Share News

divotional: గరుడవాహనంపై ఊరేగిన చెన్నకేశవుడు

ABN , Publish Date - Apr 22 , 2024 | 01:08 AM

మండల కేంద్రంలో వెలసిన శ్రీలక్ష్మీతారమ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం అర్చకులు స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని గరుడ వాహనంపై కొలువు తీర్చి పురవీధుల్లో ఊరేగించారు.

divotional:  గరుడవాహనంపై ఊరేగిన చెన్నకేశవుడు
Lord on Garudavahanam

తాడిమర్రి, ఏప్రిల్‌ 21: మండల కేంద్రంలో వెలసిన శ్రీలక్ష్మీతారమ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం అర్చకులు స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని గరుడ వాహనంపై కొలువు తీర్చి పురవీధుల్లో ఊరేగించారు.


తొలుత ఆలయంలో స్వామివారి మూలవిరాట్‌కు అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు, పూజలు నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ కమిటీ వారు తీర్థప్రసాదాలు అందజేశారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - Apr 22 , 2024 | 01:08 AM