Share News

టిడ్కో ఇళ్లపై రూ.5,546 కోట్ల రుణం

ABN , Publish Date - Nov 21 , 2024 | 04:05 AM

గత ప్రభుత్వం వివిధ రూపాల్లో టిడ్కో ఇళ్లపై రూ.5546.48 కోట్ల రుణం తీసుకుందని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు.

టిడ్కో ఇళ్లపై రూ.5,546 కోట్ల రుణం

రంగులు మార్చడానికి 300 కోట్లు : నారాయణ

అమరావతి, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వం వివిధ రూపాల్లో టిడ్కో ఇళ్లపై రూ.5546.48 కోట్ల రుణం తీసుకుందని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. టిడ్కో ఇళ్లకు రంగులు మార్చడానికి రూ.300 కోట్లు ఖర్చు చేసిందని విమర్శించారు. బుధవారం శాసనమండలిలో టీడీపీ సభ్యులు తిరుమల నాయుడు, రామారావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు. టీడీపీపై కక్షతో గత ప్రభుత్వం ఇళ్ల లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపించారు.

Updated Date - Nov 21 , 2024 | 04:06 AM