Share News

SPLAR : సోలార్‌ విద్యుతకు భూములిచ్చిన రైతులతో ముఖాముఖి

ABN , Publish Date - Jun 20 , 2024 | 12:05 AM

తాలూకా పరిధిలో ని ర్యాప్టా గ్రామ పంచాయతీలో బు ధవారం సోలార్‌ విద్యుత ఉత్పా ద నకు భూము లిచ్చి న రైతులతో సమా వేశం నిర్వహించారు. కర్ణాటక సోలార్‌ పవర్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో రైతులకు భూముల ధరల పెంపకంపై నిర్వహించిన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో తుమకూరు జి ల్లా కలెక్టర్‌ శుభకళ్యాణి పాల్గొని మాట్లాడారు. ఇప్పటికే వివిధ సోలార్‌ కంపెనీల నుంచి 2600మెగావాట్ల సోలార్‌ విద్యుత ప్రపంచ దేశాలకు అందిస్తోంది.

SPLAR : సోలార్‌ విద్యుతకు   భూములిచ్చిన రైతులతో ముఖాముఖి
Collector Subhakallyani speaking in the program

పావగడ, జూన 19 : తాలూకా పరిధిలో ని ర్యాప్టా గ్రామ పంచాయతీలో బు ధవారం సోలార్‌ విద్యుత ఉత్పా ద నకు భూము లిచ్చి న రైతులతో సమా వేశం నిర్వహించారు. కర్ణాటక సోలార్‌ పవర్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో రైతులకు భూముల ధరల పెంపకంపై నిర్వహించిన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో తుమకూరు జి ల్లా కలెక్టర్‌ శుభకళ్యాణి పాల్గొని మాట్లాడారు. ఇప్పటికే వివిధ సోలార్‌ కంపెనీల నుంచి 2600మెగావాట్ల సోలార్‌ విద్యుత ప్రపంచ దేశాలకు అందిస్తోంది. దేశంలో విద్యుత అందించేందుకు 4336ఎకరాల్లో సోలార్‌ విద్యుత ఉత్పాదనకు భూములు అందించి రైతులు సహకరించాలని ఆమె కోరారు. మాజీ మంత్రి వెంకటరమణప్ప మాట్లాడు తూ... కంపెనీ ప్రతి ఎకరానికి సంవత్సరానికి రూ.25,200 అందజేస్తుందని తెలిపారు.


ఇది నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతుందని తెలిపారు.

జూలైలో భద్ర నీటి విడుదల : భద్ర నీటిని వచ్చే జూలై నెలలో ముఖ్య మంత్రి సిద్దరామయ్య చేతులమీదుగా విడుదల చేసి పావగడ తాలూకాలోని ప్రతి పల్లెకు అందజేస్తానని ఎమ్మెల్యే హెచవీ వెంకటేశ తెలిపారు. ఆయన బుధవారం తిరుమణిలో రూ.76లక్షల అంచనాతో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయం, రూ.29లక్షలతో పశువుల ఆసుపత్రి నిర్మాణానికి భూమిపూజ చేశారు. తాలూకాలోని ప్రతి గ్రామానికి సీసీరోడ్లు నిర్మిం చడానికి రూ.7కోట్ల నిధులు ఇప్పటికే సీఎం మంజూరు చేశారని ఈ యేడాది లోగా పనులకు శ్రీకారం చుడతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు నాని, పంచాయతీ అధ్యక్షుడు లోకేష్‌, తహసీల్దార్‌ వరదరాజు, ఈఓ జానకిరాం తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jun 20 , 2024 | 12:05 AM