Share News

MS Raju : బడి రుణం తీర్చుకుంటా

ABN , Publish Date - Jul 06 , 2024 | 11:56 PM

తాను చదివిన పాఠశాల అభివృద్ధికి సహకరించి, బడి రుణం తీర్చుకుంటానని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు పేర్కొన్నారు. మండలంలోని సలకంచెరువు జడ్పీ పాఠశాలలో 1997 టెన్త బ్యాచ విద్యార్థుల సమ్మేళనం శనివారం జరిగింది. అదే బ్యాచకు చెందిన ఎంఎ్‌స.రాజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చిన ...

 MS Raju  : బడి రుణం తీర్చుకుంటా
MS Raju with teachers and classmates at Salakancheruvu School

మడకశిర ఎమ్మెల్యే ఎస్‌ఎం రాజు

శింగనమల, జూలై 6: తాను చదివిన పాఠశాల అభివృద్ధికి సహకరించి, బడి రుణం తీర్చుకుంటానని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు పేర్కొన్నారు. మండలంలోని సలకంచెరువు జడ్పీ పాఠశాలలో 1997 టెన్త బ్యాచ విద్యార్థుల సమ్మేళనం శనివారం జరిగింది. అదే బ్యాచకు చెందిన ఎంఎ్‌స.రాజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చిన గురువులు, తల్లిదండ్రులు చూపిన మార్గం లో వెళితే విజయం తథ్యమని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు పేర్కొన్నారు. అనంతరం స్నేహితులతో సరదాగా మాట్లాడారు. అప్పటి గురువుల ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీసి అనంతరం వారికి సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎంఎస్‌ రాజు దంపతులను అప్పటి విద్యార్థులు సన్మానించారు.


మారాజు ఎమ్మెల్యే అయ్యాడు..

పేద కుటుంబంలో జన్మించి, చదువుకోనే రోజుల్లో ఎన్నో ఇబ్బందులు పడిన తమ చిన్ననాటి స్నేహితుడు ఎంఎస్‌ రాజు ఎమ్మెలే కావడం ఎంతో ఆనందంగా ఉందని 1997 టెన్త బ్యాచ చెందిన విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. రాజు పాఠశాలకు రావడంతో స్నేహితులు అతన్ని కలిసి అప్యాయంగా పలకరిస్తూ, చిన్ననాటి సంగతులు నెమరు వేసుకున్నారు. తాను ఎమ్మెల్యే అయినా ఎప్పటికీ మీరాజునే అని ఎంఎస్‌ రాజు తన స్నేహితులతో పేర్కొన్నాడు. ఎలాంటి ఇబ్బందులు వచ్చిన తనకు తెలియజేస్తే తన వంతు సహకారం అందిస్తానని మాటిచ్చారు.


మృతి చెందిన స్నేహితుల కుటుంబాలకు ఆర్థిక సాయం

వివిధ కారణాలతో మృతి చెందిన స్నేహితుల కుటుంబాలకు ఎస్‌ఎం రాజు ఆర్థిక సాయం అందజేశాడు. తనతోపాటు చదువుకున్న మృతి చెందిన ముగ్గురుకి ఒక్కొక్కరికి రూ.లక్ష చెప్పున సాయం అందజేశారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Jul 06 , 2024 | 11:56 PM