Share News

అమిగోస్‌ ఆగడాలు ఆగవా..?

ABN , Publish Date - Jul 25 , 2024 | 11:58 PM

ప్రభుత్వం మారినా జిల్లా సంపదను కొల్లగొడుతున్న అమిగోస్‌ మినరల్స్‌ సంస్థ ఆగడాలు ఆగవా అని మైన్స కాంట్రాక్టర్‌ రాజేష్‌ మండిపడ్డారు. గతంలో అమిగోస్‌ అక్రమాలపై ఫిర్యాదు చేసినా విచారణ జరపకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని రాజేష్‌ గురువారం సాయంత్రం స్థానిక హెచ్చెల్సీ కాలనీలోని భూగర్భగనుల శాఖ డీడీ నాగయ్య ఎదుట నిరసనకు దిగాడు.

అమిగోస్‌ ఆగడాలు ఆగవా..?
అమిగోస్‌ అక్రమాలపై మైన్స డీడీకి ఫిర్యాదు చేస్తున్న కాంట్రాక్టర్‌ రాజేష్‌

మైన్స కాంట్రాక్టర్‌ రాజేష్‌

అనంతపురం క్లాక్‌టవర్‌, జూలై 25: ప్రభుత్వం మారినా జిల్లా సంపదను కొల్లగొడుతున్న అమిగోస్‌ మినరల్స్‌ సంస్థ ఆగడాలు ఆగవా అని మైన్స కాంట్రాక్టర్‌ రాజేష్‌ మండిపడ్డారు. గతంలో అమిగోస్‌ అక్రమాలపై ఫిర్యాదు చేసినా విచారణ జరపకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని రాజేష్‌ గురువారం సాయంత్రం స్థానిక హెచ్చెల్సీ కాలనీలోని భూగర్భగనుల శాఖ డీడీ నాగయ్య ఎదుట నిరసనకు దిగాడు. 2023 డిసెంబరు 7న అమిగోస్‌ అక్రమాలపై మైన్స అధికారులకు ఆధారాలతో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, ఎటువంటి చర్యలు తీసుకోకపోగా ఆ సంస్థను వెనుకేసుకొస్తుండడంపై ఏంటని ప్రశ్నించారు. ఆత్మకూరు, బుక్కరాయసముద్రం మండలం కేకే అగ్రహారం, రాప్తాడు, పామిడి వంకరాజుకాలవ ప్రాంతాల్లో తాత్కాలిక అనుమతులు తీసుకుని మట్టిని తరలించిన అమిగోస్‌ కోట్లు కొల్లగొట్టిందని ఆరోపించారు. లీజు కాంట్రాక్టర్లను బెదిరింపులకు గురి చేస్తూ అప్పటి వైసీపీ సీఎం, అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్లు చెప్పుకుని అమిగోస్‌ సంస్థ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 76 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసుకుని కోట్లాది రూపాయలు దోచుకున్నారన్నారు. వెంటనే అమిగోస్‌ జిల్లాలో చేసిన అవినీతి, అక్రమాలు, అక్రమ వసూళ్లపై సీఐడీ విచారణ జరిపి తిన్నసొమ్మును కక్కించాలని డిమాండ్‌ చేశారు. అంతేగాక ప్రభుత్వానికి చెల్లించాల్సిన లీజు బకాయి సుమారు రూ.100కోట్లుని వెంటనే రికవరీ చేయాలన్నారు. అమిగోస్‌ ఆగడాలను సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్తామన్నారు.

Updated Date - Jul 25 , 2024 | 11:58 PM