Share News

Panchayats పంచాయతీలకు మహర్దశ

ABN , Publish Date - Sep 02 , 2024 | 01:57 AM

గత ప్రభుత్వ హయాంలో పంచాయతీలన్నీ నిర్వీర్యం చేశారు. సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేసిన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పంచాయతీలకు జవసత్వాలు వచ్చాయి. 2023-24 సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం నిధులను కోతలు లేకుండా పంచాయతీలకు విడుదల చేసింది.

Panchayats పంచాయతీలకు మహర్దశ
పాకాల పంచాయతీ కార్యాలయం

జిల్లాకు రూ.28.61కోట్ల నిధులు విడుదల

తిరుపతి(కలెక్టరేట్‌), సెప్టెంబరు 1: గత ప్రభుత్వ హయాంలో పంచాయతీలన్నీ నిర్వీర్యం చేశారు. సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేసిన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పంచాయతీలకు జవసత్వాలు వచ్చాయి. 2023-24 సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం నిధులను కోతలు లేకుండా పంచాయతీలకు విడుదల చేసింది. జిల్లాలో 774 పంచాయతీలు ఉండగా 15వ ఆర్థిక సంఘం రెండో విడత టైడ్‌గ్రాంట్‌ కింద రూ.17.16కోట్లు విడుదల చేసింది. ఈ నిధులను పంచాయతీల్లో తాగునీరు, పారిశుధ్యానికి వినియోగించనున్నారు. అన్‌టైడ్‌ గ్రాంట్‌ కింద రూ.11.44కోట్లు విడుదలైంది. ఈ నిధుల్లో గ్రామాల్లో అంతర్గత రోడ్లు, కాలువ పనులు, మొక్కల పెంపకం, విద్యుత్‌ బిల్లుల చెల్లింపులు, వీధిదీపాలు, కమ్యూనిటీ హాళ్లు, అంగన్‌వాడీ, ఆరోగ్యకేంద్రాలు, పశువైద్యశాలల నిర్వహణ తదితర పనులకు ఉపయోగిస్తారు. మేజరు పంచాయతీలకు రూ.5లక్షల నుంచి రూ.8లక్షల వరకు, మైనర్‌ పంచాయతీలకు రూ.90వేల నుంచి సుమారు రూ.4లక్షలు వరకే వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా రూ.28.61కోట్ల నిధులు ఆయా పంచాయతీలకు జమయ్యాయి. దీంతోపాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం రెండో దఫా సుమారు మరో రూ.25కోట్లు మంజూరయ్యాయి.

గ్రామాల అభివృద్ధికి నిధులు వినియోగిస్తాం

గ్రామాల అభివృద్ధికి ఆర్థిక సంఘం నిధులు వినియోగిస్తాం. జనాభా ప్రాతిపదికన ప్రతి పంచాయతీకి నిధులు ఇస్తున్నాం. వీటిని సక్రమంగా వినియోగించడానికి అధికారులు, సర్పంచులు సహరించాలి.

- కలెక్టర్‌ వెంకటేశ్వర్‌

Updated Date - Sep 02 , 2024 | 01:57 AM