Share News

Can the 'Ganga' flow : కాల్వకు ‘గంగ’ సాగేనా

ABN , Publish Date - Sep 14 , 2024 | 11:26 PM

ఎన్ని ప్రభుత్వాలు మారినా రైతుల తలరాతలు మారడంలేదు. తెలుగుగంగ కాల్వ ప నులు పూర్తికాకపోవడంతో చెరువులకు నీరు నింపలేకున్నా రు. ఫలితంగా రైతుల కళ్లల్లో కన్నీళ్లు తప్ప మరేమీ మిగల డంలేదు. పనులు పూర్తి కాకపోవడంతో బ్రహ్మంసాగర్‌లో నీరున్నా చెరువులకు చేరలేదు.

Can the 'Ganga' flow : కాల్వకు ‘గంగ’ సాగేనా
అట్లూరు వద్ద అసంపూర్తిగా ఉన్న తెలుగుగంగ కాల్వ

సాగర్‌లో నీరున్నా... కాల్వల్లో శూన్యమన్నా

సర్వేల తో సరి - నిర్మాణాలు ఎప్పుడు మరి

కుందూ పనులు ఎత్తిపోతలేనా ?

అట్లూరు, సెప్టెంబరు 14: ఎన్ని ప్రభుత్వాలు మారినా రైతుల తలరాతలు మారడంలేదు. తెలుగుగంగ కాల్వ ప నులు పూర్తికాకపోవడంతో చెరువులకు నీరు నింపలేకున్నా రు. ఫలితంగా రైతుల కళ్లల్లో కన్నీళ్లు తప్ప మరేమీ మిగల డంలేదు. పనులు పూర్తి కాకపోవడంతో బ్రహ్మంసాగర్‌లో నీరున్నా చెరువులకు చేరలేదు. అయితే కుందూ నది లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులకు 2019లో టెండర్లు జరిగినా ఇప్పటి వర కు ఆ పనులు ప్రారంభానికి నోచుకోలేదు. ఐదేళ్లుగా సర్వేల తోనే సరిపుచ్చుతున్నారే తప్ప భూసేకరణ పూర్తికాక పోవడం, నిర్మాణంలో చొరవ లేక పనులు సాగడంలేదు. ఈ పనులు జరిగితే కనీసం బ్రహ్మంసాగర్‌ ప్రాజెక్టులో 8 టీఎంసీల నీరు నిల్వ ఉంచుకునే అవకాశం కలుగుతుంది. వైసీపీ ప్రభుత్వంలో ఆగమేఘాలపైన పనులు చేపడతామ ని ఆర్భాటపు ప్రకటనలు చేసిందేతప్ప ఆచరణ శూన్యమని ఈ పనులే చెబుతున్నాయి. వివరాల్లోకెళితే....


Ganga1.gifచుక్కనీరు లేక వెలవెలబోతున్న రెడ్డిచెరువు

అట్లూరు మండలంలోని తెలుగుగంగ కాల్వ పూర్తి కాక చెరువులకు నీరు నింపక రైతుల కళ్లల్లో కన్నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. తెలుగుగంగ కుడి కాల్వకు పక్కనే వెంకటశెట్టిపల్లె చెరువు, రాజుపాలెం చెరువు, ఎర్రబల్లె చెరువు, లింగాల కుంట చెరువు, కుంభగి రి యాదాళ్ల చెరువు, కొండూరు వద్ద మాయమానల కుంట, ఎర్రచెరు వు, రెడ్డిపల్లెవద్ద రెడ్డిచెరువు, అ ట్లూరు వద్ద కొత్తచెరువులకు మూడేళ్లగా తెలు గుగంగ నీరు చె రువుకు చేరలేదు. ఎడమ కాల్వకు క మలకూరు, మన్యంవా రిపల్లె, మాడపూరు, కామసముద్రం, వేమలూ రు, ముతుకూరు గ్రామాల చెరువుకు నీరందక తెలుగుగంగ కాల్వ పూర్తి కాక చెరువుల్లో నీరు నింపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకో వాలని రైతులు కోరుతున్నారు. కుడికాల్వ పక్కనే ఉన్న 11 చెరువులకు ఎడమ కాల్వకు 6 చెరువులకు దాదాపు 3వేల ఎకరాలు అసై న్డ్‌భూములు, పట్టా భూములున్నాయి. ఎస్సీ ఎస్టీ, బీసీ, ఓసీ, బడుగు, బలహీన వర్గాల రైతులు ఎక్కువ సంఖ్య లో ఉన్నారు. వర్షాధార పంటలు వేసి సాగు చేసే రైతులే ఎక్కువ మంది. రూ.11 కోట్లతో వైసీపీ ప్రభుత్వంలో కంట్రాక్టర్‌ 2002లో కుడికాల్వ పనులు మొదలుపెట్టారు.


3-Atlur.gifకాల్వకు అడ్డంగా పోసిన మట్టిని తొలగించని కాంట్రాక్టర్‌

ఇప్పటి వరకు పనులు పూర్తి చేయక అసంపూర్తిగా ఉండడంతో బ్రహ్మంసాగర్‌లో నీరున్నా తెలు గుగంగ కాల్వకు నీరు సాగే పరిస్థితి లేదు. కంట్రాక్టర్‌ను ప్రశ్నిస్తే బిల్లులు సక్రమంగా రావడంలేదని ఇంకా రెండు నెలల్లో పనులు పూర్తి అవుతాయని చెబుతున్నారు. ఖరీఫ్‌ సీజన్‌ ముగుస్తున్నా చెరువులకు చుక్క నీరు చేరకపోవడం తో ఖరీఫ్‌లో భూములు సాగుకు నోచుకోలేదు. రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇకనైనా కూటమి ప్రభుత్వం పెద్దలు, అధికారులు స్పందించి త్వరితగంగా కాల్వ పను లు పూర్తి చేసి నీరు చెరువులకు అందించాలని అట్లూ రు మండల రైతులు కోరుతున్నారు.

