Share News

సమయం లేదు మిత్రమా...

ABN , First Publish Date - 2023-11-25T23:39:10+05:30 IST

ఎన్నికల ప్రచారానికి ఇంకా మూ డురోజుల వ్యవధి మాత్రమే మిగిలింది. మంగళవారం సాయంత్రం 5గంటలకు తెరపడనుంది. 30న పోలింగ్‌ జరగనున్నది. అంతకన్నా 24గంటల ముందే ప్ర చారానికి తెరపడనుండడంతో అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు చివరి అంకానికి తెరతీస్తున్నారు. ఇప్పటి వరకు అభ్యర్థులు ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థించారు. అగ్రనేతలతో భారీ బహిరంగ సభలను నిర్వహించారు.

సమయం లేదు మిత్రమా...

ఎల్లుండి సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి తెర

క్లైమాక్స్‌కు చేరిన ఎన్నికల పర్వం

తెరుచుకుంటున్న మూటలు

వ్యూహాల్లో బిజీగా మారిన అభ్యర్థులు

హనుమకొండ, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల ప్రచారానికి ఇంకా మూ డురోజుల వ్యవధి మాత్రమే మిగిలింది. మంగళవారం సాయంత్రం 5గంటలకు తెరపడనుంది. 30న పోలింగ్‌ జరగనున్నది. అంతకన్నా 24గంటల ముందే ప్ర చారానికి తెరపడనుండడంతో అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు చివరి అంకానికి తెరతీస్తున్నారు. ఇప్పటి వరకు అభ్యర్థులు ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థించారు. అగ్రనేతలతో భారీ బహిరంగ సభలను నిర్వహించారు. ప్రచారమంతా ఇ ప్పటి వరకు మాటలతో సాగింది. ఓటర్ల ను మరింతగా తమవైపు తిప్పుకునేందు కు చివరి అంకానికి తెరతీస్తున్నారు.

తాయిలాల పంపిణీ షురూ..

డబ్బులు, మద్యం, తాయిలాల పంపిణీకి శ్రీకారం చుట్టడం ద్వారా ఓటర్లను ఆకట్టుకునే పరోక్ష ప్రచారాన్ని అభ్యర్థులు తెరవెర వెనుక మొదలు పెట్టారు. ఈ బాధ్యతను కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో తమకు నమ్మకస్తులైన పార్టీ సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు అప్పగించారు. వారు ఇంటింటికీ తిరిగి ఎన్నికల ప్రచారం చేస్తున్న ముసుగులో ఓటుకు ఇంత అని ఓటర్లకు ముట్టచెబుతున్నారు. ఒక కుటుంబంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారో చూసి అందులోనూ వారు మొదటి నుంచి ఏ పార్టీ అభిమానులో తెలుసుకొని, తమ అభ్యర్థికి కచ్చితంగా ఓటు వేస్తారో లేదో నిర్ధారించుకొని మరీ నగదును పంపిణీ చేస్తున్నారు. ఇంకా ప్రచారం చేయాల్సిన ప్రాంతాలను గుర్తించి అక్కడికి అభ్యర్థి ఇప్పటికిప్పుడు వెళ్లి ఓట్లు అడగలేని పరిస్థితి దృష్ట్యా ఆ లోటును కార్యకర్తలు నోట్ల ద్వారా పూరిస్తున్నారు. గంపగుత్తగా ఓట్లను రాబట్టుకునే వ్యూహంలో భాగంగా ప్రచారం సందర్భంగా అభ్యర్థి ఇచ్చిన మాట మేరకు కుల, యువజన, మహిళా, ఉద్యోగ సంఘాలు, వివిధ చేతి వృత్తుల వారి సంఘాల ప్రతినిధులను రహస్య ప్రదేశాలకు రప్పించుకొని ముట్టచెబుతున్నారు. మందును పంపిణీ చేస్తున్నారు. విందులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. నిన్నమొన్నటి వరకు అభ్యర్థులు ఓటర్ల ఇంటికి వెళ్లగా ప్రచారం ముగింపునకు రావడంతో ఇప్పుడు కుల సంఘాల బాధ్యులు అభ్యర్థి ఉన్నచోటికే వచ్చి తమను తాము పరిచయం చేసుకొని ఓట్లు వేయిస్తామని భరోసా ఇచ్చి ఇచ్చింది పుచ్చుకొని వెళుతున్నారు.

తాయిలాల పంపిణీకి ప్రచారం గడువులో కొంత వెసులుబాటు ఉంటుంది. ప్రచారం ముగిసిన తర్వా త పోలింగ్‌ మధ్య ఉండే 24 గంటలు మరింత కీలక సమయం. ఆ కొద్దికాలంలోనే రాత్రికి రాత్రికి ఓటర్లను ప్రలోభపెట్టే మరో అసలు అంకాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడానికి కూడా అవసరమైన సరంజాన్ని అభ్యర్థులు ఇప్పటినుంచే వేరు వేరు ప్రాంతాల్లో రిజర్వు చేసి పెట్టుకుంటున్నారు. కొందరు ఇప్పటికే చేరవేశారు. ఇదిలావుండగా, ఎన్నికల ప్రచారం ముగుస్తుండడంతో పోలీసులు తమ నిఘాను మరింత పెంచా రు. ఎక్కడికక్కడ తనఖీలను ముమ్మురం చేశారు. ఇప్పటి వరకు పొరుగు జిల్లా, రాష్ట్రాల నుంచి డబ్బు, మద్యం అక్రమంగా రవాణా కాకుండా చెక్‌పోస్టుల వద్ద తనిఖీ చేసిన పోలీసులు ఇప్పుడు నియోజవకర్గంలోని ప్రధాన కూడళ్లు, ప్రధాన రహదారులపై తనఖీలను నిర్వహిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ జారీ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు వరంగల్‌ పశ్చిమ, పరకాల నియోజకవర్గంలో పోలీసుల తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న రూ.1,14,500 నగదు, రూ.1,89,700 విలువైన వస్తువులు, 42,622.61 లీటర్ల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 359 మందిపై ప్రొహిబిషన్‌ కేసులను నమోదు చేశారు. 143 మందిని అరెస్టు చేశారు. మద్యం అక్రమ రవాణా, పంపిణీ జరగకుండా 173 బెల్ట్‌షాపులను మూసివేశారు.

Updated Date - 2023-11-25T23:39:12+05:30 IST