AndhraPradesh Govt: తహసీల్దార్ల బదిలీపై ప్రభుత్వం సీరియస్
ABN , Publish Date - Jul 22 , 2024 | 01:57 PM
ఎన్నికలకు ముందు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు తహసీల్దార్లను ప్రభుత్వం బదిలీ చేసింది. అయితే వారికి పోస్టింగ్ ఇచ్చే విషయంలో జిల్లా ఉన్నతాధికారులు చూసి చూడనట్లుగా వ్యహరించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
అమరావతి, జులై 22: ఎన్నికలకు ముందు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు తహసీల్దార్లను ప్రభుత్వం బదిలీ చేసింది. అయితే వారికి పోస్టింగ్ ఇచ్చే విషయంలో జిల్లా ఉన్నతాధికారులు చూసి చూడనట్లుగా వ్యహరించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ అంశాన్ని తాజాగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకు వచ్చింది. ఈ నేపథ్యంలో సదరు వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ అయింది.
ఆ క్రమంలో ఈ అంశంపై కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిష్ట్రేషన్ (సీసీఎల్‌ఏ) జయలక్ష్మీ సోమవారం స్పందించారు. అందులోభాగంగా జిల్లా కలెక్టర్లకు ఆమె కీలక ఆదేశాలు జారీ చేశారు. కమిషన్ ఆదేశాలతో తిరిగి వచ్చిన తహసీల్దార్లను సొంత రెవిన్యూ డివిజన్‌లో నియమించవద్దని ఆ ఆదేశాల్లో సూచించారు. అలాగే తహసీల్దార్లను గతంలో పని చేసిన నియోజకవర్గాల్లో నియమించవద్దని జిల్లా కలెక్టర్లకు సీసీఎల్‌ఏ జయలక్ష్మీ స్పష్టం చేశారు.
ఇటీవల సార్వత్రిక ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ క్రమంలో జోన్-4 పరిధిలోని మూడు ఉమ్మడి జిల్లాలకు బదిలీ అయిన 31 మంది తహసీల్దార్లు తిరిగి వచ్చేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే సీసీఎల్‌ఏ నుంచి ప్రొసిడింగ్స్ వచ్చిన అనంతరం వారంతా సొంత జిల్లాలకు వచ్చేస్తారని అంతా భావించారు.
అలాంటి వేళ.. తహసీల్దార్ల బదిలీ వ్యవహారంలో చోటు చేసుకున్న పరిణామాలను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి బహిర్గతం చేయడంతో.. సీసీఎల్ఏ జయలక్ష్మీ రంగంలోకి దిగారు. ఆ క్రమంలో తహసీల్దార్ల బదిలీపై జిల్లా కలెక్టర్లకు ఆమె కీలక ఆదేశాలు జారీ చేశారు.
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News