Share News

SANITATION: పారిశుధ్యం మెరుగుకు చర్యలు

ABN , Publish Date - Jun 28 , 2024 | 11:53 PM

సీజనల్‌ వ్యాధుల ప్రబలుతున్న నేపథ్యంలో పారిశుధ్యం మెరుగునకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు డీపీవో ప్రభాకరరావు తెలిపారు. పట్టణంలోని రంగావీధిలో పారిశుద్య పనులను ఆయన పరిశీలించారు. డ్రైనేజీలు శుభ్రం చేయించారు.

SANITATION: పారిశుధ్యం మెరుగుకు చర్యలు
DPO is supervising sanitation works in Uravakonda

ఉరవకొండ, జూన 28: సీజనల్‌ వ్యాధుల ప్రబలుతున్న నేపథ్యంలో పారిశుధ్యం మెరుగునకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు డీపీవో ప్రభాకరరావు తెలిపారు. పట్టణంలోని రంగావీధిలో పారిశుద్య పనులను ఆయన పరిశీలించారు. డ్రైనేజీలు శుభ్రం చేయించారు. కాలువల్లో స్ర్పే చేయించారు. మురుగు నీరు నిల్వ ఉన్నచోట బ్లీచింగ్‌ చల్లించారు. డయేరియా, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా శానిటేషన చేపట్టాలని సూచించారు. మేజర్‌ పంచాయతీ కార్యదర్శి గౌస్‌, సచివాలయసిబ్బంది పాల్గొన్నారు.

యాడికి: పరిసరాల పరిశుభ్రతతోనే రోగాలు రాకుండా చేసుకోవచ్చునని మలేరియా నివారణ తాడిపత్రి సబ్‌ యూనిట్‌ అధికారి శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం యాడికిలోని నారాయణస్వామి కాలనీలో నిల్వ ఉన్న మురుగునీటిలో దోమలు వృద్ధిచెందకుండా అబేట్‌ను చల్లారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇళ్లవద్ద మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రైడేని పాటించాలని సూచించారు. పలువురు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.


బొమ్మనహాళ్‌: ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మండలంలోని శ్రీధరఘట్ట వైద్యులు సూచించారు. శుక్రవారం సింగానహళ్లి గ్రామంలో సీజనల్‌ వ్యాధులపై స్టాప్‌ డయేరియా, మలేరియా, డెంగీ జ్వరాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు నాగే్‌షరెడ్డి, యుగంధర్‌, హెల్త్‌ సూపర్‌వైజర్‌ ఉమాదేవి, ఆరోగ్య కార్యకర్తలు వెంకటరమణ, ఈశ్వరమ్మ పాల్గొన్నారు.

కుందుర్పి: సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా వుండాలని మలేరియా అధికారి తిరుపాలయ్య సూచించారు. మండల పరిధిలోని కదరంపల్లి గ్రామంలో శుక్రవారం వైద్య అధికారుల సమక్షంలో సీజనల్‌ వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వైద్య అధికారులు అనూషదేవి, చాంద్‌ బేగం, వైద్యసిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 28 , 2024 | 11:53 PM