Share News

Hostels : వసతి వెలుగులు

ABN , Publish Date - Nov 21 , 2024 | 12:32 AM

కూటమి ప్రభుత్వం ఏర్పడిన అతి కొద్ది సమయంలోనే సంక్షేమ హాస్టళ్లలో పరిస్థితులు బాగుపడ్డాయి. వైసీపీ హయాంలో నిధులు లేక ఇబ్బందులు ఎదుర్కొన్న పేద విద్యార్థులకు మేలు జరుగుతోంది. జిల్లాలో సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న ఎస్సీ వసతి గృహాలను మొదటి విడత కింద ఎపింక చేశారు. పది ఎస్సీ వసతి గృహాలు, కురుగుంటలోని అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలలో మౌలిక వసతులను మెరుగు...

Hostels : వసతి వెలుగులు
Arrangement of meals for girl students under the petals in SC Girls Pre-Matric No-2 Hostel

రూ.1.35కోట్లతో మౌలిక వసతులు

భవనాలకు మరమ్మతులు.. రంగులు

ఆవరణలో ఎల్‌ఈడీ వెలుగులు

మారిన ఎస్సీ హాస్టళ్ల రూపురేఖలు

హర్షం వ్యక్తంచేస్తున్న విద్యార్థినులు

బీసీ హాస్టళ్ల బాగుకోసం కలెక్టర్‌కు నివేదిక

కూటమి ప్రభుత్వం ఏర్పడిన అతి కొద్ది సమయంలోనే సంక్షేమ హాస్టళ్లలో పరిస్థితులు బాగుపడ్డాయి. వైసీపీ హయాంలో నిధులు లేక ఇబ్బందులు ఎదుర్కొన్న పేద విద్యార్థులకు మేలు జరుగుతోంది. జిల్లాలో సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న ఎస్సీ వసతి గృహాలను మొదటి విడత కింద ఎపింక చేశారు. పది ఎస్సీ వసతి గృహాలు, కురుగుంటలోని అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలలో మౌలిక వసతులను మెరుగుపరిచారు. కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ ప్రత్యేక చొరవ చూపించారు. ఎంపీడీఓలు, తహసీల్దార్లతో నివేదికలను తెప్పించుకుని ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వ అనుమతితో రూ.1.35 కోట్లు వెచ్చించి.. హాస్టళ్లు, గురుకుల పాఠశాల రూపురేఖలను మార్చేశారు.

- ఆంధ్రజ్యోతి, అనంతపురం ప్రెస్‌క్లబ్‌


ఇక్కడా ఆశలు

ఎస్సీ వసతి గృహాల మరమ్మతులకు రూ.1.35 కోట్లు కేటాయించడం, అక్కడి పరిస్థితులు మెరుగుపడటంతో మిగిలిన సంక్షేమ హాస్టళ్లకూ త్వరలో మంచి జరుగుతుందని భావిస్తున్నారు. బీసీ, ఎస్టీ, మైనార్టీ వసతిగృహాల మరమ్మతులకు నిధులు వస్తాయని వార్డెన్ల ఆశలు పెట్టుకున్నారు. బీసీ సంక్షేమ శాఖ డీడీ కుష్బూ కొఠారీ బీసీ హాస్టళ్లలో సమస్యలపై వార్డెన్లు, ఏబీసీడబ్ల్యూఓల ద్వారా నివేదిక తెప్పించుకున్నారు. దాదాపు 55 బీసీ హాస్టల్స్‌ భవంతులకు మరమ్మతులు, మౌలిక వసతులు, సీసీ కెమెరాల ఏర్పాటు తదితర అంశాలకు అందులో చోటు కల్పించారు. ఇందులో 28 వసతి గృహాల భవనాలకు మరమ్మతులు, మౌలిక వసతులు, 27 వసతి గృహాలకు సీసీ కెమెరాలు అవసరమని గుర్తించారు. మొత్తంగా రూ.3.67 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసి.. నివేదికను కలెక్టర్‌కు పంపారు. ఆ ఫైలుకు ఆమోదముద్ర పడినట్లు సమాచారం. రెండో విడత బీసీ వసతి గృహాలను బాగు చేస్తారని భావిస్తున్నారు. ఎస్టీ, మైనార్టీ హాస్టళ్లను సైతం బాగు చేసే అవకాశం ఉంది.

ఇబ్బంది పడేవాళ్లం..

గతంలో హాస్టల్‌లో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. వర్షం కురిసినప్పుడు రేకుల నుంచి నీరు కారేది. రాత్రిళ్లు నిద్రలేకుండా గడిపేవాళ్లం. కాస్త బాగున్న గదుల్లో సర్దుకుని పడుకునేవాళ్లం. బాత రూములు అధ్వానంగా ఉండేవి. ఇప్పుడు హాస్టల్‌ పైకప్పులకు రేకులు వేయించారు. బాతరూమ్‌లు శుభ్రంగా ఉన్నాయి. రంగులు వేయించారు. ఆవరణలో ఎల్‌ఈడీ లైట్లు వేయించారు. చాలా ఆనందంగా ఉంది.

- చందన, డిగ్రీ విద్యార్థిని, ఆర్ట్స్‌ కళాశాల

పిల్లలు ఆనందంగా ఉన్నారు..

హాస్టల్‌లో విద్యార్థులు ఆనందంగా ఉంటేనే మాకూ బాగుంటుంది. గతంలో సరైన వసతుల్లేక ఇబ్బందులు పడ్డాం. చేతినుంచి డబ్బులు పెట్టుకుని చిన్న చిన్న మరమ్మతులు చేయించాము. గదుల్లో పెచ్చులూడి పడుతుండటంతో బాలికలు ఇబ్బంది పడేవారు. ప్రస్తుతం సమస్యలన్నీ తీరిపోయాయి. హాస్టల్‌ భవంతి కొత్తగా మారిపోయింది. బాతరూమ్‌లకు మరమ్మతులు చేశారు. ఆవరణమంతా రంగులు వేయడం, ఎల్‌ఈడీ లైట్లు, రేకులు వేయడంతో ఆహ్లాదకరంగా మారింది. విద్యార్థినులు ఆనందంగా గడుపుతున్నారు.

- వసంత, వార్డెన, నంబర్‌-1 ఎస్సీ బాలికల కళాశాల వసతిగృహం,అనంతపురం


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Nov 21 , 2024 | 12:32 AM