Share News

విశ్వాస ఘాతకుడు రెడ్యా

ABN , First Publish Date - 2023-11-27T23:51:48+05:30 IST

సర్పంచ్‌ నుంచి మంత్రి వరకు కాంగ్రెస్‌ ద్వారానే అనేక పదవులు అనుభవించి, స్వార్థ రాజకీయాల కోసం బీఆర్‌ఎస్‌ దొరల పంచన చేరిన డీఎస్‌ రెడ్యానాయక్‌ కుటుంబ దందాలకు కాంగ్రెస్‌ ఓటుతో సమాధానం చెప్పాలని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. డోర్నకల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి డాక్టర్‌ జాటోతు రాంచంద్రునాయక్‌ విజయభేరి సభ ను మహబూబాబాద్‌ జిల్లా మరిపెడలో డీసీసీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్‌చందర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.

విశ్వాస ఘాతకుడు రెడ్యా
మరిపెడ కాంగ్రెస్‌ విజయభేరి సభలో మాట్లాడుతున్న పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, పక్కన డోర్నకల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి రాంచంద్రునాయక్‌

కాంగ్రె్‌సలో పదవులు అనుభవించి, గుండెలపై తన్నాడు..

ఆయన కుటుంబ దందాలకు ఓటుతో సమాధానం చెప్పాలి...

డోర్నకల్‌కు చీడలా దాపురించాడు

డాక్టర్‌ జాటోతు రాంచంద్రునాయక్‌ను 25 వేల మెజారిటీతో గెలిపించాలి

మరిపెడ బహిరంగ సభలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి

మహబూబాబాద్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి) : సర్పంచ్‌ నుంచి మంత్రి వరకు కాంగ్రెస్‌ ద్వారానే అనేక పదవులు అనుభవించి, స్వార్థ రాజకీయాల కోసం బీఆర్‌ఎస్‌ దొరల పంచన చేరిన డీఎస్‌ రెడ్యానాయక్‌ కుటుంబ దందాలకు కాంగ్రెస్‌ ఓటుతో సమాధానం చెప్పాలని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. డోర్నకల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి డాక్టర్‌ జాటోతు రాంచంద్రునాయక్‌ విజయభేరి సభ ను మహబూబాబాద్‌ జిల్లా మరిపెడలో డీసీసీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్‌చందర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ చిన్న ఉ ద్యోగం కోసం సీనియర్‌ నేత రామసహాయం సురేందర్‌రెడ్డి వద్దకు వెళ్లిన రెడ్యానాయక్‌కు సర్పంచ్‌, సమితి ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే, మంత్రి పదవులతో పాటు ఆ యన కూతురుకు కూడా పక్క నియోజకవర్గంలో ఎ మ్మెల్యేను చేస్తే కాంగ్రెస్‌ గుండెల మీద తన్ని దొరల పంచన చేరడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రెడ్యా కొడుకు బియ్యం దందా, భార్య ఇసుక దందా, కూతురు కమీషన్ల దందా కొనసాగిస్తూ ని యోజకవర్గ అభివృద్ధిని విస్మరించారని ధ్వజమెత్తారు.

కేజీ టు పీజీ విద్యావకాశాలు కల్పిస్తున్నట్లు బీఆర్‌ఎస్‌ ప్రగల్బాలు పలుకుతున్నప్పటికీ డోర్నకల్‌ నియోజకవర్గంలో ఒక్క ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాల లేకపోవడం రెడ్యా పనితీరుకు అద్దం పడుతోందన్నారు. ఈ ప్రాంత లంబాడీ బిడ్డలు చదువుకుంటే రాజకీయ చైతన్యంతో ప్రశ్నిస్తారని గిరిజనులను చదువుకు దూరం చేసేకుట్ర చేశారన్నారు. నాగార్జునసాగర్‌, కృష్ణనది జలాలు నియోజకవర్గం పక్క నుంచే వెళ్తున్నప్పటికి ఆ జలాలను ఇటు మళ్లించే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. జలాలు మళ్లించి ఉంటే పాతికేళ్ల కిందటే డోర్నకల్‌ నియోజకవర్గమంతా సస్యశ్యామలం అయ్యేదన్నారు.

రెడ్యానాయక్‌ కమీషన్ల దందా

కేసీఆర్‌ కుటుంబం దారిలోనే రెడ్యానాయక్‌ కుటుంబం కమీషన్ల దందా కొనసాగిస్తోందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయినా.. పదేళ్లుగా ప్రజల మధ్యనే పోరాటం కొనసాగిస్తున్న డాక్టర్‌ జాటోతు రాంచంద్రునాయక్‌ను 25 వేల మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేసీఆర్‌ అల్లుడు మంత్రి హరీ్‌షరావు నోటి దురుసుతోనే రాష్ట్ర ప్రజానీకానికి అందాల్సిన రూ.5 వేల కోట్లపై చిలుకు రైతుబంధు నగదు రైతాంగానికి అందకుండా పోయిందని విచారం వ్యక్తం చేశారు.

30న జరిగే ఎన్నికల్లో ప్రజలంతా అప్రమత్తంగా ఉండి డాక్టర్‌ రాంచంద్రునాయక్‌కు ఓట్లువేసి గెలిపించాలని కోరారు. డోర్నకల్‌ టికెట్‌ను మాలోతు నెహ్రూనాయక్‌ ఆశించారని, కానీ, సోనియాగాంధీ రాంచంద్రునాయక్‌ను అభ్యర్థిగా ప్రకటించారని వెల్లడించారు. పార్టీ పిలుపు మేరకు రాంచంద్రునాయక్‌ గెలుపు కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న నెహ్రూనాయక్‌ను కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక తగిన ప్రాధాన్యత ఇచ్చి గౌరవిస్తుందన్నారు. ఈ సందర్భంగా తాను మార్పు కావాలి అంటే కాంగ్రెస్‌ రావాలి అని ప్రజలతో పదే.. పదే రేవంత్‌రెడ్డి చెప్పించారు. చివరగా బైబై కేసీఆర్‌.. బైబై కేసీఆర్‌ అంటూ రెండు నిమిషాల పాటు తాను పలుకుతూ... ప్రజలతో చెప్పించారు.

ఈ సభలో మాజీ ఎంపీ రామసహాయం సురేందర్‌రెడ్డి, మహబూబాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి డాక్టర్‌ భూక్య మురళీనాయక్‌, మాజీ కేంద్ర మంత్రిపోరిక బలరాంనాయక్‌, సీనియర్‌ నాయకులు నూకల శ్రీరంగారెడ్డి, మాలోతు నెహ్రూనాయక్‌, వేం నరేందర్‌రెడ్డి, వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, కాలం రవీందర్‌రెడ్డి, లాలునాయక్‌, ఎర్ర నాగేశ్వర్‌రావు, బాదావత్‌ రామునాయక్‌, సత్యమనోరమ, నూనావత్‌ రాధ, సీపీఐ జిల్లా కార్యదర్శి విజయసారథి, డోర్నకల్‌ నియోజకవర్గ కార్యదర్శి నల్లు సుధాకర్‌రెడ్డి, మోహన్‌లాల్‌, మాద శ్రీను, అంబటి వీరభద్రం, ఒంటికొమ్ము యుగేందర్‌రెడ్డి, జాటోతు నెహ్రూనాయక్‌, బండి శ్రీను పాల్గొన్నారు.

Updated Date - 2023-11-27T23:51:50+05:30 IST