Share News

Viral News: పెళ్లైంది.. పద పద.. స్కోర్ చూద్దాం!

ABN , First Publish Date - 2023-11-19T18:06:23+05:30 IST

సిద్దిపేట(Siddipet)లోని ఓ ఫంక్షన్ హాళ్లో ఇవాళ జంట వివాహం జరిగింది. వరుడు, వధువుకి క్రికెట్ అంటే చాలా ఇష్టం. పైగా ఇవాళ వరల్డ్ కప్ ఫైనల్ కూడా ఉంది. మెడలో మూడు ముడులు వేయగానే అక్కడే ఏర్పాటు చేసిన స్క్రీన్‌లో భారత్ స్కోర్ చూడటానికి వధువు, వరుడు పరిగెత్తుకుంటూ కిందకు వచ్చారు.

Viral News: పెళ్లైంది.. పద పద.. స్కోర్ చూద్దాం!

సిద్దిపేట: క్రికెట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఎంత అర్జెంటు పని ఉన్నా.. పక్కాగా ఫాలో అవుతాం. అందులో ప్రపంచ కప్(Cricket World Cup) అంటే మిస్ అవుతామా? సిద్దిపేటకు చెందిన ఓ నవ యువ పెళ్లి జంటకు క్రికెట్ పై ఉన్న ఆసక్తి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సిద్దిపేట(Siddipet)లోని ఓ ఫంక్షన్ హాళ్లో ఇవాళ జంట వివాహం జరిగింది. వరుడు, వధువుకి క్రికెట్ అంటే చాలా ఇష్టం. పైగా ఇవాళ వరల్డ్ కప్ ఫైనల్ కూడా ఉంది. మెడలో మూడుముళ్లు పడగానే అక్కడే ఏర్పాటు చేసిన స్క్రీన్‌లో భారత్ స్కోర్ చూడటానికి వధువు, వరుడు పరిగెత్తుకుంటూ కిందకు వచ్చారు. స్కోర్ చూసి భారత్ విజయాన్ని ఆకాంక్షిస్తూ తిరిగి స్టేజీ పైకి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Updated Date - 2023-11-19T18:23:42+05:30 IST