Share News

Counseling : కోనుప్పలపాడులో 24 మంది అరెస్టు

ABN , Publish Date - May 26 , 2024 | 12:18 AM

పోలింగ్‌ రోజున కోనుప్పలపాడులో జరిగిన అల్లర్ల కేసులో టీడీపీ వర్గీయులు 24 మందిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఉరవకొండ కోర్టులో వారిని హాజరుపరిచారు. న్యాయాధికారి ఆదేశాలమేరకు రిమాండ్‌కు తరలించేందుకు రాత్రి ఏర్పాట్లు చేశారు. వారిని తాడిపత్రి సబ్‌జైలు లేదా అనంతపురం జిల్లా జైలుకు తరలించాలని భావిస్తున్నారు. ఈ నెల 13న గ్రామంలోని పోలింగ్‌ కేంద్రం వద్ద టీడీపీ, వైసీపీ వర్గీయులు రాళ్లు...

Counseling : కోనుప్పలపాడులో 24 మంది అరెస్టు
CI counseling the family members of the accused

ఉరవకొండ కోర్టులో హాజరు.. రిమాండ్‌కు నిందితులు

యాడికి, మే 25: పోలింగ్‌ రోజున కోనుప్పలపాడులో జరిగిన అల్లర్ల కేసులో టీడీపీ వర్గీయులు 24 మందిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఉరవకొండ కోర్టులో వారిని హాజరుపరిచారు. న్యాయాధికారి ఆదేశాలమేరకు రిమాండ్‌కు తరలించేందుకు రాత్రి ఏర్పాట్లు చేశారు. వారిని తాడిపత్రి సబ్‌జైలు లేదా అనంతపురం జిల్లా జైలుకు తరలించాలని భావిస్తున్నారు. ఈ నెల 13న గ్రామంలోని పోలింగ్‌ కేంద్రం వద్ద టీడీపీ, వైసీపీ వర్గీయులు రాళ్లు రువ్వుకున్నారు. కట్టెలతో దాడులు చేసుకున్నారు. ఈ గొడవలో టీడీపీకి చెందిన కేశవ, శేఖర్‌, చంద్ర, రాజా తదితరులు, వైసీపీకి చెందిన గంగిరెడ్డి, చంద్రబాబు


గాయపడ్డారు. టీడీపీ నాయకుడు రామాంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైసీపీ వర్గీయులు 8 మందిపై కేసు నమోదు చేశారు. వైసీపీ నాయకుడు బాలగంగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీడీపీ వర్గీయులు 26 మందిపై కేసు నమోదు చేశారు. టీడీపీ వర్గీయులు రామాంజనేయులు, రామకృష్ణ, కేశవ, రాజు తదితరులతో కలిపి మొత్తం 24 మందిని శనివారం అరెస్టు చేసి యాడికి పోలీస్‌ స్టేషనకు తరలించారు. వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్దఎత్తున పోలీస్‌ స్టేషనకు చేరుకున్నారు. దీంతో అక్కడ ఏం జరుగుతుందోనని ఉత్కంఠ ఏర్పడింది.

మహిళల కంటతడి..

‘ఏ పాపం తెలియని మా వాళ్లు కేసులో ఇరుక్కున్నారు. వారిని జైలుకు పంపుతున్నారు. మా పరిస్థితి ఏమిటి సార్‌? మేము బతికేది ఎట్లా సార్‌?’ అని పలువురు మహిళలు సీఐ నాగార్జునరెడ్డి ఎదుట కంటతడి పెట్టారు. తమ బిడ్డల గతి ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వారికి సీఐ కౌన్సెలింగ్‌ ఇచ్చారు. గొడవల జోలికి వెళితే జీవితాలు నాశనమౌతాయని, ప్రశాంత జీవనం గడపాలని పోలీసులు పదే పదే చెప్పేది ఇందుకోసమేనని వారితో అన్నారు. తప్పు జరిగిపోయిన తర్వాత ఎవరూ ఏమీ చేయలేరని, చట్టం దృష్టిలో అందరూ సమానులేనని అన్నారు. ‘భవిష్యత్తులో అయినా గొడవల జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా ఉండేలా మీవారిని మీరే మార్చుకోవాలి’ అని సర్దిచెప్పి పంపించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 26 , 2024 | 12:18 AM