌.బోస్‌, అబ్జర్వర్‌ మన్మోహన్‌ ప్రసాద్‌, వివేక్‌ కుమార్‌ సిన్హా, వెంకదేష్‌ బాబు, సోనమ్‌ టెన్సింగ్‌ బూటియా ఎన్నికల నిఘా బృందాలను, పోలీస్‌ అధికారులను ఆదేశించారు.

 ప్రశాంత వాతావరణంలో ఓటేసేలా చర్యలు

సాయంత్రం 5 తర్వాత ప్రచారం నిర్వహిస్తే

కేసు నమోదు చేసి వాహనాలను సీజ్‌ చేయాలి

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా

ఎన్నికల సంఘం ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలి

ఎన్నికల సాధారణ పరిశీలకులు

సిద్దిపేటఅగ్రికల్చర్‌/సిద్దిపేటటౌన్‌/వర్గల్‌,నవంబరు 27: శాసనసభ ఎన్నికల్లో డబ్బు, మద్యం, ఇతరత్రా ప్రలోభాలకు గురికాకుండా ఓటర్లు ప్రశాంత వాతావరణంలో ఓటు వేసేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఎన్నికల, పోలీస్‌, వ్యయ పరిశీలకులు జయశ్రీ ఎస్‌.బోస్‌, అబ్జర్వర్‌ మన్మోహన్‌ ప్రసాద్‌, వివేక్‌ కుమార్‌ సిన్హా, వెంకదేష్‌ బాబు, సోనమ్‌ టెన్సింగ్‌ బూటియా ఎన్నికల నిఘా బృందాలను, పోలీస్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ అధ్యక్షతన పోలింగ్‌ చివరి 72 గంటల్లో తీసుకోవాల్సిన చర్యలపై ఎన్నికల నిఘా బృందాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎన్నికల సంఘం ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని సూచించారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయినందున ఇప్పుడు దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం పైనే ఫోకస్‌ ఉందని చెప్పారు. జిల్లాలో మద్యం, డబ్బు ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని, వాటిపై దృష్టి సారించాలని సూచించారు. నేడు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ప్రచారానికి అనుమతి ఉన్నందున ఆ తర్వాత ప్రచారం నిర్వహించే వాహనాలను సీజ్‌ చేసి కేసు నమోదు చేయాలని చెప్పారు. అన్ని మద్యం దుకాణాలను క్లోజ్‌ చేయించాలని, ఎక్సైజ్‌ నిఘా బృందాలను పెంచి అక్రమ మద్యం తరలించే వారిపై కేసు బుక్‌ చేయాలని స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. పోలింగ్‌ సందర్భంగా పోలింగ్‌ కేంద్రాలకు ఈవీఎంల రవాణా, పోలింగ్‌ అనంతరం స్ట్రాంగ్‌ రూములకు తరలింపుపై పోలీస్‌శాఖ అత్యంత జాగ్రత్తతో చర్యలు తీసుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా ముందస్తుగా కేంద్ర రక్షణ బలగాల సహకారంతో పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో జిల్లా ఎన్నికల అధికారి, ఎన్నికల పరిశీలకుల వివరాలు అందుబాటులో ఉంటాయని, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగిన ఓటర్లు ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నందున ఓటర్ల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో సీపీ శ్వేత, జిల్లా అదనపు కలెక్టర్‌ గరిమా అగ్రవాల్‌, అడిషనల్‌ డీసీపీ అడ్మిన్‌ అందె శ్రీనివాస్‌, నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలి

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎన్నికల పోలీస్‌ అబ్జర్వర్‌ సోనమ్‌ టెన్సింగ్‌ బూటియా పోలీస్‌ అధికారులకు సూచించారు. సోమవారం బేగంపేట పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని వర్గల్‌ మండలం మజీద్‌పల్లి, నెంటూర్‌ గ్రామా ల్లో పోలింగ్‌ కేంద్రాలను పోలీసులతో కలిసి పరిశీలించారు. బైండోవర్‌ కేసులు, నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ ఎగ్జిక్యూటివ్‌, ప్రైవేట్‌గన్‌ డిపాజిట్‌, సీజ్‌ చేసిన డబ్బు, ఫ్లాగ్‌మార్చ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వర్క్‌ వివరాలను అడిగితెలుసుకున్నారు. శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడానికి ప్రతిఒక్కరూ సమష్ఠిగా విధులు నిర్వహించాలన్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని చెప్పారు. ఆయన వెంట తొగుట సీఐ కమలాకర్‌, బేగంపేట ఎస్‌ఐ అరుణ్‌లతో పాటు పోలీస్‌ అధికారులు ఉన్నారు.

వ్యయ వివరాలను అందించిన అభ్యర్థులు

ఎన్నికల్లో భాగంగా అభ్యర్థులు చేస్తున్న ఖర్చుల వ్యయ వివరాలను అందించినట్లు ఎన్నికల వ్యయ పరిశీలకుడు వెంకదే్‌షబాబు తెలిపారు. సోమవారం సిద్దిపేటలోని రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన వ్యయ పరిశీలకులు మూడో సమావేశం నిర్వహించారు. ఈ మేరకు అభ్యర్థులు, వారి తరఫున వారు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల వ్యయ పరిశీలకుడు వెంకదే్‌షబాబు మాట్లాడుతూ చివరి సమావేశం డిసెంబరు 28న కలెక్టర్‌ కార్యాలయంలో జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశంలో రిటర్నింగ్‌ అధికారి రమే్‌షబాబు, సహాయ ఎన్నికల వ్యయ పరిశీలకులు రాజశేఖరవర్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-27T23:56:52+05:30 IST