Share News

TDP: కణేకల్లు చెరువుకు చిన్నపాటి రంధ్రాలు

ABN , Publish Date - Nov 20 , 2024 | 12:14 AM

కణేకల్లు శ్రీచిక్కణ్ణేశ్వర వడియార్‌ చెరువుకు మూడు చోట్ల చిన్నపాటి రంధ్రాలు పడడంతో సకాలంలో స్పందించిన అధికారులు యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేసి నీటి లీకేజీని అరికట్టారు.

TDP: కణేకల్లు చెరువుకు చిన్నపాటి రంధ్రాలు
TDP leaders supervising the works

కణేకల్లు, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): కణేకల్లు శ్రీచిక్కణ్ణేశ్వర వడియార్‌ చెరువుకు మూడు చోట్ల చిన్నపాటి రంధ్రాలు పడడంతో సకాలంలో స్పందించిన అధికారులు యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేసి నీటి లీకేజీని అరికట్టారు. గంగలాపురంకు వెళ్లే దారిలో నాగలకట్ట సమీపంలో ఉన్న మూడో తూము వద్ద చెరువుకు మూడుచోట్ల చిన్నపాటి రంధ్రాలు పడి నీరు వృథాగా భూముల్లోకి వెళుతున్నాయి. ఇప్పటికే మాగాణి భూములు కోత దశకు రాగా ఇటీవలే ఆ నీటిని కూడా భూములకు బంద్‌ చేయించారు. ఇలాంటి పరిస్థితుల్లో రంధ్రాల ద్వారా నీరంతా పొలాలలోకి పోతుండడంతో గమనించిన రైతులు హెచ్చెల్సీ అధికారులకు సమాచారం అందించారు. డీఈ మద్దిలేటి ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది, టీడీపీ నాయకులు హుటాహుటిన ఎక్స్‌కవేటర్‌తో రప్పించి రంధ్రాలు పడిన ప్రాంతాన్ని గుర్తించారు. అనంతరం వాటికి మట్టిని వేసి నీటి లీకేజీని అరికట్టారు. టీడీపీ నాయకులు లాలెప్ప, ఆనంద్‌రాజ్‌, వేలూరు మరియప్ప, బీటీ రమేష్‌, చంద్రశేఖర్‌గుప్తా, కురుబ నాగరాజు, మాబుసాబ్‌, చాంద్‌బాషా, తిప్పేస్వామి, నజీర్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2024 | 12:14 AM