MLA Sayanna: నిలిచిపోయిన ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు

ABN , First Publish Date - 2023-02-20T18:41:53+05:30 IST

బీఆర్‌ఎస్ (BRS) కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న (MLA Sayanna) అంత్యక్రియల దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలని సాయన్న...

MLA Sayanna: నిలిచిపోయిన ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు

హైదరాబాద్: బీఆర్‌ఎస్ (BRS) కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న (MLA Sayanna) అంత్యక్రియల దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలని సాయన్న అనుచరులు డిమాండ్ చేశారు. చితిపై సాయన్న పార్థివదేహాన్ని ఉంచి ఆందోళనకు దిగారు. ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా అభిమానుల నినాదాలు చేశారు. దళిత ఎమ్మెల్యేకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేయకుండా అవమానించారని నిరసనకు దిగారు. కేసీఆర్ (KCR) డౌన్ డౌన్ అంటూ సాయన్న అభిమానుల నినాదాలు చేశారు. సాయన్న అంత్యక్రియల కార్యాక్రమాన్ని నిలిపివేసి ఆందోళనకు దిగారు. సాయన్న అనుచరుల ఆందోళనతో మంత్రులు అక్కడి వెళ్లిపోయారు. సినీ నటులకు ప్రభుత్వం అధికారలాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నప్పుడు.. సిట్టింగ్ ఎమ్మెల్యేకు అధికారలాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించపోవడం ఏమిటని ఆయన అనుచరులు ప్రశ్నిస్తున్నారు.

కార్డియాక్‌ అరెస్టుతో ఆదివారం ఉదయం సాయన్న తుది శ్వాస విడిచారు. సాయన్నకు గతంలో బైపాస్‌ సర్జరీ కూడా చేశారు. మధుమేహం కారణంగా ఇన్‌ఫెక్షన్‌ సోకిన ఎడమ కాలును కొన్నేళ్ల క్రితం తొలగించారు. ఆయనకు డయాలసిస్‌ కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఒక్కసారిగా వెన్నులో నొప్పి రావడంతో పాటు శరీరమంతా చమటలు పట్టడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. రెండు రోజుల అనంతరం ఆయన కోలుకున్నారని, ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు తరలిస్తారని భావిస్తున్న తరుణంలో ఆదివారం ఉదయం ఒక్కసారిగా స్ట్రోక్‌ వచ్చి మృతి చెందారు. సాయన్నకు భార్య గీత, ముగ్గురు కుమార్తెలు నమ్రత, లాస్య నందిత, నివేదిత ఉన్నారు.

Updated Date - 2023-02-20T18:52:34+05:30 IST