TG Bharath: కర్నూలు ప్రజలకు కీలక హామీ
ABN , Publish Date - Nov 20 , 2024 | 10:02 PM
సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ బుధవారం సాయంత్రం అమరావతిలో సమావేశమైంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మానవ హక్కుల కమిషన్, లోకాయుక్త కార్యాలయాలు కర్నూల్‌లోనే ఉంటాయిని మంత్రి టీజీ భరత్ బుధవారం కర్నూలులో స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారన్నారు.
కర్నూలు, నవంబర్ 20: మానవ హక్కుల కమిషన్, లోకాయుక్త కార్యాలయాలు కర్నూల్‌లోనే ఉంటాయిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ బుధవారం కర్నూలులో స్పష్టం చేశారు. ఈ కార్యాలయాల విషయంలో నగర ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై మంత్రివర్గ సమావేశంలో సీఎంతో మాట్లాడామని మంత్రి టీజీ భరత్ వెల్లడించారు.
TG Politics: రేపు గాంధీ భవన్‌లో కీలక సమావేశం
తమ ప్రభుత్వం ప్రజల మనోభావాలకు అనుగుణంగా పని చేస్తుందని చెప్పారు. అలాగే ఎన్నికల హామీ మేరకు హైకోర్టు బెంచ్ సైతం కర్నూల్లోనే పెడుతున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు.
Also Read: పింక్ బుక్‌లో వారి పేర్లు.. అదికారంలోకి వచ్చాకా..
2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరింది. అదే సమయంలో రాష్ట్ర విభజన సైతం జరిగింది. దీంతో రాజధాని అమరావతి ప్రాంతంలో ఏపీ తాత్కాలిక హైకోర్టును చంద్రబాబు ప్రభుత్వం నిర్మించింది. ఇక 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు అయింది. అయితే వైఎస్ జగన్.. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో రాజధాని అమరావతికి అసెంబ్లీలో మద్దతు ప్రకటించారు.
Also Read: మావోయిస్టు అగ్రనేత కీలక నిర్ణయం.. రంగంలోకి పోలీసులు
Also Read: Exit Polls: ముగిసిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. రెండు రాష్ట్రాల్లో ఎన్డీయేదే హవా
కానీ ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఏపీకి మూడు రాజధానులు అంటూ ప్రకటించారు. దీంతో న్యాయ రాజధాని కర్నూలు అని ప్రచారం చేశారు. అయితే న్యాయ రాజధానికి సంబంధించిన పనులు ఏవీ గత జగన్ ప్రభుత్వం చేపట్టలేదు. కానీ మానవ హక్కుల కమిషన్, లోకాయుక్త కార్యాలయాల ఏర్పాటుకు చర్యలు మాత్రం చేపట్టింది. ఇంతలో ఎన్నికలు రానే వచ్చాయి.
Also Read: New Bike in Market: ఒక్క సారి ఛార్జింగ్ చేస్తే.. 140 కిలోమీటర్లు దూసుకు పోతుంది..
Also Read: తేగలు తింటే ఇన్ని లాభాలున్నాయా..?
ఈ ఎన్నికల్లో కూటమికి ప్రజలు పట్టం కట్టారు. దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు కేంద్రంగా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని టీడీపీ తన ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించిన నిర్ణయాలను కూటమి ప్రభుత్వం చేపట్టింది.
For AndhraPradesh News And Telugu News