Share News

సీఎం కేసీఆర్‌తోనే అభివృద్ధి

ABN , First Publish Date - 2023-11-25T23:37:04+05:30 IST

సీఎం కేసీఆర్‌తోనే మానుకోట అభివృద్ధి చెందుతోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖమంత్రి హరీశ్‌రావు అన్నారు. మహబూబాబాద్‌ జిల్లాకేంద్రంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ గెలుపు కోరుతూ శనివారం మంత్రి రోడ్‌ షో నిర్వహించారు. స్థానిక వివేకానంద సెంటర్‌ నుంచి ప్రారంభమైన రోడ్‌షో పురవీధుల గుండా తహసీల్‌ సెం టర్‌ వరకు సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ గులాబీజెండా లేకుంటే మానుకోట జిల్లా అయ్యేదా...! మెడికల్‌ కాలేజీ వచ్చేదా.. హార్టికల్చర్‌ డిగ్రీ కళాశాల, మెడికల్‌ కళాశాల ఏర్పడేదా... పోడు పట్టాలు అందేవా.. అం టూ ఇంత అభివృద్ధి చేసినా సీఎం కేసీఆర్‌కు అండగా నిలవాలన్నారు.

సీఎం కేసీఆర్‌తోనే అభివృద్ధి
మానుకోట రోడ్‌షోలో ప్రసంగిస్తున్న హరీశ్‌రావు, అభివాదం చేస్తున్న బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌

ముఖ్యమంత్రికి అండగా నిలవాలి

బీఆర్‌ఎస్‌ పాలనలో 365 రోజులు జలకళ

పరాయి పార్టీలకు ఓటేసి రిస్క్‌లో పడొద్దు

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖమంత్రి హరీశ్‌రావు

మహబూబాబాద్‌, నవంబరు25 (ఆంధ్రజ్యోతి) : సీఎం కేసీఆర్‌తోనే మానుకోట అభివృద్ధి చెందుతోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖమంత్రి హరీశ్‌రావు అన్నారు. మహబూబాబాద్‌ జిల్లాకేంద్రంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ గెలుపు కోరుతూ శనివారం మంత్రి రోడ్‌ షో నిర్వహించారు. స్థానిక వివేకానంద సెంటర్‌ నుంచి ప్రారంభమైన రోడ్‌షో పురవీధుల గుండా తహసీల్‌ సెం టర్‌ వరకు సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ గులాబీజెండా లేకుంటే మానుకోట జిల్లా అయ్యేదా...! మెడికల్‌ కాలేజీ వచ్చేదా.. హార్టికల్చర్‌ డిగ్రీ కళాశాల, మెడికల్‌ కళాశాల ఏర్పడేదా... పోడు పట్టాలు అందేవా.. అం టూ ఇంత అభివృద్ధి చేసినా సీఎం కేసీఆర్‌కు అండగా నిలవాలన్నారు. తన నియోజకవర్గం సిద్ధిపేట కంటే మానుకోట రోడ్లు బాగా ఉన్నాయని కితాబిచ్చారు. రాష్ట్రం లో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక కేసీఆర్‌ సీఎం కావ డం ఖాయమని, ఇక్కడ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ గెలిస్తేనే అభివృద్ధి కొనసాగుతుందని అందుకోసం బీఆర్‌ఎ్‌సను గెలిపించాలని కోరారు. ఎవరో చెప్పిందివిని పరాయి పార్టీలకు ఓటువేస్తే రిస్క్‌తప్పదని రిస్క్‌ వద్దనుకుంటే కారుకు గుర్తుకు ఓటు వేయాలని సూచించారు.

అసెంబ్లీ ఎన్నికలో పౌరుషం చూపాలి..

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంపై మళ్లీ సమైక్యవాదుల దాడులుచేసే ప్రమాదముందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండి ఎన్నికల్లో మానుకోట పౌరుషం చూపాలని హరీ్‌షరావు అన్నారు. అభివృద్ధిలో తెలంగాణ దారిలో పడిందని అది కొనసాగాలంటే బీఆర్‌ఎ్‌సను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మానుకోట ఉద్యమ పౌరుషం గొప్పదని, సమైక్యవాదులు కాలు మోపేందుకు ప్రయత్నం చేసిన రోజున బుల్లెట్లకు ఎదురొడ్డి పోరాడిన చరిత్ర ఈ ప్రాంతానిదని చెప్పారు.

కర్ణాటకలో కాంగ్రెస్‌ వస్తే కరెంటు పోయింది..

కర్ణాటక రాష్ట్రంలో ఉన్న బీజేపీ పోయి కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఉన్న తొమ్మిది గంటల కరెంటు పోయి.. మూడు గంటల కరెంటు వస్తుందని మంత్రి హరీ్‌షరావు విమర్శించారు. కర్ణాటకలో కరెంట్‌ ఇవ్వలేనోళ్లు తెలంగాణకు వచ్చి నీతులు చెబుతున్నారని విమర్శించారు. మూడు గంటల కరెంట్‌ చాలని రేవంత్‌రెడ్డి అంటున్నారని, వ్యవసాయానికి మూడు గంటల కరెంట్‌ సరిపోతుందా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ హయంలో దొంగ కరెంట్‌ వచ్చేదని, అది రాత్రిపూట మాత్రమే ఉండడంతో పంట పొలాల వద్ద కరెంట్‌ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసిన రోజులను మరిచిపోవద్దన్నారు.

