Share News

రెండుచోట్లా రేవంత్‌కు ఓటమి తప్పదు

ABN , First Publish Date - 2023-11-29T04:21:00+05:30 IST

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డికి కొడంగల్‌, కామారెడ్డిలలో ఓటమి తప్పదని మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు.

రెండుచోట్లా రేవంత్‌కు ఓటమి తప్పదు

కాంగ్రెస్‌ 20 స్థానాలు కూడా సాధించలేదు

సీఎం అవుతానంటున్న రేవంత్‌పై జాలేస్తోంది

కాంగ్రెస్‌ గ్యారెంటీలను నమ్మడానికి తెలంగాణ

ప్రజలు తిక్కవాళ్లు కాదు: హరీశ్‌రావు

మద్దూర్‌/సిద్దిపేట టౌన్‌, నవంబరు 28: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డికి కొడంగల్‌, కామారెడ్డిలలో ఓటమి తప్పదని మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు. మంగళవారం కొడంగల్‌ నియోజకవర్గంలోని మద్దూర్‌లో, సిద్దిపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు గ్యారెంటీల ఆశ చూపి కర్ణాటకలో అఽధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ అక్కడ చేతులెత్తేసిందన్నారు. కాంగ్రె్‌సకు అవకాశమిచ్చి తప్పు చేశామని కర్ణాటక ప్రజలు పశ్చాత్తాప పడుతున్నారన్నారు. ఇక్కడ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెబితే నమ్మడానికి తెలంగాణ ప్రజలు తిక్కవాళ్లు కారన్నారు. రాష్ట్రంలో 30 చోట్ల కాంగ్రె్‌సకు సక్రమంగా అభ్యర్థులు లేరని, 25 చోట్ల ఆ పార్టీ రెండో స్థానం కోసం బీజేపీతో పోటీ పడుతోందని, అక్కడ ఆ పార్టీకి మూడో స్థానం ఖాయమన్నారు. రాష్ట్రంలో 20 సీట్లు కూడా సాధించలేని కాంగ్రె్‌సలో తాను ముఖ్యమంత్రి అవుతానని రేవంత్‌ ప్రచారం చేసుకోవడం చూస్తే జాలేస్తోందన్నారు. సొంత పార్టీ నేతలే టికెట్ల పంపిణీ విషయంలో రేవంత్‌ రెడ్డిని విమర్శిస్తున్నారన్నారు. అమ్ముకున్న టికెట్ల డబ్బులను కొడంగల్‌లో వెదజల్లి గెలవడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాహుల్‌, ప్రియాంక గాంధీల సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో రెండు సీట్లు కూడా సాధించని వారు ఇక్కడ ప్రచారం చేయడమేమిటని ఎద్దేవా చేశారు.

Updated Date - 2023-11-29T04:27:11+05:30 IST