Share News

PEANUT : ఎన్నికల మస్కట్‌.. వేరుశనగ

ABN , Publish Date - Apr 23 , 2024 | 12:37 AM

అనంతపురం జిల్లా ఎన్నికల మస్కట్‌గా ఆర్ట్స్‌ కాలేజీ డిగ్రీ విద్యార్థి ప్రశాంత కుమార్‌ రూపొందించిన ‘వేరుశనగ’ ఆకృతి ఎంపికైంది. రాష్ట్రంలోనే మొట్టమొదట ఎన్నికల మస్కట్‌ను రూపొందించిన జిల్లాగా అనంతకు ఖ్యాతి దక్కిందని కలెక్టరు వినోద్‌కుమార్‌ తెలిపారు. ఎన్నికల మస్కట్‌ ఎంపిక పోటీలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 62 మస్కట్‌లు వచ్చాయి.

PEANUT : ఎన్నికల మస్కట్‌.. వేరుశనగ

అనంతపురం జిల్లా ఎన్నికల మస్కట్‌గా ఆర్ట్స్‌ కాలేజీ డిగ్రీ విద్యార్థి ప్రశాంత కుమార్‌ రూపొందించిన ‘వేరుశనగ’ ఆకృతి ఎంపికైంది. రాష్ట్రంలోనే మొట్టమొదట ఎన్నికల మస్కట్‌ను రూపొందించిన జిల్లాగా అనంతకు ఖ్యాతి దక్కిందని కలెక్టరు వినోద్‌కుమార్‌ తెలిపారు. ఎన్నికల మస్కట్‌ ఎంపిక పోటీలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 62 మస్కట్‌లు వచ్చాయి. న్యాయ నిర్ణేతలు పరిశీలించి.. వేరుశగన మస్కట్‌ను ఎంపిక చేశారు.


విద్యార్థి ప్రశాంతకు కలెక్టరు రూ.5 వేల బహుమతి అందజేసి అభినందించారు.

- అనంతపురం టౌన

ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకోండి..!

ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని, ఏ ఒక్కరూ నిర్లక్ష్యం వహించరాదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు డాక్టర్‌ వినోద్‌కుమార్‌ ఆదేశించారు. నోడల్‌ అధికారులు, రిటర్నింగ్‌ ఆఫీసర్లతో సోమవారం ఆయన సమీక్ష నిర్వహంచారు. ఎన్నికల నిర్వహణకు ఎవరికి అప్పగించిన బాధ్యతలను వారు నిబద్ధతతో నిర్వర్తించాలని సూచించారు. ఫిర్యాదులు వస్తే పరిశీలించి, గంటలోపే పరిష్కరించాలని అన్నారు. పోలింగ్‌ కేంద్రాలలో అన్ని వసతులు ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల సమాచారాన్ని రాజకీయ పార్టీలు లిఖిత పూర్వకంగా అడిగితే.. ఆ డేటాను ఇవ్వాలని సూచించారు. ఆర్వోలు తమ పరిధిలో ఉన్న బృందాలను పర్యవేక్షించాలని, వాట్సా్‌పగ్రూప్‌ ఏర్పాటు చేసుకొని సమాచారం తెప్పించుకోవాలని ఆదేశించారు. సాధారణ కేంద్ర ఎన్నికల పరిశీలకులు త్వరలో జిల్లాకు వస్తారని, వారికి అవసరమైన సమాచారాన్ని దగ్గర ఉంచుకోవాలని ఆదేశించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ విషయంలో ఎలాంటి గందరగోళం లేకుండా చూడాలని, అందరికీ అవకాశం కల్పించాలని ఆదేశించారు.


ఈ విషయంలో ఆయా శాఖల జిల్లా ఉన్నతాధికారులు కీలక పాత్ర పోషించాలని అన్నారు. 33 అత్యవరశాఖల ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ అవకావం కల్పించారని, వందశాతం పోస్టల్‌ బ్యాలెట్‌ నమోదుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలకు అవగాహన పెంచాలని ఆదేశించారు. సీజనల్‌ వ్యాధులు పెరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో నగరపాలిక కమిషనర్‌ మేఘ స్వరూప్‌, డీఆర్‌ఓ రామక్రిష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పోలింగ్‌ రోజున సెలవు

అనంతపురం కల్చరల్‌, ఏప్రిల్‌ 22: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మే 13న పోలింగ్‌ ఉన్నందున.. ఆ రోజు దుకాణాలు, వ్యాపార సముదాయాలు సెలవు పాటించాలని జిల్లా కార్మిక శాఖ ఉప కమిషనర్‌ లక్ష్మీనరసయ్య సోమవారం ఓ ప్రకటనలో ఆదేశించారు.


దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో భారత ఎన్నికల సంఘం సూచనలతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మే 13న సెలవు ఇవ్వడంతోపాటు ఆ రోజుకు సంబంధించి వేతనం కూడా మంజూరు చేయాలని సూచించారు. ఈ నిబంధనలను పాటించని యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - Apr 23 , 2024 | 12:37 AM