ఎస్సారెస్పీ కాలువల్లో సర్కార్‌, జిల్లెడు చెట్లు మొలిచేవని, సీఎం కేసీఆర్‌ పాలనలో 365 రోజులు జలకళ సంతరించుకుందాని, దీంతో చెరువులు నిండి రెండు పంటలు సమృద్దిగా పండుతున్నాయని పేర్కొన్నారు. రైతుబంధు వద్దని కాంగ్రెసోళ్లు దరఖాస్తు చేస్తే అది ఇవ్వోచ్చంటూ అనుమతి వచ్చిందని, శని, ఆదివారాలు బ్యాంకులకు సెలవని సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమ అయ్యి అన్నదాతల ఫోన్‌లు టింగు.. టింగుమంటూ మోగుతాయని చెప్పారు. రైతుబంధు పేరిట అన్నదాతలకు బిచ్చమేస్తున్నాడని, బూతులు మాట్లాడే నాయకులు కావాలా... భవిష్యత్‌ను తీర్చిదిద్దే నాయకుడు కావాలో ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్‌, బీజేపీ వాళ్ల మీటింగ్‌లో ఖాళీ కుర్చీలు..

రాష్ట్రంలో కాంగ్రెస్‌.. బీజేపీ వాళ్ల మీటింగ్‌లకు ఖాళీ కుర్చీలు దర్శనమిస్తే... బీఆర్‌ఎస్‌ సమావేశాలు మాత్రం జనప్రభంజనంలా కన్పిస్తున్నాయని మంత్రి హరీ్‌షరావు అన్నారు. మాట తప్పని... మడిమ తిప్పని నేత కేసీఆర్‌ అని చెప్పారు. బీఆర్‌ఎ్‌సను ఆదరించి మళ్లీ గెలిపించాలని, వచ్చేది బీఆర్‌ఎస్‌ సర్కారేనని, రూ.2 వేల పింఛన్‌ను రూ.5 వేలకు పెరుగుతుందన్నారు. ఇక దొడ్డుబియ్యం పోయి (స్వర్ణమసూరి) సన్నబియ్యం అందిస్తామని స్పష్టం చేశారు. దళితబంధు తరహాలోనే గిరిజన బంధు ఇచ్చి తీరుతామన్నారు.

ఈ కార్యక్రమంలో గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖమంత్రి సత్యవతిరాథోడ్‌, ఎంపీ మాలోతు కవిత, స్థానిక ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బానోత్‌ శంకర్‌నాయక్‌, మాజీ ఎంపీ అజ్మీర సీతారాంనాయక్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ ఆంగోతు బిందు, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరే్‌షరెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ పాల్వాయి రాంమోహన్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ ఫరీద్‌, బీరవెళ్లి భరత్‌కుమార్‌రెడ్డి, పర్కాల శ్రీనివా్‌సరెడ్డి, కేఎ్‌సఎన్‌.రెడ్డి, మార్నేని వెంకన్న, యాళ్ల మురళీధర్‌రెడ్డి, చిట్యాల జనార్థన్‌, గుండా రాజశేఖర్‌, నాయిని రంజిత్‌, ముత్యం వెంకన్న, బూర్ల ప్రభాకర్‌గౌడ్‌ పాల్గొన్నారు.

గులాబీ శ్రేణుల్లో జోష్‌..

మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బానోత్‌ శంకర్‌నాయక్‌ గెలుపున కోరుతూ నిర్వహించిన రోడ్‌షో విజయవంతమైంది. మంత్రి తన్నీరు హరీశ్‌రావు హాజరై పట్టణ పురవీధుల్లో అభివాదం చేస్తూ ర్యాలీలో పాల్గొనడం.. తహసీల్‌ సెంటర్‌లో ఉత్తేజపరిచే విధం గా మంత్రి ప్రసంగం ఉండడంతో బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో మరింత ఉత్సాహం పెరిగింది. రోడ్‌షోకు నియోజకవర్గ వ్యాప్తంగా పెద్దసంఖ్యలో రావడంతో పట్టణ వీధులన్ని గులాబీ మయంగా మారిపోయాయి. ఉద్యమనేతగా హరీశ్‌రావుకు అటు బీఆర్‌ఎస్‌ శ్రేణులు, ఇటు జనం నీరాజనాలు పలికారు. మానుకోట ఘటన సమయంలో ఉద్యమ జ్ఞాపకాలను ఆయన తన ప్రసంగంలో జోడించడంతో ఈ ప్రాంత బీఆర్‌ఎస్‌ యువనేతల్లో మరింత జోష్‌ నిండుకుంది.

Updated Date - 2023-11-25T23:37:11+05:30 IST