నన్ను ఇబ్బంది పెట్టకండి: ప్రీతిరెడ్డి..

ABN, First Publish Date - 2023-11-28T12:26:54+05:30 IST

హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో బోడుప్పల్, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్‌గా ఉన్న తనను కాంగ్రెస్ నేతలు వ్యక్తిగతంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ మంత్రి మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతి రెడ్డి ఆరోపించారు.

హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో బోడుప్పల్, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్‌గా ఉన్న తనను కాంగ్రెస్ నేతలు వ్యక్తిగతంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ మంత్రి మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతి రెడ్డి ఆరోపించారు. తాను బస చేస్తున్న హోటల్ వద్దకు కాంగ్రెస్ నేతలు వచ్చి తనపై దాడికి యత్నించారంటూ ఆమె మండిపడ్డారు. మహిళ అని చూడకుండా దుర్బాషలాడుతూ బెదిరింపులకు పాల్పడిన కాంగ్రెస్ అభ్యర్థి జంగయ్య యాదయ్య అనుచరులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రీతిరెడ్డి కోరారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-11-28T12:26:55+05:30