Share News

RATION: కార్డుదారులకు అందని రేషన

ABN , Publish Date - Jun 08 , 2024 | 11:43 PM

రేషన కార్డుదారులు గంటల తరబడి వేచిచూసినా బియ్యం మాత్రం అందలేదు. దీంతో వారు డీలర్లతో వాగ్వాదానికి దిగారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... గుడిబండ మండలం ఎస్‌. రాయాపురం గ్రామంలో 22, 23 రేషన షాపులున్నాయి. నాలుగు రోజుల క్రితం చౌకధాన్యపు డిపోడీలర్‌, ఎండీయూ ఆపరేటర్‌ కలిసి రేషన బియ్యాన్ని వాటర్‌ట్యాంక్‌ రూమ్‌వద్ద పంపిణీ చేశారు.

RATION: కార్డుదారులకు అందని రేషన
Women waiting for ration rice in S. Rayapuram

డీలర్‌తో గొడవకు దిగిన లబ్ధిదారులు

గుడిబండ, జూన 8: రేషన కార్డుదారులు గంటల తరబడి వేచిచూసినా బియ్యం మాత్రం అందలేదు. దీంతో వారు డీలర్లతో వాగ్వాదానికి దిగారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... గుడిబండ మండలం ఎస్‌. రాయాపురం గ్రామంలో 22, 23 రేషన షాపులున్నాయి. నాలుగు రోజుల క్రితం చౌకధాన్యపు డిపోడీలర్‌, ఎండీయూ ఆపరేటర్‌ కలిసి రేషన బియ్యాన్ని వాటర్‌ట్యాంక్‌ రూమ్‌వద్ద పంపిణీ చేశారు. అయితే పూజారిపల్లి 21వ షాపులో 480 రేషనకార్డులు ఉండగా బఫర్‌స్టాక్‌ ఉండటంతో మేకలగట్ట, పూజారిపల్లి గ్రామస్థులు ఎస్‌.రాయాపురం 23వ షాపునకు వచ్చి బియ్యాన్ని తీసుకెళ్లారు. ఎస్‌.రాయాపురం గ్రామంలో 400కుపైగా రేషణ్‌కార్డులు ఉన్నాయి. 22వ షాపులో శనివారం పంపిణీ చేస్తామని చౌకధాన్యపు డిపో డీలరు తెలియజేయడంతో గ్రామంలోని రేషనకార్డుదారులు ఉదయం 6గంటలకే పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు.


ఉదయం నుంచి బియ్యం కోసం బారులుతీరారు. రేషనబియ్యం అయిపోవడంతో వందల మంది లబ్ధిదారులు ఇళ్లకు వెళ్లాల్సివచ్చింది. బియ్యం కోసం వేచివున్నా స్టాక్‌ అయిపోయిందని డీలర్‌ చెప్పడంతో లబ్ధిదారులు గొడవకు దిగారు. అయితే బియ్యం లేవని డీలర్‌, ఎండీయ ఆపరేటర్‌ చేతులేత్తేశారు. వారిద్దరు కుమ్మక్కై బి య్యం స్వాహా చేశారని ల బ్ధిదారులు ఆరోపిస్తున్నా రు. స్టాక్‌పాయింట్‌ నుంచి తక్కువ బియ్యం రేషనషాపులకు చేరడంతో కొంతమందికి మాత్రమే అందా యి. మిగిలినవారికి బి య్యం అందలేదు. రెవెన్యూశాఖ అధికారులు స్పందించి బియ్యం అందని లబ్ధిదారులకు అందేలా చూడాలని కోరుతున్నారు. దీనిపై పుట్టపర్తి డీఎ్‌సఓ కార్యాలయం సీఎ్‌సడీటీ అధికారిణి విజయలక్ష్మి దృష్టికి తీసుకెళ్లగా బియ్యం అందలేదని తన దృష్టికి వచ్చిందని, పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.

Updated Date - Jun 08 , 2024 | 11:43 PM