Home » AP News
ఏపీలో 5 లక్షల ఉద్యోగాలు కల్పించటమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. టైర్ 2,3 సిటీస్‌లో కూడా ఐటీ స్పేస్ రావాల్సి ఉందని తెలిపారు. అందుకే ద్వితీయశ్రేణి నగరాల్లో కూడా కో వర్క్సింగ్ స్పేస్‌ను కల్పించేలా కార్యాచరణ చేపట్టామని అన్నారు.
పేదల బతుకుపై దెబ్బ కొట్టిన వ్యక్తి జగన్ అని బీజేపీ అధికార ప్రతినిధి యామినీ శర్మ ఆరోపించారు. జగన్ పాలనలో అన్ని వ్యవస్థల్లోనూ అవినీతి రాజ్యమేలిందని విమర్శించారు. మహిళలు, యువత, రైతులు, శ్రామికులు అన్ని రంగాల్లో అబివృద్ధి చెందాలనేది మోదీ లక్ష్యమని తెలిపారు.
రాష్ట్రంలో అన్ని లిఫ్ట్‌లు ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. తాళ్లూరు లిప్ట్కు సంబంధించి పీఎస్సీ పైపుల స్థానంలో ఎమ్మెస్ పైపుల ఏర్పాటుకు అంచనాలు రూపొందిస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన అతి కొద్ది సమయంలోనే సంక్షేమ హాస్టళ్లలో పరిస్థితులు బాగుపడ్డాయి. వైసీపీ హయాంలో నిధులు లేక ఇబ్బందులు ఎదుర్కొన్న పేద విద్యార్థులకు మేలు జరుగుతోంది. జిల్లాలో సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న ఎస్సీ వసతి గృహాలను మొదటి విడత కింద ఎపింక చేశారు. పది ఎస్సీ వసతి గృహాలు, కురుగుంటలోని అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో మౌలిక వసతులను మెరుగు...
వైసీపీ హయాంలో నాటి సీఎం జగన పర్యటనలకు కాన్వాయ్ ఏర్పాటు చేసిన వాహనదారులు అద్దె బిల్లుల కోసం కళ్లకు కాయలుకాచేలా ఎదురుచూస్తున్నారు. సీఎం కాన్వాయ్‌తోపాటు ఎమ్మెల్సీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలకు వాహనాలను సమకూర్చారు. వాహనాల అద్దెతోపాటు డ్రైవర్ బత్తా సొమ్ము రాలేదు. కొవిడ్ సమయంలో రోగులను ఆసుపత్రులకు తీసుకెళ్లడానికి, మృతదేహాలను తరలించడానికి పలువురు వాహనాలను సమకూర్చారు. నాలుగేళ్లు గడిచినా వారికి బిల్లులు చెల్లించలేదు....
హంద్రీనీవా కాలువకు కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. నిత్యం వర్షాలపైనే ఆధారపడి పంట వస్తుందో రాదోనని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీసిన రైతు ఆనందంతో పరవశించిపోతున్నాడు. హంద్రీనీవా కాలువ పరిధిలో పన్నేండేళ్లలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. రైతులు కాలువలో నీటిని తరలించుకుని పంటలను సాగు చేస్తున్నారు. కాలువ సమీపంలో ఉన్న పంట పొలాలన్నీ కళకళలాడుతున్నాయి. ఉరవకొండ నియోజకవర్గంలోని వజ్రకరూరు, బెళుగుప్ప మండలాల్లో ఈ ఏడాది 30వేల ఎకరాలకు పైగా పంటలను సాగు చేశారు. కాలువ ..
శ్రీ బాగ్ ఒడంబడిక ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఈనాటిది కాదు. స్వాతంత్ర్యానికి పూర్వమే 1937 నుంచి సీమ ప్రజల హృదయాల్లో ఉంది.
తుంగభద్ర బోర్డు పనుల్లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు ప్రస్తుతం బోర్డు ఉద్యోగుల పాలిట శాపంగా మారాయి.
ఆలూరు పోలీసు సర్కిల్ స్టేషన్ వివాదాలకు నిలయంగా మారింది. విధుల్లో చేరిన నాలుగు నెలలకే ఇద్జరు పోలీసు అధికారులు వీఆర్‌లోకి వెళ్లడం చర్చనీయాంశమైంది.
ఉపాధి హామీ పనుల్లో వేతనదారుల సంఖ్యను పెంచాలని కలెక్టర్ రాజకుమారి ఏపీఓ, ఎంపీడీఓలను ఆదేశించారు.