Share News

Nellore : కారుపై పెద్దపులి దాడి!

ABN , Publish Date - Jun 18 , 2024 | 05:24 AM

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరినాయుడుపల్లి వద్ద నెల్లూరు-ముంబయి జాతీయ రహదారిపై సో మవారం ఉదయం ఓ పెద్దపులి కారుపై దాడి చేసింది. దీంతో ఆ కారు ముందుభాగం నుజ్జు నుజ్జు అయింది.

Nellore : కారుపై పెద్దపులి దాడి!

క్షేమంగా బయటపడిన ప్రయాణికులు

మర్రిపాడు, జూన్‌ 17: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరినాయుడుపల్లి వద్ద నెల్లూరు-ముంబయి జాతీయ రహదారిపై సో మవారం ఉదయం ఓ పెద్దపులి కారుపై దాడి చేసింది. దీంతో ఆ కారు ముందుభాగం నుజ్జు నుజ్జు అయింది. అందులో ప్రయాణిస్తున్న వారు క్షేమంగా బయటపడ్డారు. స్థానికులు, అటవీ అధికారు ల కథనం మేరకు.... కడప జిల్లా గోపవరం మండలం కాలువపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి నెల్లూరులోని కళాశాలలో చేరేందుకు కారులో బయలు దేరారు. కారు కదిరినాయుడుపల్లి సమీపంలోకి వచ్చేసరికి పెద్దపులి ఒక్కసారిగా దాడి చేసింది. కారు వేగంగా వెళ్తుండటంతో కారు ముందుభాగంలో పెద్దపులి చిక్కుకుంది. దీంతో రోడ్డుపై కొంత దూరం పెద్దపులిని కారు ఈడ్చుకుపోయింది. అనంతరం కారు బ్రేక్‌ వేసి అదుపు చేసిన వెంటనే తీవ్రగాయాలతో పెద్దపులి కుంటుకుంటూ అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. కారులో ఉన్న ఐదుగురు ప్రయాణికులు భయంతో హాహాకారాలు చేశారు. అయితే వారికి ఎలాంటి గాయాలు కాలేదు. విషయం తెలుసుకున్న జిల్లా అటవీశాఖాధికారి(డీఆర్వో) రవీంద్రవర్మ సిబ్బందితో సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలో పెద్దపులి పాద ముద్రలు సేకరిస్తున్నారు.

Updated Date - Jun 18 , 2024 | 05:24 AM