Home » 2024
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వందరోజుల పాలనపై టీడీపీ మండల నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ... గురువారం సీఎం చంద్రబాబు చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. పార్టీ స్థానిక కార్యాలయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని సంబరాలు జరుపుకున్నారు.
గత వైసీపీ ప్రభుత్వం మండల వ్యాప్తంగా రీసర్వే చేపట్టిన తరువాత పలువురు రైతుల భూములు మా యం కావడంతో వారు తీవ్రంగా ఇబ్బందులు పడుతు న్నారని ఎంపీటీసీ రఘునాథరెడ్డి రెవెన్యూ అఽధికారులను నిలదీశారు. స్థానిక మండల పరిషత కార్యాలయంలో గురువారం ఎంపీపీ యోగేశ్వరి అధ్యక్షతన ఎంపీడీఓ నిర్మ లకుమారి మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
స్టాంపులు, రిజిస్ట్రేషనల శాఖలో ప్రైవేటు పెత్తనం కొనసాగుతోంది. వారు జారీ చేస్తేనే స్టాంపులు వేసుకునే దుస్థితి నెలకొంది. రెండు వారాలుగా జిల్లాలో ఈ-స్టాంపుల కొరత ఏర్పడింది. దీంతో క్రయ విక్రయదారులు ఇక్కట్లు పడుతున్నారు. అదనపు ధరలకు విక్రయించినా ఇన్నాళ్లూ కొనుగోలు చేశారు. ఇప్పుడేమో నో స్టాక్ అంటున్నారు. 2022లో వైసీపీ ప్రభుత్వం ఈ-స్టాంపింగ్ విధానాన్ని తెచ్చింది. వాటి బాధ్యతను ప్రైవేట్ సంస్థలకు అప్పగించింది. కామన సెంటర్ సర్వీ్‌స(సీఎ్‌సఈ), స్టాక్ హోల్డిం...
నియోజకవర్గంలో సాగుకోసం హెచఎల్‌సీకి నీటిని విడుదల చేయిచి రైతులకు దసరా పండుగ సంతోషా న్ని కలిగిస్తానని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పెర్కొన్నారు. ఆమె గురు వారం అనంతపురంలో జరిగిన ఐఏబీ సమావేశం తరువాత అమె విలేకరులతో మాట్లాడుతూ... శింగనమల నియోజకవర్గానికి ఈనెల 23వ తేదిన నీటిని విడుదల చేయునట్లు అధికారులు హామీ ఇచ్చారని తెలిపా రు.
టమోటా ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో రైతులకు ఊరట లభిస్తోంది. మార్కెట్లో 25 కిలోల బాక్సు గురువారం రూ.600 నుంచి రూ.800 వరకు ధర పలికింది. ఈ మాత్రం ధరలు నిలకడగా కొనసాగితే తమకు గిట్టుబాటు అవుతుందని రైతులు అంటున్నారు. యాడికి, రాయలచెరువు, లక్షుంపల్లి, వెంగన్నపల్లి తదితర గ్రామాల్లో 150 ఎకరాల్లో టమోటా సాగుచేశారు. ఎకరానికి రూ.50 వేల వరకు పెట్టుబడి పెట్టారు. వాతావరణం, ధరలు అనుకూలిస్తే టమోటా సాగు లాభదాయకమే. కానీ ప్రతికూల పరిస్థితులు ఎ...
రా ప్తాడు నియోజకవర్గానికి హెచఎల్సీ, హంద్రీనీవా నుంచి వీలైనంత మేరకు సాగు, తాగు నీరందించాలని జిల్లా కలెక్టర్, ఐఏబీ చైర్మన వినోద్‌కుమార్‌కు ఎమ్మెల్యే పరిటాల సునీత విజ్ఞప్తి చేశారు. కలెక్టరేట్లోని రెవెన్యూ భవనలో గురు వారం నిర్వహించిన ఐఏబీ సమావేశానికి అనివార్య కారణాల తో హాజరుకాలేకపోయానంటూ ఆమె ఐఏబీ చైర్మనకు లేఖ ద్వారా తెలుపుతూ, నియోజకవర్గంలో నెలకొన్న తాగు,సాగు నీటి సమస్యలను విన్నవించారు. పీఏబీఆర్, హంద్రీనీవా ద్వా రా రాప్తాడు నియోజకవర్గానికి తాగు, సాగు నీరు అందుతోం దని పేర్కొన్నారు.
కళ్యాణదుర్గం మండలం బోయలపల్లికి చెందిన నల్లబోతుల హనుమంతప్ప నిండు నూరేళ్ల జీవితం పూర్తి చేసుకున్నారు. కొడుకులు, కూతుళ్లు, మనవళ్లు, మనవరాండ్రు, ముని మనవళ్లు, ముని మనవరాండ్రు, వారి జీవిత భాగస్వాములు.. ఇలా సుమారు 50 మంది కుటుంబ సభ్యుల సమక్షంలో గురువారం 101వ పుట్టిన రోజు వేడుకను ఘనంగా నిర్వహించుకున్నారు. హనుమంతప్పకు ముగ్గురు ...
జిల్లాలో అక్రమ విద్యుత వాడకంపై విద్యుత శాఖ విజిలెన్స అధికారులు కొరడా ఝుళిపించారు. ఈ క్రమంలో వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి అక్రమ విద్యుత వాడకం దారులపై జరిమాన విధించారు. నగరంలోని డి-5సెక్షన, శ్రీ సత్యసాయి జిల్లాలోని ఓబుళదేవరచెరువు, అమరాపురం మండలాల్లో విద్యు త విజిలెన్స ఈఈ గోపి ఆధ్వర్యంలో అధికారులు బుధవారం తనిఖీలు చేపట్టారు.
సాంకేతిక విద్యా ప్రాజెక్టుల ద్వారా విద్యార్థులు, అధ్యాపకుల ప్రతిభను గుర్తించి వారిని ప్రో త్సహించడమే ఇండియన సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన(ఐఎస్టీఈ) లక్ష్యమని జేఎనటీయూ ఇనచార్జ్ వీసీ ప్రొఫెసర్ సుదర్శన రావు పేర్కొ న్నారు. జేఎనటీయూలో బుధవారం ఐఎస్టీఈ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ రంగజనార్దన అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి వీసీ సుదర్శనరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండమీద రాయుడు వెలసిన దేవరకొండకు చెందిన కోట్ల విలువ చేసే భూమిని వైసీపీ, టీడీపీ నేతలు కబ్జా చేసేందుకు యత్నిస్తు న్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి నారా యణస్వామి డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం సీపీఐ అధ్వర్యంలో ధర్నా చేపట్టారు.