ప్రభుత్వం ఆదుకోవాలి

తెలుగుగంగ కాల్వ కింద ఐదెకరాల్లో చీనీ చెట్లు సాగు చేశాను. మూడేళ్లుగా తెలుగుగంగ కాల్వకు నీరు పారక చెరువుకు నీరు చేరక తాను వేసిన బోరు బావిలో నీరు అడుగంటుతోంది. చీనీ చెట్లకు నీరుపారుదల తగ్గు తుంది. కావున తెలుగుగంగ కాల్వ పూర్తి చేసి ప్రభు త్వం రైతులను ఆదుకోవాలని కోరారు.

బత్తల వెంకటసుబ్బయ్య, రైతు, కొండూరు


1pml13.gifకుందూ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనుల సర్వే నిర్వహిస్తున్న అప్పటి స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ (ఫైల్‌)

సర్వేల తోనే సరి.. నిర్మాణాలు ?

పోరుమామిళ్ల, సెప్టెంబరు 14: వెలుగొం డ ద్వారా కాకుండా కుందూనది లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా బ్రహ్మంసాగర్‌కు నీటిని సరఫరా చేస్తే నాలు గు నెలలకు ముందే రైతులకు నీరివ్వవచ్చు. ఈఉద్దేశం తోనే వైసీపీ ప్రభుత్వం కుందూనది వద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు రూ.419 కోట్లు నిధులు కేటాయించింది. అయితే 2019లో టెండ ర్లు జరిగినా ఇప్పటి వరకు ఆ పనులు ప్రారంభానికి నోచుకోలేదు. ఐదే ళ్లుగా సర్వేలతోనే సరిపుచ్చుతున్నారే తప్ప భూసేకరణ పూర్తి కాలేకపోయింది. దువ్వూరు మండలం నేలటూరు వద్ద 2019 డిసెంబ రు 23న ఈ ప్రాజెక్టుకు భూమిపూజ చేశారు. ఇంత వరకు నిర్మాణానికి నోచుకోకపోవడం అప్పటి పాలకుల నిర్లక్ష్యమేనని చెప్పుకోవచ్చు. నాలు గు రోస్ట్‌ర్‌లకు సంబంధించి 2.2 డైపై పులైను, 5.545 కి.మీ పైపులైను ఫస్ట్‌ఫేస్‌లో 4.995, సెకండ్‌ కేటగిరీలో ప్లస్‌ 550 కి.మీ పైపులైను వేసేం దుకు అంచనా రూపొందించారు. జొన్నవరం వద్ద పంప్‌హౌస్‌, నీలాపు రం వద్ద మరో పంప్‌ హౌస్‌ నిర్మించి దాదాపు 8 టీఎంసీల వరద నీటిని 65 రోజుల్లో నిల్వ ఉంచి బ్రహ్మంసాగర్‌కు పంపాలనే అంచనాలు వేశా రు.


దీని కోసం విద్యుత్‌ సరఫరాకు 43.7 ఎండబ్ల్యు వెయిర్‌హైట్‌ 3.85 ఎంటి, లెన్త్‌ 370 ఎంటీ, అప్రోచ్‌ ఛానెల్‌ 300 మీటర్లు పొడవున్న తెలుగుగంగ మెయిన్‌కెనాల్‌కు సరఫరా చేసేందుకు అంచనాలు వేశారు. కానీ ఇంత వరకు ఈ పనులు ఊపందుకున్న పాపాన పోలేదు. దాదాపు 54.38 ఎకరాల భూములకు నష్టపరిహారం అందించాలని, ఇందులో మరో 18 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందని గుర్తించారు. ఈ లిఫ్ట్‌ ఇరిగేష న్‌ పూర్తయి ఉంటే వెలుగొండ ద్వారా వచ్చే నీటి కన్నా నాలుగునెలలు ముందుగానే సప్లి మెంటరీ వరదలతో వచ్చిన నీరు వృథా కాకుండా నిల్వ ఉంచు కుని నియోజకవర్గ ఆయకట్టుకు నీరందించే అవకాశాలున్నాయి. కానీ గత పాల కుల నిర్లక్ష్యంథక్ష ఐదేళ్లుగా సర్వేలతోనే కాలం వెల్ల బుచ్చారు. వర్క్‌మాత్రం టెండరు అయి లిఫ్ట్‌ఇరిగేష న్‌ పనులు త్వరగా పూర్తి చేసి బ్రహ్మంసాగర్‌ ప్రాజెక్టుకు 8 టీఎంసీల నీరు నిల్వ ఉంచుకునే అవకాశం కల్పించి రైతాంగా న్ని ఆదుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయమై తెలుగుగుగంగ ఈఈ క్రిష్ణారెడ్డిని వివరణ కోరగా కుందూ లిఫ్ట్‌ ఇరి గేషన్‌ పనులకు టెండర్లు జరిగాయి. సర్వే కూడా జరిగిందని, ల్యాండ్‌ అక్విజేషన్‌ సంబంధించి రైతులకు ప్రభుత్వం డబ్బు అందించాల్సి ఉంది. ఇవన్నీ పూర్తయితే పనులు చేయించడానికి యంత్రాంగం సిద్ధమ వుతుంది. కొత్త ప్రభుత్వంలో అయినా ఈ కుందూ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులు వేగవంతం కావాలని రైతులు ఎదురు చూస్తున్నారు.

Updated Date - Sep 14 , 2024 | 11:27 PM