Share News

AP Ministers: జగన్ వైఖరిపై మంత్రులు మండిపాటు

ABN , Publish Date - Jul 05 , 2024 | 06:46 PM

ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ నేత, నాటి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో పిన్నెల్లికి వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మద్దతుగా నిలవడంపై ఏపీ మంత్రులు వాసంశెట్టి సుభాష్, నిమ్మల రామానాయుడు మండిపడ్డారు.

AP Ministers: జగన్ వైఖరిపై మంత్రులు మండిపాటు

అమరావతి, జులై 05: ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ నేత, నాటి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో పిన్నెల్లికి వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మద్దతుగా నిలవడంపై ఏపీ మంత్రులు వాసంశెట్టి సుభాష్, నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. శుక్రవారం అమరావతిలో మంత్రులు ఈ అంశంపై వేర్వేరుగా మాట్లాడారు. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ.. నెల్లూరులో వైఎస్ జగన్ దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారని విమర్శించారు.

Also Read: Lalu Prasad Yadav: త్వరలో మళ్లీ లోక్‌సభ ఎన్నికలు.. సిద్దంకండి


పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓటర్ల ముందు ఈవిఏం ధ్వంసానికి పాల్పడ్డారని గుర్తు చేశారు. సీసీ కెమెరాల ఫ్యూటేజ్‌లో సైతం ఈవీఏం ధ్వంసం చేసిన విషయం బహిర్గతమైందన్నారు. అలాంటి నేరస్థుడైన పిన్నెల్లిని వైఎస్ జగన్ ఎలా వెనకేసుకు వస్తారని మంత్రి సుభాష్ ప్రశ్నించారు. అసలు ప్రజాస్వామ్యం అంటే వైఎస్ జగన్‌కు తెలుసా? అని సందేహం వ్యక్తం చేశారు. పల్నాడులో పిన్నెల్లి ఫ్యాక్షనిస్టు అని.. ఆయన చాలా మందిని హత్య చేశారని ఆరోపించారు. అలాంటి వ్యక్తిని వెనకేసుకు రావడం ద్వారా వైఎస్ జగన్ నైజం ఏమిటనేది అందరికీ తెలిసిపోతోందన్నారు. సమయం ముగిసిపోయినా వైఎస్ జగన్‌కు ములాఖాత్ అవకాశం కల్పించారని గుర్తు చేశారు. ఆర్థిక నేరస్తుడైన వైఎస్ జగన్.. జైల్లో ఉన్న ఓ ఫ్యాక్షనీస్ట్‌ను కలిశారన్నారు. అందుకే 151 సీట్ల నుంచి 11 సీట్లకు వైఎస్ జగన్ దిగిపోయారని ఆయన వ్యంగ్యంగా అన్నారు.

Also Read: LokSabha: ఎంపీలుగా ప్రమాణం చేసిన.. రషీద్, అమృత్ పాల్

ప్రభుత్వంలో ఇంకా వైసిపి వాసనలు పోలేదన్నారు. త్వరలోనే అన్ని చోట్లా ప్రక్షాళన జరుగుతుందన్నారు. వైఎస్ జగన్ ఇక తన సమయాన్ని జైళ్లలో ఉన్నవారిని పలకరించడానికే వెచ్చించాల్సి ఉంటుందన్నారు. సజ్జల రెడ్డి, ధనుంజయ్ రెడ్డి లాంటి వారి కోసమే ఇక ఓదార్పు యాత్రలు చేయాల్సి ఉంటుందని వైఎస్ జగన్‌కు ఈ సందర్భంగా చురకలంటించారు.

Also Read: Bihar: 11 మంది ఇంజినీర్లపై సస్పెన్షన్ వేటు


ఇక జలవనరులు శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. ఈవీఎం బద్దలు కొట్టడం తప్పు కాదని మాజీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడడం దారుణమన్నారు. ఈవీఎంలను బద్దలు కొట్టడమంటే ప్రజాస్వామ్యాన్ని బద్దలు కొట్టడమేనని ఆయన అభివర్ణించారు. ఈవీఎంలను ధ్వంసం చేసిన వ్యక్తిని వెనకేసుకు వచ్చిన మాజీ సీఎం జగన్‌పై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఈసీకి నిమ్మల రామానాయుడు విజ్జప్తి చేశారు. ఈవీఎంల ధ్వంసంపై వైఎస్ జగన్ చేసిన కామెంట్లు.. ఆయనపై చర్యలు తీసుకునేలా ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో జగన్ వ్యాఖ్యలపై సుమోటోగా కేసు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.

Also Read: Viral Video: రీల్స్ కోసం.. ‘పిల్ల చేష్టలు’

ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోకుండా.. ప్రజలనే తప్పు పట్టించేలా వ్యవహరిస్తున్నారంటూ వైఎస్ జగన్‌పై మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో వైఎస్ జగన్ ఇలానే వ్యవహరిస్తే.. మొన్న మూడంకెల్లో వచ్చిన ఫలితాలు.. నిన్న రెండు అంకెలకే పరిమితమయ్యాయన్నారు. భవిష్యత్తులో రెండు అంకెలు కాస్తా.. ఒక అంకేగా మిగులుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు జోస్యం చెప్పారు.

Also Read: Amit Shah: ఆ తర్వాతే.. అసెంబ్లీ ఎన్నికలు..!


మే 13వ తేదీన అటు లోక్‌సభతోపాటు ఇటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల వేళ.. పల్నాడు ప్రాంతంలోని ఓ పోలింగ్ బూత్‌లో నాటి వైసీపీ నేత, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. ఈవీఎంను ధ్వంసం చేశారు. అందుకు సంబంధించిన వీడియో.. సీసీ కెమెరాల్లో నమోదు అయింది. ఎన్నికల అనంతరం ఈ విషయం బహిర్గతమైంది. దీంతో పిన్నెల్లిపై పలు సెక్షన్ల కేసు నమోదయింది. ఆ క్రమంలో అతడిని అరెస్ట్ చేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పిన్నెల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నెల్లూరు సెంట్రల్ జైలుకు ఆయన్ని తరలించారు. దాంతో జులై 4వ తేదీన నెల్లూరు సెంట్రల్ జైల్లో పిన్నెల్లితో మాజీ సీఎం వైయస్ జగన్ ములాఖత్ అయ్యారు. ఈ ములాఖత్ అనంతరం వైయస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ఆ క్రమంలో వైఎస్ జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మంత్రులు సుభాష్, నిమ్మల రామానాయుడు పైవిధంగా స్పందించారు.

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 05 , 2024 | 07:04 PM