Share News

ICDS : బాలికల సంరక్షణే ధ్యేయం : ఆర్జేడీ

ABN , Publish Date - Nov 20 , 2024 | 12:02 AM

లైంగి క వేధింపుల నుంచి బాలికలను రక్షించడమే తమ ధ్యేయ మని ఐసీడీఎస్‌ కర్నూలు ఆర్‌జేడీ రోహిణి పేర్కొన్నారు. జి ల్లాకు వచ్చిన ఆమె మంగళవారం జిల్లాలోని పలు ప్రాంతా ల్లో పర్యటించారు. పీడీ కార్యాలయంలో ఐసీడీఎస్‌ అధికారు లతో సమావేశం నిర్వహించారు.

ICDS : బాలికల సంరక్షణే ధ్యేయం : ఆర్జేడీ
RJD Rohini at the candle display

అనంతపురం విద్య, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి) : లైంగి క వేధింపుల నుంచి బాలికలను రక్షించడమే తమ ధ్యేయ మని ఐసీడీఎస్‌ కర్నూలు ఆర్‌జేడీ రోహిణి పేర్కొన్నారు. జి ల్లాకు వచ్చిన ఆమె మంగళవారం జిల్లాలోని పలు ప్రాంతా ల్లో పర్యటించారు. పీడీ కార్యాలయంలో ఐసీడీఎస్‌ అధికారు లతో సమావేశం నిర్వహించారు. అనంతరం ప్రపంచ బాలల లైంగిక వేధింపుల వ్యతిరేక దినం, బాలల హక్కుల వారోత్స వాలు, దత్తత మాసాన్ని పురస్కరించుకుని మంగళవారం రాత్రి పీడీ శ్రీదేవి, ఇతర అధికారులు, నలంద విద్యార్థినులతో కలసి రైల్వేస్టేషన వద్ద కొవ్వొత్తుల ర్యాలీ, ప్రదర్శన, మాన వహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌జేడీ మాట్లా డుతూ.... బాలికలకు అన్ని ప్రాంతాల్లో లైంగిక వేధింపుల నుంచి రక్షణ ఎంతైనా అవసరం అన్నారు. ఎక్కడికక్కడ అరికట్టాల్సి ఉందన్నారు. మానవ అక్రమ రవాణను సైతం అధికారులు నిరోధిం చాలని సూచించారు. కార్యక్రమంలో నలంద కళాశాల ప్రిన్సిపాల్‌ ఖాజీబాబు, ఆర్పీఎఫ్‌ ఎస్‌ఐ రఫీ, మహిళా పోలీసు ఎస్‌ఐ భారతి, ఏఎస్‌ఐ పద్మావతి, ఐసీ డీఎస్‌ అధికారులు మంజునాథ్‌, కృష్ణమాచారి, చంద్రకళ, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.


నార్పల: బాలికలు లక్ష్యాన్ని ఎంచుకొని కష్టపడి చదవాలని రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ రోహిణి పేర్కొన్నారు. మండల కేంద్రం లోని బాలికల సంక్షేమ హాస్టల్‌లో బాలికల పరిరక్షణ విభా గం, చైల్డ్‌ హెల్ప్‌లైన, ఎంజేపీబీసీ వెల్ఫేర్‌ సంయుక్తంగా మంగళవారం బాలల హక్కుల వారోత్సవాలను నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆర్జేడీ పాల్గొని మాట్లాడారు. అనంతరం ఆటల పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులను ప్ర దానం చేశారు. అంగనవాడీ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పీడీ శ్రీదేవి, సీడీపీఓ భారతి, జిల్లా చైల్డ్‌ ప్రొటెక్షన అధికారి మంజునాథ్‌, ప్రిన్సిపాల్‌ సంగీతకుమారి, జిల్లా కోఆర్డినేటర్‌ కృష్ణమాచారి, సూపర్‌వైజర్లు సునాలిని, మధుమాలిని, ప్రొటెక్షన అధికారి చంద్రకళ, లీగల్‌ అధికారి సంధ్యారాణి, కౌన్సిలర్‌సంధ్యా, సోషల్‌ వర్కర్లు వసంతలక్ష్మి, వెంకట్‌కుమార్‌, చైల్డ్‌హెల్ప్‌లైన సిబ్బంది పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Nov 20 , 2024 | 12:02 AM