Home » Student
యాజమాన్యాల ఒత్తిడి తట్టుకోలేక ఇద్దరు ఇంటర్ విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. ఈ రెండు వేర్వురు ఘటనలు సోమవారం బాచుపల్లి, పోచారంలలో జరిగాయి.
విద్యార్థులకు విద్యాబుద్ధులు చెబుతూ వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయవల్సిన టీచర్లు గాడి తప్పుతున్నారు.
తనకు ఈత రాదని విద్యార్థి చెప్పినా వినని ఓ ట్యూటర్ ‘నేనున్నాను నీకేమీ కాదు దూకు’ అంటూ అతడిని రెచ్చగొట్టి బావిలోకి దింపి విద్యార్థి మృతికి కారణమయ్యాడు. ఆదివారం సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం శాంతినగర్‌లో ఈ ఘటన జరిగింది.
గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కల్తీ ఆహారంపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. విద్యార్ధినిల ఆందోళన నేపథ్యంలో బాధ్యుడైన హాస్టల్ వార్డెన్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఘటనపై విచారణకు ఆదేశించి, త్వరితగతిన నివేదిక అందించాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
ప్రభుత్వ పఠశాలల్లో చదువుకునే విద్యార్థులూ ఆంగ్ల భాషపై పట్టు సాధించేందుకు వీలుగా.. ‘స్పోకెన్ ఇంగ్లీష్’ తరగతులు నిర్వహించాలని ఖమ్మం జిల్లా విద్యాశాఖాధికారులు నిర్ణయించారు.
మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు చేస్తామని, ఇందుకోసం ఓ సాఫ్ట్‌వేర్‌ను తీసుకువస్తామని తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తెలిపారు.
రాష్ట్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఆహార కల్తీ, మధ్యాహ్న భోజనం వికటించడం వల్ల విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్న ఘటనలపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ప్రధానంగా నారాయణపేట జిల్లా మాగనూరు జడ్పీ ఉన్నతపాఠశాలలో ఒకే వారంలో మూడుసార్లు ఫుడ్ పాయిజన్ కావడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
‘గత ఐదేళ్లలో రాజ్యాంగం విలువ తెలుసుకున్న మొదటి వ్యక్తిని నేను. ఈ పుస్తకం పట్టుకొని పాదయాత్ర చేశాను. ఆర్టికల్ 19 ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గురించి గళమెత్తా’ అని మం త్రి నారా లోకేశ్ అన్నారు.
నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత కొందరు విద్యార్థులు వాంతులు చేసుకోగా మరికొందరు కడుపునొప్పి, తలనొప్పితో బాధపడ్డారు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విద్యార్థిని శైలజ మృతిపై మాజీ మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో విద్యార్థులు చనిపోతున్నా మంత్రులు మెుద్ద నిద్ర వీడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు అనుమతి ఇవ్వడం లేదని కేటీఆర్ ఆరోపించారు.