Share News

AP Rains: వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛందంగా కదిలొస్తున్న దాతలు

ABN , Publish Date - Sep 08 , 2024 | 07:15 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో బుడమేరు వాగుకు వరద పోటెత్తింది. దీంతో విజయవాడ మహానగరంలోని పలు ప్రాంతాలు జలదిగ్బందనంలో చిక్కుకున్నాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.

AP Rains: వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛందంగా కదిలొస్తున్న దాతలు
AP CM Chandrababu

అమరావతి, సెప్టెంబర్ 08: ఆంధ్రప్రదేశ్‌లో ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో బుడమేరు వాగుకు వరద పోటెత్తింది. దీంతో విజయవాడ మహానగరంలోని పలు ప్రాంతాలు జలదిగ్బందనంలో చిక్కుకున్నాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.

ఈ నేపథ్యంలో వరద సహాయక చర్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఆ క్రమంలో వరద బాధితులను ఆదుకునేందుకు ముందు రావాలని దాతలకు సీఎం చంద్రబాబు విజ్జప్తి చేశారు. ఈ నేపథ్యంలో పలువురు దాతలు స్వచ్చందంగా ముందుకు వచ్చి సీఎం సహాయక నిధికి ఇప్పటికే భారీగా విరాళాలు అందజేశారు.

Also Read: Kolkata: ఈడీ తనిఖీలు.. రూ. 6.5 కోట్ల విలువైన బంగారం పట్టివేత


విజయవాడలో ఆదివారం సీఎం చంద్రబాబును కలిసి పలువురు దాతలు విరాళాలు అందజేశారు. ఏపీ పోలీస్ అధికారుల సంఘం రూ.11 కోట్ల 12 లక్షల 50 వేల చెక్కును సీఎం చంద్రబాబుకు ఆ సంఘం అదికారులు అందజేశారు. అలాగే దీపక్ నెక్స్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత ఏవీ సుబ్రహ్మణ్యం రూ. కోటి అందించారు.

Also Read: Bihar: మగధ్ ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో తప్పిన ప్రమాదం


వాటర్ సప్లై కాంట్రాక్టర్స్ అసోసియేషన్ రూ. 50 లక్షలు ఇచ్చింది. వై. రాజారావు రూ.10 లక్షలు, కె.సాంబశివరావు రూ.5 లక్షలు, సీహెచ్. పూర్ణ బ్రహ్మయ్య రూ.5 లక్షలు, డాక్టర్ శరత్ బాబు రూ.5 లక్షలు, సి.టీ.చౌదరి రూ.2.55 లక్షలు, శ్రీ కోవిల్ ఫ్లాట్స్ ఓనర్స్ రెసిడెంట్ అసోసియేషన్ రూ.2, 21,116, వెలగపూడి సత్యనారాయణ రూ.2 లక్షల 116 వేలు, ఎమ్. శ్రీనివాసరావు రూ.2 లక్షలు, పువ్వాడ రామకృష్ణ రూ.2 లక్షలు, సీహెచ్. శివరామకృష్ణ రూ.1 లక్షా 32 వేలు, బి. నవీన్ బాబు రూ.1 లక్షా 116 వేలు, జాస్తి శైలజారాణి రూ.1 లక్ష, జె.శాంభవి రూ.1 లక్ష, శశాంక్ చౌదరి రూ.1 లక్ష, ఎస్. సాంబశివరావు రూ.1 లక్ష, ధూళిపాళ్ల రామకృష్ణ రూ.1 లక్ష, డాక్టర్ యు.గంగాధర్‌రెడ్డి రూ.1 లక్ష, చెరుకూరి వెంకటరావు రూ.1 లక్ష, జె.సత్యనారాయణ మూర్తి రూ.1 లక్ష, ఏపీ ప్రదేశిక్ మార్వాడి సమ్మెళనం రూ.1 లక్ష, ఎన్.నాగేశ్వరరావు రూ.70 వేలు, రాణి శారదా రూ.50 వేలు, పమిడి భానుచందర్ రూ.50 వేలు, నూతక్కి వాణి రూ.50 వేలు, గుత్తికొండ వెంకటేశ్వరరావు రూ.50 వేలు, కె.భవానీ రూ.35 వేలు, దేవినేని సుధారాణి రూ.30 వేలు, వి.రామకృష్ణ రూ.25 వేలు, ఎమ్.అరుణ కుమారి రూ.25 వేలు, యలమంచిలి నళిని కుమారి రూ.25 వేలు, మోహిత్ చక్రి తరుష్ రూ.20 వేలు, గద్దె ఝాన్సీరాణి రూ.10 వేలు తదితరులు సీఎం చంద్రబాబును వ్యక్తిగతంగా కలిసి చెక్కులు అందజేశారు.

Also Read: Video Viral: వీడెవడండీబాబు.. వినాయకుడి చేతిలో లడ్డూ ఎత్తుకెళ్లాడు..


మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో వరద ప్రభావిత ప్రాంతాలను కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల పరిశీలించారు. ఇంకోవైపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలపై కేంద్రం వెంటనే స్పందించింది. అందులోభాగంగా రూ. 3,300 కోట్ల ఆర్థిక సాయంగా అందించింది. ఈ మొత్తాన్ని తక్షణ సాయంగా అందించినట్లు కేంద్రం ప్రకటించింది. అలాగే టాలీవుడ్‌లోని పలువురు నటీనటులు సైతం మేము సైతం అంటూ ముందుకు వచ్చి భారీగా విరాళాలను ప్రకటించిన విషయం విధితమే.

Also Read: Kolkata: ఎంపీ పదవికి రాజీనామా.. సీఎం మమతకు ఘాటు లేఖ

Read More National News and Latest Telugu News Click Here

Updated Date - Sep 08 , 2024 | 07:17 PM