Home » Andhra Pradesh » Ananthapuram
జిల్లాలో డిగ్రీ విద్యార్థిని హత్య కలకలం రేపింది. ఆత్మకూరు మండలం వడ్డుపల్లి అటవీ ప్రాంతంలో విద్యార్థిని తలపై బండరాయితో మోది హత్య చేయడం స్థానికంగా భయాందోళనలు రేకెత్తిస్తోంది.
మండలంలోని కల్యం గ్రామంలో ఇటీవల జరిగిన గొడవకు సంబంధించి ఎనిమిదిమంది వైసీపీ నాయకులను శుక్రవారం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ గురుప్రసాద్‌రెడ్డి తెలిపారు.
మండలంలోని వెంకటరెడ్డిపల్లి గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. రూరల్ పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి.
రెండు రోజుల క్రితం అదృశ్యమైన మండలంలోని దర్గాహోన్నూరు గ్రామానికి చెందిన రాజ ప్ప(32) శుక్రవారం గ్రామ శివారులోని ఓ పొలంలో శవమై కనిపించాడు. ఎస్ఐ నబీరసూల్ తెలిపిన మేరకు వివరాలిలా ఉ న్నా యి.
శ్రీరామిరెడ్డి, సత్యసాయి తాగునీటి పథకం కార్మికులకు పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం ఆయా కార్మికులతో కలిసి సమ్మె చేపట్టారు.
వినాయక చవితి పండుగ శనివారం జరగనుండడంతో పట్టణంలో సందడి నెలకొంది. పండుగను పురస్కరించుకుని శుక్రవారం ప్రజలు పూజాసామగ్రితో పాటు సరుకులు కొ నుగోలు చేయడానికి పెద్దఎత్తున తరలివచ్చారు.
పండుగలు బంధుమిత్రులను ఒకచోట కలుపుతాయి. ఇంటిల్లిపాదికీ సంతోషాన్నిస్తాయి. కొత్త బట్టలు, పిండి వంటలు, పూజలు, సినిమాలు, ఆలయ సందర్శన.. ఇలా ఎన్నెన్నో ఆనందాలను మోసుకొస్తాయి. కానీ, కొందరి కష్టాలను, చిన్న చిన్న కోరికలను కూడా తీరుస్తాయి. పూజా సామగ్రి, వస్తు విక్రయాల ద్వారా కొంత సొమ్ము వారి చేతికి వస్తుంది. ఆ ఒక్క రోజు సంపాదనపై వారు ఎన్నెన్నో ఆశలు పెట్టుకుంటారు. మిగిలిన పండుగలతో పోలిస్తే.. వినాయచవితి ఆదాయం ...
తుంగభద్ర ప్రాజెక్టును ఈ నెల 9, 10 తేదీలలో నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎనడీఎ్‌సఏ) నియమించిన నిపుణుల కమిటీ సందర్శించనుంది. గత నెల 10న చైన లింగ్ తెగిపోయి వరద ఉధృతికి కొట్టుకుపోయిన 19వ నంబరు క్రస్ట్‌గేట్‌తో పాటుగా మిగిలిన 32 క్రస్ట్‌గేట్ల భద్రత, ఇతర అంశాల అధ్యయనం కోసం ఈ బృందం వస్తోంది. జాతీయ జలాశయాలు భద్రతా సంస్థ, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన ఏకే బజాజ్ నేతృత్వంలో ఢిల్లీకి చెందిన రిటైర్డ్ మెకానికల్ ఇంజనీరింగ్ నిపుణుడు హర్కేశ ...
యూటీఎఫ్ స్వర్ణత్సోవాల్లో భాగంగా పట్టణంలోని జిల్లాపరిషత బాలికల ఉన్నతపాఠశాల ఆవరణంలో ఈనెల 14న మహిళ ఉపాధ్యాయులకు క్రీడాపోటీలు నిర్వహిస్తున్నట్లు యూటీఎఫ్ జిల్లా కోశాధికారి, కార్యదర్శులు శ్రీనివాసులు, తాహేర్వలీ శుక్రవారం తెలిపారు.
ఐదు నెలలైనా జీతాలు ఇవ్వలేదు, ఆర్థికంగా ఇబ్బందులుపడుతున్నామని వేడుకుంటూ అధికారులు కనికరించడం లేదు, పండుగకు కూడా జీతాలు ఇవ్వకుండా పస్తులు పెడతారా అంటూ ఆస్పత్రి పారిశుధ్య కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు.