Share News

AP Elections: కోవురు కేక పెట్టింది... వైసీపీకి దడ పుట్టింది

ABN , Publish Date - Apr 27 , 2024 | 08:26 PM

కోవురు కేక పెట్టింది... వైసీపీకి దడపుట్టిందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎక్కడికి పోయినా ఇదే జనం తమ సభలకు తరలి వస్తున్నారన్నారు. జగన్ పనైపోయిందని చెప్పారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుందన్నారు. అయితే వైయస్ జగన్ దోచుకోవాల్సింది దోచుకున్నానని.. దాచుకోవాల్సింది దాచుకున్నానని చేతులెత్తేశాడంటూ చంద్రబాబు వ్యంగ్యంగా అన్నారు.

AP Elections: కోవురు కేక పెట్టింది... వైసీపీకి దడ పుట్టింది
Chandrababu

నెల్లూరు, ఏప్రిల్ 27: కోవురు కేక పెట్టింది... వైసీపీకి దడపుట్టిందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎక్కడికి పోయినా ఇదే జనం తమ సభలకు తరలి వస్తున్నారన్నారు. జగన్ పనైపోయిందని చెప్పారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుందన్నారు. అయితే వైయస్ జగన్ దోచుకోవాల్సింది దోచుకున్నానని.. దాచుకోవాల్సింది దాచుకున్నానని చేతులెత్తేశాడంటూ చంద్రబాబు వ్యంగ్యంగా అన్నారు.

శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కొవురు అసెంబ్లీ నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాలెంలో చంద్రబాబు ప్రసంగించారు. నాలుగుసార్లు ప్రసన్నకుమార్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించామని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు. అయితే అతడే ఇప్పడు తమపై విమర్శలు చేస్తున్నాడని ఆరోపించారు. ఈ సందర్భంగా కోవురు నుంచి కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అధికార పార్టీ ఎమ్మెల్యేతోపాటు ఆయన అనుచర గణం చేస్తున్న ఆరోపణలను చంద్రబాబు ఈ సందర్భంగా తిప్పికొట్టారు.


ఒక ఆడబిడ్డ అనే గౌరవం కూడా లేకుండా ఆమె గురించి మాట్లాడుతున్నారన్నారు. ఆమె గురించి సోషల్ మీడియాలో గోల చేస్తే పారిపోతుందని అనుకున్నారని.. కానీ ఆమె ఎక్కడికి పారిపోదని చంద్రబాబు స్పష్టం చేశారు. పేటీఎం బ్యాచ్ కుక్కల్లా మొరుగుతున్నారంటూ కోవురు నియోజకవర్గ వైసీపీ శ్రేణులపై ఆయన విరుచుకు పడ్డారు.

రాజకీయాల్లో నైతిక విలువలు ఉండాలన్నారు. కురక్షేత్ర యుద్దం ఆరంభమైందని చెప్పారు. ఈ కురుక్షేత్రంలో మీ సత్తా చూపాలంటూ ప్రజలకు సూచించారు. అసెంబ్లీలో చెప్పా... ఇది అసెంబ్లీ కాదు, కౌరవ సభ అని చెప్పానన్నారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి, సీఎంగా మళ్లీ అడుగు పెడతానని శపధం చేశానని గుర్తు చేశారు.

బటన్ నొక్కి రూ.10లు ఇచ్చి.. అదే బటన్ నొక్కి రూ.1000లు లాగేస్తాడంటూ సీఎం వైయస్ జగన్ వ్యవహారశైలిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు, ఆరోగ్యాలతో ఈ దుర్మార్గులు చెలగాట మాడుతున్నారంటూ వైసీపీ నాయకులపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఈ ప్రచారంలో కోవురు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డితోపాటు నెల్లూరు టీడీపీ లోక్ సభ అభ్యర్థి వేమిరెడ్డి ప్రబాకర్ రెడ్డి పాల్గొన్నారు.

Read National News And Telugu News

Updated Date - Apr 27 , 2024 | 08:27 PM