Share News

Breaking News: అసెంబ్లీ సమావేశాలు..

ABN , First Publish Date - Nov 21 , 2024 | 10:45 AM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల లైవ్ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.

 Breaking News: అసెంబ్లీ సమావేశాలు..
Breaking News

Live News & Update

  • 2024-11-21T11:38:17+05:30

    కూటమి ప్రభుత్వ నినాదం ఇదే

    • అమరావతి: ఒకే రాష్ట్రం ఓకే రాజధాని అనేది కూటమి ప్రభుత్వ నినాదం

    • అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా ప్రణాళికలు చేస్తున్నాం

    • విశాఖను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతామని గతంలో హామీ ఇచ్చాం

    • డాటా సెంటర్ పాలసీకి రూపకల్పన చేశాం

    • గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు, ఐటీ కంపెనీలకు సంబంధించిన ఒక్క కాన్ఫరెన్సు జరగలేదు

    • వైసీపీ హయాంలో ఐటీ మంత్రి గుడ్డూ-కోడి అంటూ వ్యాఖ్యలు చేశారు.

    • పొరుగు రాష్ట్రాల్లో ఏపీ ఐటీ మంత్రి ఇలా ఉంటారా అంటూ మాట్లాడారు

    • గత ఐదు నెలల్లో చాలా ఐటీ సంస్థలతో సమావేశాలు నిర్వహించాం: మంత్రి నారా లోకేశ్

  • 2024-11-21T11:32:59+05:30

    మంత్రి అనగాని సత్యప్రసాద్ కామెంట్స్

    • అమరావతి: భూముల రీ సర్వేపై శాసనమండలిలో చర్చ

    • భూ సర్వే పేరుతో వైసీపీ సర్కార్ భూదోపిడీకి పాల్పడింది.

    • రీ సర్వేను అడ్డుపెట్టుకొని సొంతవారికి లబ్ది చేకూర్చారు.

    • భూ సర్వే పేరుతో ప్రత్యర్థులను వేధించారు.

    • పద్ధతి ప్రకారం రీ సర్వే జరగలేదు.

    • ప్రచార యావతో ప్రజలను ఇబ్బందులు పెట్టారు.

    • భూ రీ సర్వే పేరుతో 900 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేశారు.

    • ఇప్పటికీ 6631 గ్రామ సభలు పెట్టాం. వేలాది ఫిర్యాదులు వచ్చాయి.

    • గ్రామ సభలు పూర్తయ్యక ప్రణాళిక ప్రకారం ప్రజలకు న్యాయం చేస్తాం: మంత్రి అనగాని సత్యప్రసాద్

  • 2024-11-21T11:08:20+05:30

    వాయు కాలుష్యంపై మండలిలో పవన్ కల్యాణ్

    • అమరావతి: విశాఖలో వాయు కాలుష్యంపై మండలిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

    • వైజాగ్‌లో వాయు కాలుష్యం నిర్దిష్ట ప్రమాణాలకు లోబడే ఉంది

    • ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు

    • వాయి కాలుష్యంపై ఏఎన్‌యూను నివేదిక కోరాం.

    • నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటాం.

    • గతంలో కేంద్ర ప్రభుత్వం రూ.121 కోట్లు కేటాయించింది.

    • వైసీపీ సర్కార్ కేవలం రూ.19 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది.

  • 2024-11-21T10:57:08+05:30

    మంత్రి నిమ్మల రామానాయుడు కామెంట్స్

    • అమ‌రావ‌తి: పుష్కర ఎత్తిపోత‌ల ప‌థకంలో తాళ్లూరు లిప్ట్ పైపులు లీకేజీ

    • లిప్ట్ స్కీమ్ నిర్వహణ, మోటార్ల మ‌ర‌మ్మతులకు సీఎం చంద్రబాబు ప్రాధాన్యం

    • గత ప్రభుత్వం ఎత్తిపోత‌ల‌ను నిర్వీర్యం చేసింది.

    • జ‌గ‌న్ హాయాంలో 1040 లిప్ట్ స్కీముల్లో 450 మూత‌ప‌డ్డాయి.

    • లిప్ట్ స్కీమ్ ప‌ని చేయక బీడుబడ్డ 4 లక్షల ఎక‌రాలు

    • తాళ్ళూరు లిప్ట్ మాత్రమే కాదు.. శిథిలావస్తలో రాష్ట్రంలో అన్ని లిఫ్ట్‌లు

    • తాళ్ళూరు లిప్ట్‌కు సంబందించి పీఎస్సీ పైపుల స్థానంలో ఎమ్మెస్ పైపుల ఏర్పాటుకు అంచ‌నాలు

  • 2024-11-21T10:50:06+05:30

    పీఏసీ చైర్మన్ ఎంపికపై ఉత్కంఠ

    • అమరావతి: పీఏసీ చైర్మన్ ఎన్నికపై అసెంబ్లీలో ఉత్కంఠ

    • పీఏసీ చైర్మన్ పదవికి వైసీపీ నామినేషన్..?

    • నామినేషన్ వేయనున్న సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి.

    • ప్రతిపక్ష పార్టీకే పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వాలంటోన్న వైసీపీ.

    • ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీకి లేని ప్రతిపక్ష హోదా

  • 2024-11-21T10:49:27+05:30

    • వైసీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ

    • అమరావతి: వైఎస్ఆర్ సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం.

    • వైసీపీ అధినేత జగన్ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ భేటీ

    • వచ్చే పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం పై చర్చ

  • 2024-11-21T10:45:13+05:30

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల లైవ్ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.