Share News

AP Speaker Ayyanna: సభాపతిగా అయ్యన్న

ABN , Publish Date - Jun 23 , 2024 | 05:18 AM

రాష్ట్ర 16వ శాసనసభ సభాపతిగా బీసీ నాయకుడు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం ఉదయం ఆయన ఎన్నికను ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభలో అధికారికంగా ప్రకటించారు. అనంతరం, ముఖ్యమంత్రి

AP Speaker Ayyanna: సభాపతిగా అయ్యన్న

సీనియర్‌ బీసీ నేతకు పట్టం

ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యేలు డుమ్మా

సంప్రదాయాన్ని గౌరవించని జగన్‌

అందరికీ అవకాశం కల్పిస్తా: అయ్యన్న

అసెంబ్లీలో చానళ్లపై నిషేధం ఎత్తివేత

తొలి సంతకం చేసిన స్పీకర్‌ అయ్యన్న

అమరావతి, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర 16వ శాసనసభ సభాపతిగా బీసీ నాయకుడు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం ఉదయం ఆయన ఎన్నికను ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభలో అధికారికంగా ప్రకటించారు. అనంతరం, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్‌లు అయ్యన్నపాత్రుడిని స్పీకర్‌ స్థానం వద్దకు తోడ్కొని వెళ్లారు. అయ్యన్నపాత్రుడు తన స్థానాన్ని అలంకరించారు. అయి తే.. స్పీకర్‌ బాధ్యతలు చేపట్టే సమయంలో సభ సంప్రదాయాల ప్రకారం ప్రతిపక్షం కూ డా ఈ కార్యక్రమంలో పాల్గొని సభాపతికి గౌరవ సూచకంగా ఆయన స్థానం వరకు సాగనంపాలి. కానీ, వైసీపీ నాయకులు ఒక్కరు కూడా శనివారం సభకు హాజరుకాలేదు. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత, ఎమ్మెల్యే జగన్‌ సైతం ఈ సంప్రదాయాన్ని విస్మరించారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా, నర్సీపట్నం నియోజకవర్గానికి చెందిన అయ్యన్న పాత్రుడు టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్నారు. 16 ఏళ్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పదేళ్లపాటు పార్టీకి సేవలందించారు. ఎన్టీఆర్‌ పిలుపుతో 25 ఏళ్ల వయసుల్లో అయ్యన్నపాత్రుడు రాజకీయాల్లోకి వచ్చారు. ఏడు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా విజయం దక్కించుకున్నారు.

సంప్రదాయాలకు పెద్దపీట

సభలో సంప్రదాయాలకు పెద్దపీట వేద్దామని సభ గౌరవాన్ని, హుందాతనాన్ని పెంచుదామని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు తెలిపారు. సభలో తనను ఏకగ్రీవంగా ఎంపిక చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, బీజేపీ నేతలు, ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ దఫా అసెంబ్లీకి మరో విశిష్టత ఉందని, కొత్తగా 88 మంది సభ్యులు సభలో అడుగుపెట్టారన్నారు. మొదటి సారి గెలిచిన వారికి సభలో మాట్లాడే అవకాశం ఇస్తామన్నారు. తనకు జీవితాన్ని ఇచ్చిన టీడీపీని జీవితంలో మరచిపోలేనని స్పీకర్‌ అయ్యన్న తెలిపారు.


సభ పట్ల జగన్‌ గౌరవం బయటపడింది

శాసనసభ పట్ల వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు ఉన్న గౌరవం ఏమిటో ఈ రోజు బయటపడిందని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. ‘ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతి’తో ఆయన మాట్లాడుతూ.. స్పీకర్‌ ఎన్నిక సమయానికి సభలో ఉంటే బాగుంటుందని వైసీపీ నేతలకు శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్‌ ఫోన్‌ చేసి చెప్పారని, అయినా జగన్‌ సభకు రాలేదన్నారు. జగన్‌కు సభా సంప్రదాయాలు పట్టవని అన్నారు. కగా, అయ్యన్న పాత్రుడి గురించి తమిళ వికీపీడియాలో ప్రముఖంగా పేర్కొన్నారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా విజయం సాధించిన ఆయన.. నాలుగుసార్లు మంత్రిగా వ్యవహరించారని తెలిపారు.

Updated Date - Jun 23 , 2024 | 06:48 AM