Share News

KANDIKUNTA: కందికుంటకు అభినందనలు

ABN , Publish Date - Jun 10 , 2024 | 11:46 PM

ఎమ్మెల్యేగా గెలుపొందిన కందికుంట వెంకటప్రసాద్‌ను ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన (యూటీఎఫ్‌) ఆధ్వర్యంలో సోమవారం పూలమాలతో సత్కరించి, అభినందించారు.

KANDIKUNTA: కందికుంటకు అభినందనలు
UTF leaders congratulating MLA

కదిరిఅర్బన, జూన 10: ఎమ్మెల్యేగా గెలుపొందిన కందికుంట వెంకటప్రసాద్‌ను ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన (యూటీఎఫ్‌) ఆధ్వర్యంలో సోమవారం పూలమాలతో సత్కరించి, అభినందించారు. విద్యారంగంలో నెలకున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. 117జీవోను రద్దు చేయాలని, ఉపాధ్యాయులపై యాప్‌ల భారం తగ్గించాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయపోస్టులు భర్తీ, సరెండర్‌ లీవులు, ఏపీజీఎల్‌ఐసీ క్లెయిమ్‌లు తదితర సమస్యలను పరిష్కరించాలని విన్నవించారు. ప్రభుత్వానికి, ఉపాధ్యాయులకు వారధిగా మీరు పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. యూటీఎఫ్‌ నాయకులు శ్రీనివాసులు, సుబ్బారెడ్డి, మల్లికార్జున, సునిల్‌కుమార్‌, ఆజాంబాషా, మైనోద్దీన, మధుసూదన, మహబూబ్‌బాషా, మైనోద్దీన, మనోహర్‌, నాగరాజు, రాంప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 10 , 2024 | 11:46 PM