Share News

Amaravati : నూతన క్రిమినల్‌ చట్టాలను రద్దు చేయండి

ABN , Publish Date - Aug 09 , 2024 | 05:12 AM

నూతన క్రిమినల్‌ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టు వద్ద న్యాయవాదులు నిరసనకు దిగారు. గురువారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌...

Amaravati : నూతన క్రిమినల్‌ చట్టాలను రద్దు చేయండి

  • హైకోర్టు వద్ద న్యాయవాద సంఘాల నిరసన

అమరావతి, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): నూతన క్రిమినల్‌ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టు వద్ద న్యాయవాదులు నిరసనకు దిగారు. గురువారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌, ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ లాయర్స్‌, సివిల్‌ లిబర్టీస్‌ కమిటీ, సెంటర్‌ ఫర్‌ సోషల్‌ జస్టిస్‌ సంస్థల ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ నూతన క్రిమినల్‌ చట్టాల్లో తెచ్చిన సవరణలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లూరి మాధవరావు మాట్లాడుతూ నూతన చట్టాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో న్యాయవాదులు వై.కోటేశ్వరరావు, పాటిబండ్ల ప్రభాకరరావు, నర్రా శ్రీనివాసరావు, నంబూరి శ్రీమన్నారాయణ, యడవల్లి రమేశ్‌, సంపర శ్రీనివాసరావు, ఎస్‌.రమేశ్‌, ఇస్మాయిల్‌, భగత్‌సింగ్‌, మాధవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 09 , 2024 | 05:12 AM