Share News

ఏపీకి అదనపు ఐపీఎ్‌సలు

ABN , Publish Date - Jul 27 , 2024 | 03:31 AM

రాష్ట్రానికి భారీగా కొత్త ఐపీఎ్‌సలు రాబోతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం చంద్రబాబు చేసిన అభ్యర్థన మేరకు కేంద్రం స్పందించి ఈ నిర్ణయం తీసుకుంది.

ఏపీకి అదనపు ఐపీఎ్‌సలు

కేడర్‌ స్ట్రెంత్‌ పెంచిన కేంద్ర హోంశాఖ

ఐపీఎ్‌సల సంఖ్య 144 నుంచి 174కు పెంపు

సీఎం చంద్రబాబు విన్నపంపై కేంద్రం స్పందన

విభజన తర్వాత అదనపు కేటాయింపు ఇప్పుడే!

అమరావతి, జూలై 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి భారీగా కొత్త ఐపీఎ్‌సలు రాబోతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం చంద్రబాబు చేసిన అభ్యర్థన మేరకు కేంద్రం స్పందించి ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి 144 మంది ఐపీఎ్‌సలను కేటాయించారు. అయినప్పటికీ పోలీసుల కొరత మాత్రం తీరలేదు. పైగా విభజన తర్వాత ప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలు చేసింది. దీంతో పాటు నిఘా వ్యవస్థ విభాగాల్లో, క్రైం విభాగాల్లో పోలీసు అధికారుల కొరత తీవ్రంగా ఉంది. విభజన తర్వాత ఐపీఎ్‌సల కొరతను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం తమకు పోలీసు సిబ్బందిని ఎక్కువ మందిని కేటాయించాలని కేంద్రాన్ని కోరినా ఫలితంలేకపోయింది. జగన్‌ కూడా కేంద్రానికి లేఖ రాశారు. అయితే, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేకసార్లు ఢిల్లీ వెళ్లి హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసినా ఏనాడు ఐపీఎ్‌సల సంఖ్య పెంచే అంశంపై మాట్లాడిన దాఖలాలు లేవు. ఎప్పుడూ తన సొంత వ్యవహారాలు, కేసుల విషయం తప్ప పాలన వ్యవహారాలపై దృష్టిపెట్టలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఢిల్లీ వెళ్లారు. హోంశాఖ మంత్రి అమిత్‌ షాను కలిసి రాష్ట్రంలో ఐపీఎ్‌సల కొరత, ఇతర అంశాలపై ఆయనకు వివరించారు. పైగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత నాలుగైదు సంవత్సరాల అనుభవం ఉన్న జూనియర్‌ ఐపీఎ్‌సలను ఎస్పీలుగా నియమించాల్సి వస్తోంది. దీనివల్ల జిల్లాల్లో లా అండ్‌ ఆర్డర్‌ సమస్యలతో పాటు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థ్థితులు ప్రభుత్వం ఎదుర్కొంటోంది. ఈ విషయాలు మొత్తం అమిత్‌ షాకు చంద్రబాబు వివరించారు. సీఎం చంద్రబాబు విన్నపం మేరకు కేంద్ర హోం శాఖ ఏపీకి ఐపీఎ్‌సల సంఖ్య పెంచింది. 144 మంది ఐపీఎ్‌సలున్న కేడర్‌ స్ర్టెంత్‌ను 174కు పెంచింది. దాదాపు 30 మంది ఐపీఎ్‌సలను అదనంగా కేటాయించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. డైరెక్టర్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా 121 మంది ఐపీఎ్‌సలు ఏపీల్లో విధులు నిర్వహించనున్నారు. 53 మందికి పదోన్నతుల ద్వారా ఐపీఎ్‌సలు కానున్నారు. ఇందులో 38 మంది వరకూ సెంట్రల్‌ డిప్యుటేషన్‌పై పని చేసే అవకాశం కల్పించారు. 23 మంది వరకూ స్టేట్‌ డిప్యుటేషన్‌పై వచ్చేందుకు కేంద్రం అనుమతిచ్చింది.

Updated Date - Jul 27 , 2024 | 03:31 AM