Chandrababu: హైదరాబాద్‌ అభివృద్ధిలో విజన్ 2020 కనిపిస్తోంది: చంద్రబాబు

ABN , First Publish Date - 2023-05-14T16:49:30+05:30 IST

హైదరాబాద్‌ అభివృద్ధిలో విజన్ 2020 (Vision 2020) కనిపిస్తోందని, విజన్ 2047 లక్ష్యం పెట్టుకోవాల్సిన అవసరం ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు...

Chandrababu: హైదరాబాద్‌ అభివృద్ధిలో విజన్ 2020 కనిపిస్తోంది: చంద్రబాబు

సంగారెడ్డి: హైదరాబాద్‌ అభివృద్ధిలో విజన్ 2020 (Vision 2020) కనిపిస్తోందని, విజన్ 2047 లక్ష్యం పెట్టుకోవాల్సిన అవసరం ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) అభిప్రాయపడ్డారు. రుద్రారంలోని గీతం యూనివర్సిటీ (Gitam University)లో కౌటిల్య స్కూల్ ఆఫ్‌ పబ్లిక్ పాలసీ గ్రాడ్యుయేట్ కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విధానాల రూపకల్పన, సంస్కరణలు, పాలనలో టెక్నాలజీ అంశంపై ప్రసంగించారు. ప్రజల జీవితాలను ప్రభావితం చేయడంలో పబ్లిక్ పాలసీ కీలకమన్నారు. పబ్లిక్ పాలసీ సంస్థకు కౌటిల్య అనే మంచి పేరు పెట్టారని ప్రశంసించారు. కౌటిల్యుడి పేరు నిలబెట్టేలా విద్యార్థులు రాణించారని పిలుపునిచ్చారు. విజన్ 2020 ప్రకటించినప్పుడు కొందరు ఎగతాళి చేశారని గుర్తుచేశారు. దేశ ప్రగతిని సంస్కరణలకు ముందు.. తర్వాత అని చెప్పుకోవాలన్నారు. 25 ఏళ్లలో ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు.

Updated Date - 2023-05-14T16:49:30+05:30 IST